మెదక్

ఆపన్నులకు అన్నివేళలా అండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, డిసెంబర్ 25 : ఆపదలో ఉన్నవారికి, అత్యవసర వైద్య సేవలు అవసరమైన వారికి సిఎం సహాయ నిధి ఆపన్నహస్తంగా అందచేస్తున్నట్లు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మంత్రి నివాసంలో ఆదివారం నియోజక వర్గంలోని 45 మందికి 12.10 కోట్ల సిఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో పనిచేసిన ఉమ్మడి రాష్ట్ర మంత్రులు, సీమాంధ్ర నాయకుల్లా పెత్తనం చేయకుండా అత్యవసర పరిస్థితుల్లో బాధితులు కోరిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా సిఎం రిలీఫ్ ఫండ్ నుంచి వేగంగా నిధులు అందజేయిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అత్యవసర సమయంలో ఆనారోగ్యంతో బాధపడుతున్నవారికీ ఎంతో మంది నిరుపేదలకు సిఎంఆర్‌ఎఫ్ ఫండ్ పేరిట ఇతోధికంగా నిధులు విడుదల చేయిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి సాయం కోసం ఆర్జీలు వచ్చిన వెంటనే వారిని ఆదుకుంటామని పేర్కొన్నారు. ఆపదలో ఉన్నవారికి, అత్యవసర వైద్య సేవలు అవసరమైనవారికి, ఆనారోగ్యంతో ఉన్నవారికి అండగా ఉంటానని మంత్రి భరోసా నిచ్చారు. నియోజక వర్గంలోని 4మండలాలకు చెందిన వారికి రూ.12.10 కోట్ల చెక్కులు అందచేశారు. పట్టణంలో 18 మంది లబ్ధిదారులకు 5.27 లక్షలు, సిద్దిపేట మండలంలో 12 మందికి 3.5 లక్షలు, చిన్నకోడూరు మండలంలో 8 మందికి 2.20 లక్షలు, నంగనూర్‌లో 2.10 సిఎం రిలిఫ్ ఫండ్ చెక్కులను బాధితులకు అందచేశారు. సిఎం సహాయ నిధి ద్వారా డబ్బులు మంజూరు చేసిన సిఎం కెసిఆర్, మంత్రి హరీష్‌రావుకు జీవితాంతం రుణపడి ఉంటామని లబ్ధిదారులు పేర్కొన్నారు.
శాంతిని ప్రభోదించిన ఏసుక్రీస్తు
* మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి
సంగారెడ్డి టౌన్, డిసెంబర్ 25: ప్రపంచానికి శాంతిని ప్రబోదించింది ఏసుక్రీస్తు అని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డి (జగ్గారెడ్డి) అన్నారు. క్రిస్మస్ పండగను పురస్కరించుకొని ఆదివారం ఆయన కేక్‌ను కట్ చేసి కైస్తవ్ర సోదరులకు పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఏసు చూపిన శాంతి మార్గంతో ముందుకు సాగాలన్నారు.

అన్నివర్గాల వారికీ అభయం

పెద్దశంకరంపేట, డిసెంబర్ 25: రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను ఆదుకునేందుకు ప్రణాళికబద్దంగా పనిచేస్తుందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండల తెరాస కార్యాలయం ఆవరణలో పలువురికి సిఎం రిలీప్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అండగా ఉండాలనే దిశగా పనిచేస్తుందన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఆనారోగ్యాలు, ప్రమాదాలకు గురైన వారికి సిఎం రిలీప్ ఫండ్ ద్వారా ఎప్పటికప్పుడు నిధులు మంజూరు చేయడం తెరాస ప్రభుత్వానికే చెల్లిందన్నారు. ఖేడ్ నియోజకవర్గ పరిధిలో వందలాది మందికి సిఎంఆర్‌ఎఫ్ చెక్కులు అందజేసినట్లు తెలిపారు. పెద్దశంకరంపేట మండలంలో ఐదుగురికి సిఎంఆర్‌ఎఫ్ చెక్కులు మంజూరు కాగా వాటిని ఎమ్మెల్యే పంపిణీ చేశారు. మండల తెరాస అధ్యక్షులు విజయరామరాజు, ఎంపిటిసి సభ్యులు వేణుగోపాల్‌గౌడ్, సుభాష్‌గౌడ్, మాణిక్యరెడ్డి, మురళీపంతులు, మండల పరిషత్ ఉపాధ్యక్షులు రాజు పాల్గొన్నారు.