మెదక్

నగదురహిత లావాదేవీల్లో సిద్దిపేట ఆదర్శం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట అర్బన్, జనవరి 6: నగదురహిత లావాదేవీలు చేసేందుకు ప్రజలు ముందుకు రావాలని జెసి హన్మంతరావు అన్నారు. మండలంలోని రాఘవాపూర్, లక్ష్మిదేవిపల్లి, రావురూకుల, పుల్లూరు, బంజేరుపల్లి, బుస్సాపూర్, వెంకటాపూర్ గ్రామాల్లో నగదురహిత లావాదేవీల పై అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు నగదురహితం నిర్వహించేందుకు ముందుకురావాలన్నారు. ప్రభు త్వం సిద్దిపేట నియోజకవర్గాన్ని నగదురహితంగా మార్చేందుకు శ్రీకారం చుట్టిందని, ప్రస్తుతం నియోజకవర్గంలో ఇబ్రహీంపూర్, ఇర్కోడ్, తోర్నాల గ్రామాలు నగదురహితంగా ప్రకటించారని, మరో రెండు గ్రామాలు బుస్సాపూర్, వెంకటాపూర్‌ను మంత్రి హరీష్‌రావు అధికారికంగా వందశాతం నగదురహితంగా ప్రకటిస్తారన్నారు. నియోజకవర్గం దేశానికే ఆదర్శంగా నిలిచేందుకు ప్రజలు సహకారం అందించాలని కోరారు. నగదురహితం నిర్వహణకు ఫ్రజలు సిద్దంగా ఉన్నా నెట్‌వర్క్ ప్రాబ్లంతో సమస్యలు వస్తున్నాయని, త్వరలో వాటిని అధిగమించి వందశాతం నగదురహితంగా మారుతుందన్నారు. ఏ గ్రామానికి పోయినా ప్రజల నుంచి మంచి స్పం దన వస్తుందన్నారు. వారిలో కూడా ఉత్సాహం వెల్లివిరుస్తుందన్నారు. డి ఆక్టివేట్ ఉన్న అన్ని అకౌంట్లు ఆక్టివేట్ చేసే ప్రక్రియ సాగుతుందని, అందులో బ్యాంకులు నిమగ్నమైనాయన్నా రు. క్యాష్‌లెస్ పై సర్పంచులు, ఎం పిటిసిలు, యువత, కిరాణ యజమానులకుఅవగాహన కల్పించా రు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ సమ్మిరెడ్డి, ఏపిఎం శ్రీనివాస్, సర్పంచులు, ఎంపిటిసిలు పాల్గొన్నారు.
స్వైప్‌మిషన్ ద్వారా టీ తాగిన జెసి
మండలంలోని రావురూకులలో నగదురహిత లావాదేవీల అవగాహన నిర్వహించిన సందర్భంగా గ్రామంలో జెసి హన్మంతరావు స్వయంగా కార్డుద్వారా స్వైప్ చేసి డబ్బులు చెల్లించి టీ తాగారు. ప్రజలకు ఆదర్శంగా తాను నిలవాలన్న ఉద్దేశంతో ఆయన శ్రీకారం చుట్టారు.

రేపు పుల్లూరులో వైకుంఠ ద్వార దర్శనం
సిద్దిపేట అర్బన్, జనవరి 6: స్వయంభూలక్ష్మినర్సింహస్వామి క్షేత్రంలో ఈనెల 8న వైకుంఠ ఏకాదశి మహోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. వారంరోజులుగా గుడిలో ముమ్మరంగా పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే పుల్లూరు బండ పై వెలసిన స్వామి కోనేరు శుద్ది చేశారు. కాకతీయకాలంలో గణపతి దేవుడు ఆలయాన్ని నిర్మించారు. స్వామితో పాటు వెంకటేశ్వరుని విగ్రహాలు ఉన్నా యి. త్రికుఠేశ్వరాలయం, ఉడయవర్ల గుడి, 4కోనేరులు ఉన్నాయి. ఈయేడు కూడా వైభవంగా నిర్వహించేందుకు నిర్వహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. విద్యుత్ లైట్లు, పూలతో అలంకరిస్తున్నారు. ఏకాదశి నాడు ఉదయం పల్లకీసేవ అనంతరం సహజసిద్దంగా ఉన్న ఉత్తర ద్వారం గుండా భక్తుల దర్శనం ప్రారంబైతుంది. సర్పంచు సరోజన, అర్చకులు రం గాచారి, శ్రీనివాసాచారి, నేతలు దశరథంగౌడ్, రామారావు, బాలనర్సు మాట్లాడుతూ ప్రజలు ఉత్సవాల్లో పాల్గొని పునీతులు కావాలని కోరారు.