మెదక్

ఈ-సంగారెడ్డి, మొబైల్ యాప్‌పై పారదర్శకంగా వ్యవహరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, జనవరి 7: జిల్లా అధికారులు ఈ సంగారెడ్డి మొబైల్ యాప్‌లో వచ్చిన ఫిర్యాదులను పారదర్శకంగా పరిష్కరించాలని తద్వారా ప్రజల్లో జవాబుదారి తనం పెరుగుతుందని కలెక్టర్ మానిక్కరాజ్ కణ్ణన్ అన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి అధికారుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లా అధికారులు ఫిర్యాదులు అందిన వెంటనే తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వచ్చిన ఫిర్యాదులు పరిష్కరించగలిగినవా లేదా అనే విషయాన్ని సదరు వ్యక్తికి స్పష్టమైన కారణాలు చూపుతూ ఆన్‌లైన్‌లో తెలుపాలన్నారు. ఈ సంగారెడ్డి మొబైల్ యాప్‌లో వచ్చే ఫిర్యాదులు భవిషత్తులో శాశ్వత రికార్డుగా ఉండిపోతుందన్నారు. తద్వారా ఆయా శాఖలు ఎన్ని ఫిర్యాదులను పరిష్కరిస్తాయో అని తెలుస్తుందన్నారు. ఫిర్యాదు జవాబు ఇచ్చేటప్పుడు ముఖ్యంగా జిల్లా అధికారులు సుస్పష్టమైన వివరణ ఇవ్వాలన్నారు. ఫిర్యాదులను పరిష్కరించే ప్రక్రియలో ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొంటే యాప్‌లో ఉన్న హెల్ప్ డెస్క్‌కు మెయిల్ చేసి పరిష్కరించుకోవచ్చని అన్నారు. ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో అందుకున్న ఫిర్యాదులను కూడా వీలైనంత మేరకు మొబైల్ యాప్‌లో సంబంధిత శాఖకు అప్‌లోడ్ చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటి నుండి గ్రీవెన్స్ మానిటరింగ్ నిరంతరం కొనసాగుతుందని, అధికారులు తమను తాము అనుకూలంగా మలచుకోవాలని కోరారు.
అధికారులు సెలవులో వెళ్లేటప్పుడు తమ సెలవు దరఖాస్తును ఈ సంగారెడ్డి ద్వారా కలెక్టర్‌కు నేరుగా పంపించవచ్చని సూచించారు. జిల్లాలో వ్యవస్థాగత ప్రసవాలను పెంచేందుకు జిల్లా యంత్రాంగం తరపున అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యంగా మొదటి సారి కాన్పుకు వెళ్లే మహిళల్లో కొంత మందిని గుర్తించిన అధికారులు స్వయంగా ఫోన్ చేసి వారి బాగోగులు తెలుసుకునేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. కలెక్టరేట్ నుండి జిల్లా అధికారులకు వచ్చిన గర్భిణీల ఫోన్ నంబర్లకు సంబంధిత అధికారి ఫోన్ చేసి వారిలో సాధారణ కాన్ఫుకు వెళ్లేలా అవగాహన కల్పిస్తారని అన్నారు. ప్రతి రోజు ఐదు మంది గర్భిణీలతో స్వయంగా తానే మాట్లాడి వారి ఆరోగ్యం పట్ల అవగాహన కల్పిస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. అంతకుముందు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈ సంగారెడ్డి మొబైల్ యాప్ గురించి జిల్లా అధికారులకు ఎన్‌ఐసి డిఐఓ శాంతికుమార్ అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, డిఆర్‌ఓ రఘురాంశర్మ జిల్లా అధికారులు పాల్గొన్నారు.