మెదక్

పేటను డివిజన్ చేసేవరకూ ఉద్యమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామాయం పేట, డిసెంబర్ 19: రామాయం పేటను రెవెన్యూ డివిజన్ సాదించే వరకు ఉద్యమం చేస్తాం..ఎన్ని అడ్డంకులు ఎదురొచ్చినా కుల, ప్రజా, కార్మిక, కర్షక, వ్యాపార, వాణిజ్య, విద్యా, యువజన సంఘాల సహకారంతో డివిజన్ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతామని అఖిలపక్షం నేతలు ప్రకటించారు. రిలేదీక్షలు సోమవారం నాటికి 95రోజులకు చేరుకోగా దీక్షలకు పట్టణ యాదవ సంఘం అద్వర్యంలో డోల్‌చప్పుళ్ళతో పట్టణంలో బారీ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. యాదవ సంఘం సభ్యులకు అఖిలపక్షం నాయకులు పూలమాలలు వేసి రిలేదీక్షలో కూర్చుబెట్టారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ గత 95రోజులుగా రామాయంపేటను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన రిలేదీక్షలు కొనసాగిస్తామన్నారు. అన్ని ప్రాంతాల మనోబావాలను గుర్తించిన ముఖ్యమంత్రి రామాయంపేట ప్రాంత ప్రజల మనోబావాలు గుర్తించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే రోడ్డపై వంటావార్పు, ఆందోళనలు, రిలేదీక్షలు, సెల్‌టవర్ ఎక్కి నిరసనలు, రోడ్డు దిగ్బందాలు, బైక్‌ర్యాలీతో కలెక్టర్‌ట్ ముట్టడి తదితర నిరసన కార్యాక్రమాలు చేసినా స్థానిక ఎమ్మెల్యే స్పందించకపోవడం శోచనీయం అన్నారు. ఇప్పటికైనా డిప్యూటి స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి జోక్యం చేసుకోని డివిజన్ ఏర్పాటుకు కృషి చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో అఖిలపక్షం నాయకులతో పాటు యాదవ సంఘం నాయకులు ఎర్రగొల్ల రాములు, గాయింతి మల్లయ్య, బత్తుల రాజు, పల్లె సిద్దయ్య, బసన్నపల్లి ముత్యాలు, గాయింతి చంద్రయ్య, తాడెం మల్లయ్య, బత్తుల శ్యామయ్య, అన్నమైన చిన్న ఎల్లయ్య, అన్నమైన వెంకటి, అన్నమైన పెద్దరాములు, పల్లె చిన్న సిద్దయ్య, ఎర్రగొల్ల కిష్టయ్య, ఎర్రగొల్ల మల్లేశం, మానుక రాములు, బత్తుల శ్రీశైలం, పొడేండ్ల మహేష్, ఎర్రగొల్ల శ్రీను, గాయింతి రాజు, ఎర్రగొల్ల యాదగిరి, అన్నమైన మల్లయ్య, అన్నమైన రాజయ్య, గాయింతి మల్లయ్య, ఎర్రగొల్ల కిషన్, ఎర్రగొల్ల రమేష్, గాయింతి శ్రీశైలం, ఎర్రగొల్ల చంద్రంలు పాల్గొన్నారు.

‘ఇందిరమ్మ’ సొమ్ములు ఎన్నడిస్తరు?

