మెదక్

దత్తత గ్రామాలలో సామూహిక గృహ ప్రవేశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ములుగు, డిసెంబర్ 15: ముఖ్యమంత్రి దత్తత గ్రామమైన ఎర్రవల్లి, నర్సన్నపేటలలో ఈ నెల 23న సామూహిక గృహ ప్రవేశాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెంకట్‌రాంరెడ్డి పేర్కొన్నారు. గురువారం బావానందా ఆశ్రమంలో వేద పండితులతో వేద పండితులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ దేశంలోనే ప్రప్రతమంగా డబల్ బెడ్రూం ఇండ్లను ఇకేసారి నిర్వహించడం సిఎం కెసిఆర్ ఆకాంక్షలు నెరవేరుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. 500 గృహ ప్రవేశాలకుగానూ 600 వేదపండితులను నియమిస్తున్నట్లు తెలుపుతూ 70 మంది పండితులకు ఒక అధికారిని నియమిస్తూ జిల్లా మండల స్థాయి అధికారులను ఉపయోగించుకుంటున్నామని తెలిపారు. బ్రాహ్మనుల సౌకర్యార్థం బావానందా ఆశ్రమంలో వసతి, భోజన సౌకర్యాలు ఏర్పాటు కోసం ఆశ్రమ నిర్వాహకులతో మాట్లాడమని, వారు సుహృద్భావంతో అంగీకరించాలన్నారు. ఏర్పాట్ల పరిశీలన కోసం అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. అంతకుముందు ఆశ్రమంలోని రుక్మిణీ సమేత పాండురంగస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయనకు తీర్థప్రసాదాలతోపాటు మెమొంటో అందజేసి ఆలయ పూజారులు సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో ఎండిపిఓ సురేందర్‌బాబు, గజ్వేల్ ఆర్డీఓ విజేందర్‌రెడ్డి, తహసీల్దార్ పరమేశం, శ్రీనివాస్‌రెడ్డి, ఎంపిడిఓలు దిలీప్‌కుమార్, శ్రీనివాస్, గజ్వేల్, సిద్దిపేట బ్రాహ్మణులు పాల్గొన్నారు.

యువత చేతుల్లోనే దేశ భవిష్యత్తు
* స్వామి వివేకానందను స్ఫూర్తిగా తీసుకోవాలి
* ప్రభుత్వం అందిస్తున్న చేయూతను సద్వినియోగం చేసుకోవాలి
* యువజనోత్సవాల్లో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
సంగారెడ్డి టౌన్, డిసెంబర్ 15: దేశ భవిష్యత్తు యువతరంపై ఆధారపడి ఉందని, దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన స్వామి వివేకానందను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పిలుపునిచ్చారు. జిల్లా యువజనోత్సవాలను పురస్కరించుకొని జిల్లా యువజనాభివృద్ధి, క్రీడల ఆవఖ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ఉత్సవాల్లో ఎమ్మెల్యే చింతా ముఖ్య అతిధిగా పాల్గొని యువతను ఉద్దేశించి మాట్లాడారు. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉంది కాబట్టి లక్ష్యాన్ని ఎంచుకొని శ్రమించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. యువత ఆర్థిక స్వాలంభన కోసం ప్రభుత్వం వృత్తి నైపుణ్య శిక్షణను ఇవ్వడంతో పాటు విదేశాల్లో ఉన్నత చదువులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తుందన్నారు. ప్రభుత్వం ఇస్తున్న చేయూతను సద్వినియోగం చేసుకొని బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నీ భవిష్యత్తుకు నీవే నిర్మాతవు అన్న స్వామి వివేకానంద సూక్తిని యువత దృష్టిలో ఉంచుకొని లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలన్నారు. లక్ష్యాన్ని సాధించే వరకు పట్టుదల, అకుంటిత దీక్షతో ముందుకు సాగాలన్నారు. స్వామి వివేకనంద జయంతిని పురస్కరించుకొని హైదరాబాద్‌లో జనవరి 12నుండి 16 వరకు నిర్వహించే రాష్ట్ర స్థాయి యువజనోత్సవాలకు జిల్లా స్థాయిలో ప్రతిభ కనబర్చిన యువతను పంపించడం జరుగుతుందన్నారు. సీనియర్ సివిల్ జడ్జి కనకదుర్గ మాట్లాడుతూ భారతదేశంలో యువత శాతం ఎక్కువగా ఉందని, మానవత్వం, సమానత్వం, సామరాస్యతతో మెలగాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతి ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో సిడిసి చైర్మన్ విజేందర్‌రెడ్డి, యుజవన సంఘాల అధ్యక్షుడు కూన వేణుగోపాల్, జిల్లా యువజనాభివృద్ధి అధికారి రాంచంద్రారావు, విద్యార్థులు పాల్గొన్నారు.