మెదక్

క్యాష్‌లెస్‌కు శ్రీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, జనవరి 3: పెద్దనోట్ల రద్దుతర్వాత నగదు ఇబ్బందులను తొలగించేందుకు ప్రత్యామ్నాయంగా క్యాష్‌లెస్ లావాదేవీలకు సిద్దిపేట శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి కెసిఆర్ సిద్దిపేట నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా క్యాష్‌లెస్ లావాదేవీలు జరపాలని నిర్ణయించడంతో ఆ దిశగా అందరు సమాయత్తమైనారు. ఇందులో భాగంగా నియోజకవర్గంలోని అధికారులు, బ్యాంకర్లు సర్వే చేసి అకౌంట్లులేనివారిని గుర్తించి అకౌంట్, డెబిట్,క్రెడిట్ కార్డులు అందించారు. వ్యాపారులకు స్వైప్‌మిషన్లు అందించారు. ఈక్రమంలో మేముసైతం క్యాష్‌లెస్‌కు సిద్దమని గ్రామీణాభివృద్ధి శాఖ సంకల్పించింది. నియోజకవర్గాన్ని డిజిటలైజేషన్, ఈకామర్స్ విధానాలను డిఆర్‌డిఏ శాఖ ఉద్యోగులకు, ఉన్నతాధికారులకు వివరించారు. మంగళవారం నాడు కలెక్టర్ వెంకట్‌రాంరెడ్డి, డిఆర్‌డిఓ సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో గ్రామీణాభివృద్ధి ఉద్యోగులు నగదురహిత లావాదేవీలు నిర్వహిస్తామని ప్రతినబూనారు. పెద్దనోట్ల రద్దుతో ఆన్‌లైన్‌బ్యాంకింగ్, క్యాష్‌లెస్ విధానాలు నిర్వహిస్తామని 145మంది ఉద్యోగులు డెబిట్‌కార్డుల ప్రదర్శన చేపట్టి క్యాష్‌లెస్‌కు ఊతమిచ్చారు.