మెదక్

ప్రభుత్వాలు నియంతగా వ్యవహరిస్తున్నాయి.

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్, జనవరి 7: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నియంతలుగా వ్యవహరిస్తున్నాయని, వీరికి త్వరలో ప్రజలు గుణపాఠం చెప్పక తప్పదని మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ్మా హెచ్చరించారు. శనివారం పెద్దనోట్ల రద్దుకు వ్యతిరేఖంగా నిరసన తెలుపుతూ చేపట్టిన ధర్నాలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ పోరాటం ఆగదన్నారు. 130 కోట్ల ప్రజలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఆయన విచారం వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం ప్రజాహక్కులను కాలరాస్తుందన్నారు. రైతులు బాగా నష్టపోయారన్నారు. చిన్న సన్నకారు రైతులు దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్నారని ఆయన తెలిపారు. రైతు కూలీలకు బ్యాంక్‌లతో సంబంధం లేదన్నారు. ఐదు శాతం దోపిడిదారులకే పెద్దనోట్లను రద్దుపరిచారని, 95 శాతం అమాయక ప్రజలను కేంద్ర ప్రభుత్వం శిక్షిస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ బ్యాంక్‌లో ఉన్న నల్లధనాన్ని వెలికితీసి జన్‌ధన్ ఖాతాల్లో 15 లక్షల రుపాయల వంతున వేస్తారని చెప్పిన మోదీ హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. దేశంలోని నల్లధనం, నకిలి నోట్లు ఏరివేయడానికి రద్దు చేసిన పెద్దనోట్ల స్థానంలో ప్రత్యామ్నయ చర్యలు ఎందుకు తీసుకోలేదని దామోదర్ ప్రశ్నించారు. రెండు లక్షల ఎటియంలు ఉన్నప్పటికీ ప్రజలు అందుబాటులోకి రాలేదని, కొత్త నోటు సరిదిద్దే బాధ్యత మీదికాదా అని దామోదర్ రాజనర్సింహ్మా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నోట్లు రద్దైన మూడు రోజులకు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడుతూ ఇది దిక్కుమాలిన, బుద్ధిలేని చర్య అన్నారని , ఢిల్లీకి చేరుకొని ప్రధానమంత్రితో ఏ ఒప్పందాలు కుదుర్చుకున్నారోగానీ ఢిల్లీ నుండి తిరిగి వస్తుండగానే ప్రధాని నిర్ణయం హర్షించదగిన విషయమని కెసిఆర్ అన్నమాటలను ఆయన గుర్తు చేశారు. మోదీ, కెసిఆర్ ఇరువురి మధ్య కుదుర్చుకున్న ఒప్పందాలపై ప్రజలకు చాలా అనుమానాలకు దారి తీస్తున్నట్లు ఆయన తెలిపారు.
* మాజీ మంత్రి సునితాలక్ష్మారెడ్డి
ఎఐసిసి ఆదేశాల మేరకే పెద్దనోట్ల రద్దుపై నిరసన కార్యక్రమాలు చేపట్టినట్లు మాజీ మంత్రి, డిసిసి అధ్యక్షురాలు సునితాలక్ష్మారెడ్డి మాట్లాడుతూ తెలిపారు. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ బిజేపి రద్దు చేసిన కార్యక్రమం మంచి పరిణామం కాదన్నారని ఆమె గుర్తు చేశారు. నోట్ల రద్దుతో, గుండె పోటు, ఆత్మహత్యలు చేసుకున్న వారు, క్యూలైన్లలో సృహా కోల్పోయి మరణించిన వారు 115 మంది ఉన్నట్లు ఆమె తెలిపారు. వీరందరికి ప్రభుత్వం ఎలాంటి ఆర్థిక సహకారాలు అందించలేదని ఆమె ఆరోపించారు. బిజేపి, టిడిపి నాయకుల వద్దనే పెద్ద నోట్లు దొరుకుతున్నాయని ఆమె ఆరోపించారు. పంటలకు పెట్టుబడులు లేక, నీళ్లున్నా సాగు చేయలేని దుస్థితిలో రైతులు ఉన్నారని తెలిపారు. ప్రజల అండదండలతో ప్రజా ఉద్యమంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాడుతామని ఆమె హెచ్చరించారు. ఐటిఐ విద్యార్థి మాట్లాడుతూ నిరుద్యోగిగా కొనసాగుతున్నానని, నోట్ల రద్దుతో సాగు చేసుకోలేక పస్తులుంటున్నామని తెలిపారు. ఆత్మహత్యే శరణ్యమని భావిస్తున్నట్లు ఆ విద్యార్థి ఆంజనేయులు అనగా స్పందించిన సునితారెడ్డి మాట్లాడుతూ ఆత్మహత్యలు చేసుకోవద్దు. మీ సమస్యలు పరిష్కరించుకుంటకు మీ వెంట ఉంటామని భరోసా ఇచ్చారు.