మెదక్, డిసెంబర్ 19: మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి అనేక సమస్యలను మూటకట్టుకొని ప్రజలు వారి వారి విన్నపాలను సోమవారం విజ్ఞప్తుల రూపంలో అధికారులకు సమర్పించుకున్నారు. ఇందులో భాగంగా టేక్మాల్ మండలం అచ్చన్నపల్లి గ్రామానికి చెందిన మహిళలు మూడు సంవత్సరాల క్రింద ఇందిరమ్మ ఇళ్ల్లు నిర్మించుకున్నారు. కొందరికి రెండు బిల్లులు ఇచ్చారు, మూడు బిల్లు ఇవ్వలేదు. మరికొందరు పూర్తి స్థాయిలో ఇళ్ల్లు నిర్మించుకున్నా అసలే బిల్లులు ఇవ్వలేదు. బాధిత మహిళలందరు సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో విజ్ఞప్తి చేసుకున్నారు. వీరిలో అంతమ్మ మూడు సంవత్సరాల క్రింద ఒక లక్ష 50 వేలతో ఇల్లు నిర్మించుకుంది. రెండు బిల్లులు ఇచ్చారని, మూడో బిల్లు ఇవ్వలేదని ఆమె వాపోయింది. సోని, స్వరూప ఇందిరమ్మ ఇళ్ల్ల బిల్లుల విషయంలో చారుని సత్తమ్మ తన ఒంటిపై ఉన్న బంగారం, ఇంటి ముందున్న పశువులు అమ్ముకొని ఇల్లు నిర్మించుకున్నామని తెలిపారు. కానీ ప్రభుత్వం నుండి వచ్చే డబ్బు రాక హైదరాబాద్‌లో అడ్డమీద కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నామని ఆ బాధితులు తెలిపారు. అచ్చనపల్లి రాజయ్య కోరిక మేరకు కలెక్టరేట్‌కు దరఖాస్తు చేసుకోడానికి వచ్చినట్లు వారు తెలిపారు. రేగోడ్ మండలం బురనివాడి తండాకు చెందిన రుక్మిణిబాయ్ భర్త, మామ రవి, వాల్యనాయక్ 2013 సెప్టెంబర్ 12న కరెంట్ షాక్‌తో మరణించాడు. ఒంటరిగా మిగిలిన రవి భార్య రుక్మిణిభాయ్‌కి ముగ్గురు పిల్లలు ఉన్నారు. చనిపోయినప్పటి నుండి ఇప్పటి వరకు విద్యుత్ శాఖ అధికారులుగానీ, ప్రభుత్వంగానీ నష్టపరిహారం ఇవ్వలేదని జిల్లా కలెక్టరేట్‌లో దరఖాస్తు చేసుకున్నారు. వీరు సంయుక్త జిల్లాలోని కలెక్టర్ కార్యాలయంలో దరఖాస్తులు చేసుకున్నట్లు తెలిపారు. గత ఏడాది నుండి బిడీ కార్మికులకు పింఛన్లు బంద్ అయినవారందరు ప్రజావాణిలో దరఖాస్తులు చేసుకున్నారు. అందులో నస్కల్ గ్రామానికి చెందిన ఆశాబేగం, అమీన, శ్యామల, లక్ష్మీ, రాణి, నస్రీన్, ఫరీదా, అమినాగౌస్, వీణ ఉన్నారు. వీరందరికి గత ఏడాది నుండి పింఛన్లు రావడం లేదని ప్రజావాణిని ఆశ్రయించారు. మెదక్ మండలం శివాయిపల్లి గ్రామానికి చెందిన కోల నాగమ్మ (75), వితంతురావు కోల మంజుల వీరిరువురికి కూడా పింఛన్‌లు రద్దయినట్లు దరఖాస్తు చేసుకున్నారు. నిజాంపేట మండలం కల్వకుంట గ్రామానికి చెందిన నాంచారి లక్ష్మారెడ్డి, నాగరాజు, శ్రీనివాస్‌గౌడ్, ఎల్.లక్ష్మీగౌడ్‌లను కులం బహిష్కరించినట్లు దరఖాస్తు చేసుకున్నారు. 2015 ఏప్రిల్ 22న కులం బహిష్కరించడంతో నాగరాజు అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు లక్ష్మారెడ్డి తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా కుల బహిష్కరణకు గురైన వ్యక్తులు దరఖాస్తు చేసుకున్నారు. తూప్రాన్ డిఎస్పీని ఆదేశిస్తూ కుల బహిష్కరణకు గురైన వారికి న్యాయం చేయాలని సిఎం ఆదేశించాడని ఆయన తెలిపారు. కౌన్సిలింగ్ పేరుతో కాలయాపన చేస్తున్నారుగానీ తమకు న్యాయం చేయడం లేదని ఆయన తెలిపారు. సంకాపూర్ మదిర దర్గ తండాలో సుమారు 60 కుటుంభాలు ఉన్నాయి. వీరికి ఇండ్లులేవు, నీళ్లులేవు, గుడిసెలలో నివసిస్తున్నారు. సర్పంచ్ పోచయ్య, కార్యదర్శి నరేందర్ పట్టించుకోవడం లేదని ఆ గ్రామ బాధితులు వివరించారు. రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పొలాల బావుల వద్దకు వెలితే నీళ్ల కోసం రానివ్వడం లేదని వారు తెలిపారు. చాలా ఘోర పరిస్థితులు ఎదుర్కొంటున్నట్లు వారు తెలిపారు. వీరందరు ప్రజావాణిని ఆశ్రయించారు. ఈ విధంగా అనేక సమస్యలతో ప్రజావాణికి దరఖాస్తులు 138 చేసుకున్నారు. ఈ ప్రజావాణిని జాయింట్ కలెక్టర్ సురేష్‌బాబు, డిఆర్‌ఓ నిర్వహించారు. కాగా దరఖాస్తు పెట్టుకున్న 138 ఆర్జీలకు ఎలాంటి న్యాయం జరుగుతుందో వేచి చుద్దాం.