మెదక్

మెదక్ చర్చికి పోటెత్తిన భక్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్, డిసెంబర్ 25: క్రిస్మస్ వేడుకలకు భక్తులు పోటెత్తారు. ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన మెదక్ మహాదేవాలయం (చర్చి)లో జరిగిన మొదటి ఆరాధన కార్యక్రమానికి భక్తులు తగ్గుముఖం కనిపించారు. రెండవ ఆరాధన కార్యక్రమం 9:30 గంటలకు జరగాల్సి ఉంది. అప్పటికీ భక్తులు పలుచగా కనిపించారు. 10 గంటలకు ప్రారంభమైన రెండవ ఆరాధన కార్యక్రమం తరువాత ఉదయం 11 గంటల నుండి భక్తులు పోటెత్తారు. అది వేల సంఖ్యలో కాదు, లక్షల సంఖ్యలో తరలివచ్చారు. చలి కారణమా, నోట్ల రద్దు కారణమా తెలియదుగానీ ఉదయం ఆరాధనలో భక్తులు తక్కువగా కనిపించినప్పటికీ 11 గంటల నుండి భక్తుల తాకిడి అధికమైంది. పోలీసులకు కూడా భక్తులను అదుపుచేయడం సాధ్యం కాలేకపోయింది. మెదక్ చర్చిలో ఏర్పాటు చేసిన పశువుల పాక, క్రిస్మస్ ట్రీని సందర్శించుకోడానికి భక్తులు భారీ క్యూ కట్టారు. వారిని అదుపుచేయడానికి కూడా పోలీసులు కష్టపడ్డారు. ముఖ్యంగా ప్రార్దన ప్రసంగం పూర్తి అయిన తరువాత భక్తులు తమ పిల్లల పుట్టువెంట్రుకలు తీసుకోడానికి పశువుల పాకను సందర్శించుకోడానికి తోపులాట జరిగింది. చర్చి భక్తులతో కిక్కిరిసిపోయింది. చర్చి పరిసర ప్రాంతం కూడా భక్తులతో పోటెత్తింది. జిల్లా ఎస్పీ చందనాదీప్తి ఏర్పాటు చేసిన భారీ పోలీస్ బందోబస్తు ఈ భక్తులను అదుపుచేయడానికి బాగా సహకరించిందని గురువులు పేర్కొన్నారు. మొదట ఇంత పోలీస్ బందోబస్తు ఎందుకని గురువులు ప్రశ్నించుకున్నారు. ఒక దశలో మెదక్ చర్చి గుడి ప్రాంగణంలో అదుపుతప్పిన భక్తులను అదుపుచేయాలని మైక్‌లో పోలీసులు చర్చి లోపలికి రావాలని గురువులు కోరారు. కరెంట్ లేకపోవడంతో భక్తులు మంచినీటి కోసం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మెదక్ చర్చి ప్రాంగణం భక్తులతో నిండిపోయింది. రోడ్లపై వాహనాలతో ట్రాఫిక్ అంతరాయాలు ఏర్పడ్డాయి. ఇంత జనం ఎక్కడ నుండి వచ్చిందో పోలీసులు ఆశ్చర్యపడ్డారు. జనం లేక కుర్చీలలో కూర్చొని సెల్‌ఫొన్‌లో ఆటలాడుతున్న పోలీసులందరు ఒక్కసారి నివ్వెరబోయారు. ఎక్కడి నుండి వచ్చారు ఈ భక్తులని వారిని కంట్రోల్ చేయడంలో నిమగ్నమయ్యారు. అప్పుడు జిల్లా ఎస్పీ అంటే మజకా అంటూ కొందరు పోలీసులు చర్చించుకోవడం కనిపించింది. జర్మని దేశానికి చెందిన క్యాతరిన కుటుంభ సభ్యులు నికోలస్, అనెటే, వెరోనిల క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. హైదరాబాద్‌కు చెందిన సెట్ ఆనెస్ విద్యార్థులు, ఆచార్యులు రెండవ ఆరాధన కార్యక్రమంలో పాల్గొన్నారు. క్రిస్మస్ వేడుకల్లో మెదక్ చర్చి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా మెదక్ ఎస్పీ చందనాదీప్తి పర్యవేక్షణలో క్రిస్మస్ వేడుకలు కొనసాగుతున్నాయి. మెదక్ చర్చి రెండు ప్రధాన గేట్లు, చర్చిలో ఉన్న మూడు గేట్లలో కూడా మెటల్ డిటెక్స్‌ను ఏర్పాటు చేశారు. గతంలో ఎన్నడు ఇంత పకడ్భంది పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయలేదు. భక్తులకు మాత్రం ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పోలీసులు జాగ్రత్తతో ప్రార్దనలకు స్వేచ్చా వాతావరణాన్ని కల్పించారు. భక్తులకు అవసరమైన అన్ని వస్తువులకు సంబంధించిన దుకాణాలు ఏర్పాటు చేశారు. భక్తులు ఆహ్లాదకర వాతావరణాన్ని, సంతోషాన్ని పంచుకోడానికి రంగులరట్నం, జారుడు బల్ల, డ్యాన్ బేబి డ్యాన్స్, బైక్ రైడింగ్, షూటింగ్, సర్కస్ తదితర వినోదాలు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా సూర్యుడు అస్తమించగానే మెదక్ చర్చి అలంకరణ, వివిధ రకాల విద్యుత్ కాంతులతో దగదగలాడుతుంది. భక్తులకు అవసరమైన టాయిలెట్స్, మంచినీటి వసతులు కూడా ఏర్పాటు చేశారు. క్రిస్మస్ వేడుకల సందర్భంగా ఎంతో మందికి ఉపాది కూడా దొరుకుతుంది. సుమారు 300 నుండి 500 దుకాణాలు వెలిశాయి. ఇక్కడ దొరకని వస్తువు ఏది లేదు. భక్తులకు అవసరమైన ప్రతి ఒక్క వస్తువు అందుబాటులో ఉండే విధంగా దుకాణాలు ఏర్పాడ్డాయి. చర్చిలో భక్తులకు ప్రత్యేకంగా ప్రార్దన కౌంటర్లు, పుట్టువెంట్రుకల కౌంటర్లు ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత తొలి క్రిస్మస్ పండుగ విజయవంతమైంది. ఈ క్రిస్మస్‌లో తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి, రాజ్యసభ్య సభ్యులు ఆనంద భాస్కర్, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిలు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు.