* మాజీ మంత్రి డాక్టర్ గీతారెడ్డి
ఆర్థిక శాస్తవ్రేత్తలను సంప్రదించకుండానే ప్రధాని నోట్ల రద్దు చేయడంతో దేశం సంక్షోభంలో పడిందని మాజీ మంత్రి డాక్టర్ గీతారెడ్డి మాట్లాడుతూ తెలిపారు. చిన్న చిన్న పరిశ్రమల్లో పనిచేస్తున్నవారు కూడా రోడ్డున పడ్డారన్నారు. 80 శాతం ఎటియంలు మోరాయిస్తున్నాయన్నారు. ఆర్‌బిఐ ప్రింట్ చేసిన నోట్లు బయటకు ఎందుకు వెళ్లాయో జవాబు చెప్పాలన్నారు. ప్రధానమంత్రి పెద్ద కంపెనీల ద్వారా సొమ్మును రాబట్టుకున్నారని ఆమె ఆరోపించారు. శ్రావణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ మోదీ, కెసిఆర్ తోడుదొంగలన్నారు. మెదక్ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి, జగ్గారెడ్డి, మాజీ ఎంపిపి సురేష్ షేట్కార్, ప్రభాకర్, సుప్రభాతరావు, రాంచంద్రాగౌడ్, తిరుపతిరెడ్డి, సంజీవ్‌రెడ్డి, జయపాల్‌రెడ్డి, అమరసేనారెడ్డి తదితరులు ప్రసంగించారు.
నిర్మాణాల్లో నాణ్యత లోపిస్తే చర్యలు
* జాయింట్ కలెక్టర్ హన్మంతరావు
గజ్వేల్, జనవరి 7: గజ్వేల్ పట్టణంలో రూ. వేల కోట్ల వ్యయంతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులపై విమర్శలు వెల్లువెత్తుతున్న క్రమంలో శనివారం జాయింట్ కలెక్టర్, గజ్వేల్ అభివృద్ధి అథారిటీ అధికారి హన్మంతరావులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ సందర్బంగా 100 పడకల ఆసుపత్రి నిర్మాణాలతోపాటు ఆడిటోరియం, ఎడ్యుకేషన్‌హబ్, సమీకృత ప్రభుత్వ భవన నిర్మాణాలను ఆయన పరిశీలించారు. అయితే కాంట్రాక్టర్లు నాణ్యతా ప్రమాణాలకు తిలోదకాలిచ్చి నిర్మాణాలు చేపడుతున్నట్లు గ్రహించిన జాయింట్ కలెక్టర్ హన్మంతరావు వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే సంబంధిత అధికారుల పర్యవేక్షణలోనే పనులు జరగాలని, అందుకు భిన్నంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యంగా గజ్వేల్ అభివృద్ధిపై సిఎం కెసిఆర్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నందున అధికారులు జరుగుతున్న పనులపై నిరంతరం నిఘా కొనసాగించాలని, నాణ్యతా ప్రమాణాలు పాటించి చక్కటి నిర్మాణాలు జరిగేలా చూడాలని చెప్పారు. కాగా మొదటగా ఆర్డీఒ కార్యాలయంలో జెసి సమీక్షా సమావేశం నిర్వహించి రెవెన్యూ పనులను వేగవంతం చేయాలని, సాదాబైనామాలకు చట్టబద్దత కల్పించాలని, విఆర్‌ఓలు స్థానికంగా ఉండాలని ఆదేశించారు. ఈ కార్యక్రమాలలో ఆర్డీఒ విజేందర్‌రెడ్డి, పంచాయత్‌రాజ్ డిఈఈ జానంగౌడ్, తహసీల్దార్ బిక్షపతి, ఎంపిడిఒ దామోదర్‌రెడ్డితోపాటు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.