మెదక్

ఫీజు రీయంబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటన్‌చెరు, డిసెంబర్ 15: కళాశాల విద్యార్థులకు అందాల్సిన ఫీజు రీయంబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఎబివిపి నాయకులు డిమాండు చేసారు. ఈ మేరకు స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డికి గురువారం వినతిపత్రం అందచేసారు. ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తున్న యువతీ యువకులు తీవ్రంగా ఇబ్బందులు అనుభవిస్తున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఎబివిపి నాయకులు నవీన్‌కుమార్ తదితరులు వాపోయారు. గత రెండు సంవత్సరాలుగా ఇదే పరిస్థితి నెలకొందన్నారు. ఫీజు రియంబర్స్‌మెంట్ బకాయిలు అందకపోవడం ఆయా కళాశాల యాజమాన్యం విద్యార్థులను తీవ్ర ఇక్కట్లకు గురిచేస్తోందన్నారు. బకాయిలు చెల్లించడంలో ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు నానా నరకయాతన అనుభవిస్తున్నారని ఎబివిపి నాయకులు ఆవేదన వ్యక్తం చేసారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఈ విషయంలో అవసరమైన ఆసక్తి కనబరచాలని, పాలకుల దృష్టికి విషయం తీసుకెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.
గుంతలమయంగా మారిన హైవేపై నిరసన
పటన్‌చెరు, డిసెంబర్ 15: జాతీయ రహదారిపై పెద్ద పెద్ద గుంతలు పడినా నాయకులు గాని అధికారులు గాని ఏమాత్రం పట్టించుకోవడం లేదని, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని టిడిపి నాయకులు నిరసన వ్యక్తంచేసారు. పటన్‌చెరు మండలం ముత్తంగి వద్ద జాతీయ రహదారిపై వాహనాలను నిలిపి నిరసన వ్యక్తంచేసారు. జెడ్‌పిటిసి శ్రీకాంత్ అధ్వర్యంలో పలువురు పార్టీ నాయకులు పాలకుల తీరును దుయ్యబట్టారు. గత నెల రోజుల క్రితం కురిసిన వర్షాలకు రహదారి పూర్తిగా గుంతలమయంగా మారిందని, ప్రజలు ప్రతిరోజు నరకయాతన అనుభవిస్తున్నారన్నారు. అనుదినం ఈ రహదారి గుండా జిల్లా కేంద్రానికి రాకపోకలు సాగించే అధికారులు, గాని మంత్రులు గాని ఏమాత్రం పట్టించుకోక పోవడం అత్యంత దారుణమన్నారు. గంటల తరబడి వాహనాలు నిలిచిపోతున్నాయని, ప్రాణాపాయ స్థితిలో ఆదుకునే అంబులెన్స్‌కు సైతం పలుసార్లు దారి దొరకడం లేదన్నారు. ఇప్పటికైనా స్థానిక నాయకులు, అధికారులు జాతీయ రహదారి మరమ్మతుల విషయంలో దృష్టి సారించాలని హితవు పలికారు. ఇంకా ఈ కార్యక్రమంలో పలువురు టిడిపి నాయకులు పాల్గొన్నారు.

విషతుల్యమైన కంపెనీలు వద్దు
ప్రతినిధుల స్పష్టీకరణ

జహీరాబాద్, డిసెంబర్ 15:కొత్తూర్‌ను మరో పటాన్‌చెరువుగా మార్చవద్దని పలువురు సర్పంచ్‌లు ప్రభుత్వాన్ని కోరారు. ప్రశాంతంగా ఉన్న ఈప్రాంతంలో బల్క్ డ్రగ్స్ కర్మాగారం ఏర్పాటుచేసి అశాంతిని నింపరాదన్నారు. కాలుష్య కాసారాన్ని వెదజల్లే, విషతుల్యమైన డెక్కన్ రెమెడీస్ ప్రైవేట్ లిమిటెడ్ లాంటి కర్మాగారాన్ని ప్రారంభించేందుకు అనుమతించరాదని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒక వేళ అనుమతిస్తే వేలాది మంది కుటుంబాలు వీధి పాలవుతాయని ఆందోళన వ్యక్తంచేశారు. కర్మాగారం ప్రారంభం కాకుండా పంచాయతీ తీర్మానాలు సేకరించి కలెక్టర్‌కు సమర్పిస్తామన్నారు. ఈ సందర్భంగా ఒక గ్రామ ప్రతినిధి కృష్ణయ్య మాట్లాడుతూ 25 సంవత్సరాల కిందట రెండు గంటలపాటు దక్కెన్ రెమెడిస్ కర్మాగారాన్ని ప్రారంభించారన్నారు. అప్పట్లో స్థానిక రైతుకు చెందిన 4 గేదెలు, 4 ఆవులు, 10 మేకలు చనిపోయాయన్నారు. దీంతో స్థానికులు అందోళన వ్యక్తం చేయడంతో మూసేశారన్నారు. ఇప్పుడు తిరిగి ప్రారంభించేందుకు ప్రయత్నించడంపై వారు ఆందోళన వ్యక్తంచేశారు. ఈ కర్మాగారంలో నీరు, వాయు, భూమి కలుశితమవుతాయన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ కంపెనీ ప్రారంభానికి అనుమతించరాదని డిమాండ్‌చేశారు. అనుమతిస్తే ఉద్యమిస్తామని హెచ్చరించారు. నాయకులు భాస్కర్ మాట్లాడుతూ ప్రజాభిప్రాయ సేకరణ లోపభూయిస్టంగా నిర్వహించారని ఆరోపించారు. మరోసారి విస్తృత స్థాయిలో నిర్వహించాలని డిమాండ్‌చేశారు. విషతుల్యమైన ఈ కంపెనీ ప్రారంభానికి ప్రజామోదంలేదన్నారు. ఈ అంశాన్ని మొదట ప్రతినిధులు, మంత్రులు, అనంతరం సిఎం దృష్టికి తీసుకుని పోయి కర్మాగారం ప్రారంభాన్ని అడ్డుకుంటామన్నారు. ఈ సమావేశంలో కొత్తూర్(బి), దిడిగి, బూచినెల్లి, బూర్దిపాడ్, ఖలీల్‌పూర్, మిర్జాపూర్, రేజింతల్, అల్గోల్, పస్తాపూర్ తదితర గ్రామాల సర్పంచ్‌లు, ప్రతినిధులు భాస్కర్, శంకర్, సంగారెడ్డి, నర్సింహారెడ్డి, రామకృష్ణారెడ్డి, గౌతంరెడ్డి, వీరారెడ్డి, గంగ్వార్ శ్రీనివాస్, గోపాల్, అల్గి శంకర్, కృష్ణయ్య, అమిత్‌కుమార్, హన్మంత్‌రెడ్డి, రాజ్‌కుమార్, జనార్దన్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, రాములు, సతీష్, విజయ్‌కుమార్ తదితరులున్నారు.