జహీరాబాద్‌లో,,
జహీరాబాద్ : క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం ఈ ప్రాంతంలోని చర్చిలన్ని భక్తులతో నిండిపోయాయి. ఈ వేడుకల్లో ఎమ్మెల్సీ ఎండి.్ఫరీదుద్ధీన్ పాల్గొని కేక్ కట్‌చేశారు. కేక్ పంచుకుని పరస్పరం పర్వదిన శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ పర్వదాన్ని స్థానికులు ఎంతో భక్తిశ్రద్దలతో శ్యాంతి యుతంగా జరుపుకోవాలన్నారు. పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ ప్రంత క్రిష్టిన్లకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఏసు క్రీస్తు త్యాగాలను స్మరించుకున్నారు. అదేవిధంగా చర్చిల్లో ఏసు క్రీస్తు జన్మ వృత్తాంతాన్ని చిన్నారులు నాటికల ద్వారా ప్రదర్శించి అలరించారు. క్రిస్మస్ ట్రీ, దానికి అమర్చిన కానులకలు, శాంతక్రాజ్‌లు చిన్నారులకు పంచిన గిఫ్టులతో ఎంతగానో ఆకట్టుకున్నారు. మెథటిస్ట్, సెవెంత్‌డే, కాథలిక్, టౌన్ తదితర చర్చిల్లో పర్వదిన ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కొత్తబట్లతో చర్చిలకు తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు, భక్తులు, ప్రముఖులు పాల్గొన్నారు. టిడిపి ఇంచార్జి వై.నరోత్తం క్రిస్మస్ వేడుకల్లో పల్గొన్ని కేక్ కట్‌చేశారు. క్రిస్టియన్ సోదరులకు పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కండెం నర్సిములు, మాజీ అధ్యక్షుడు మంకాల్‌సుభాష్ ఇతర నాయకులు చర్చిలను సందర్శించి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. స్థానికులతో కలిసి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. చర్చి ఆవరణలో నిర్వహించిన కార్యక్రమాల్లో యువత చురుకుగా పాల్గోంటు ముందున్నారు. పర్వదినాన్ని పురస్కరించుకుని చర్చి ఆవరణలను ఎంతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారు. చర్చితోపాటు ఆవరణలోని చెట్లకు కూడా రంగురంగులు విధ్యుత్ దీపాలతో అలంకరించి ఎంతో ఆహ్లాదంగా తీర్చిదిద్దారు.

అప్పుల బాధతో
యువరైతు ఆత్మహత్య
ములుగు, డిసెంబర్ 25: చేసిన అప్పులు తీర్చలేక కుటుంబ పోషణ భారమై ఓ యువరైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని అన్నాసాగర్ గ్రామంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. దీనికి సంబందించి ములుగు ఎఎస్‌ఐ షాబుద్దీన్, కుటుంబ సభ్యులు అందించిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కర్రోల్ల వెంకటేశ్ (28) తనకున్న సొంత పొలాన్ని అమ్ముకొని అదే గ్రామంలో కొంత పొలాన్ని కౌలుకు తీసుకొని కొన్ని సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నాడు. గత రెండుమూడేళ్ళుగా సరైన వర్షాలు లేక పంటలు పండకపోవడంతో అప్పులు పెరగడం, పండించిన పంటలు సరైన దిగుబడి రాక పెట్టుబడులు కూడా చేతికందకపోవడంతో కుటుంబ పోషణ కూడా భారమైంది. చేసిన రూ. 4లక్షల అప్పును తీర్చే మార్గం కనిపించకపోవడంతో మనస్తాపానికి గురై ఇంట్లోనే ఆదివారం ఉదయం ఉరివేసుకున్నాడు. ఇది గమనించిన భార్య లక్ష్మి చుట్టుపక్కల వారికి తెలియజేయగా వారు వచ్చేలోగానే వెంకటేశ్ మృతి చెందాడు. మృతునికి భార్యతోపాటు ఇద్దరు పిల్లలున్నారు.