మెదక్

ఎకరం పంట ఎండకూడదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, జనవరి 7: వచ్చేరబీ సీజన్‌లో ఒక్క ఎకరం పంట ఎండిపోకుండా వ్యవసాయాధికారులు యాక్షన్‌ప్లాన్ సిద్ధం చేసుకోవాలని నీటిపారుదల శాఖమంత్రి హరీష్‌రావు వెల్లడించారు. శనివారం విద్యుత్ డిఇ కార్యాలయంలో ఎస్‌ఇ సదాశివరెడ్డి, డిఇ శ్రీనివాస్‌రెడ్డి నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, ట్రాన్స్‌కో ఏఇలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ యేడు వానలు విస్తృతంగా కురిశాయని, చెరువులు నిండాయని, రైతులు యాసంగి సీజన్‌లో అధికంగా పంటలు వేశారని, ఒక్క ఎకరం సైతం ఎండిపోకుండా నాణ్యమైన విద్యుత్ అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఇందుకోసం ముందుగా యాక్షన్‌ప్లాన్ రూపొందించుకొని లోఓల్టేజి తలెత్తకుండా అవసరమైన చోట అదనపు ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రం ఏర్పడితే విద్యుత్ సమస్య తీవ్రమైతుందని గత పాలకులు భయాందోళనకు గురి చేశారన్నారు. కానీ సిఎం కెసిఆర్ రాష్ట్రం వచ్చాక ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్ కొని సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకున్నారన్నారు. గతంలో గ్రామాల్లో, పరిశ్రమలకు విద్యుత్ కోతలు విధించారని, కానీ తెలంగాణ సర్కార్ అధికారంలోకి రాగానే కోతలు ఎత్తివేసిందన్నారు. గ్రామాలకు 24గం. విద్యుత్ సరఫరా, పరిశ్రమలకు సరిపోయే విద్యుత్ అందించామన్నారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయానకి 9గం. నాణ్యమైన విద్యుత్ అందిస్తుండడం వల్ల కొంతకాలంగా మూలనపడ్డ బోర్లు సైతం రైతులు రిచార్జీ చేస్తున్నారని, వారి నమ్మకాన్ని వమ్ముచేయకుండా కరంట్ సరఫరా చేయాలన్నారు. ముందుగానే అవసరమైన ట్రాన్స్‌ఫార్మర్లు సిద్ధం చేయాలన్నారు. రైతులచే 25కెవి ట్రాన్స్‌ఫార్మర్ల కోసం 4950డిడిలు కట్టిస్తే మంజూరు చేస్తారన్నారు. గతంలో 50వేల సామాగ్రి అందిస్తే ప్రస్తుతం ప్రభుత్వం 70వేలకు పెంచిందన్నారు. విద్యుత్ అధికారులు 2నెలలు పూర్తిగా రైతు సమస్యల పై దృష్టిసారించి పంటలు ఎండిపోకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకుగాను అధికారులు, రైతులు, ప్రజాప్రతినిధులు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఓవర్‌లోడ్ సమస్య రాకుండా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. సిద్దిపేటకు 10.43కోట్లు మంజూరైనాయని, అదనపు విద్యుత్ లైన్లు, స్తంభాల ఏర్పాటుకు ఎల్టీలైన్లు మరమ్మత్తు చేయించుకోవాలన్నారు. దీన్‌దయాన్ పథకం కింద 125రూ. కట్టిస్తే కొత్తగా మీటర్ మంజూరు చేస్తారన్నారు. రాష్ట్రంలోనే అధికంగా సబ్‌స్టేషన్లు ఉన్న నియోజకవర్గం సిద్దిపేట అన్నారు. విద్యుత్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతుల సమస్యలు పరిష్కరించాలన్నారు. అనంతరం నియోజకవర్గంలోని మండలాల వారీగా ప్రజాప్రతినిధులు, రైతులచే విద్యుత్ సమస్యపై సమీక్షించారు. రైతు సమస్యలపై సత్వరం స్పందించే అధికారులతో రైతులతో సన్మానిస్తామన్నారు. గుర్రాలగొంది ఏఇ రైతు సమస్యల పట్ల కృషి చేయడం వల్ల ఏఇ బాలకిషన్‌గౌడ్‌కు అవార్డు సిఫారసు చేయాలని అదేశించారు. వారంవారం అధికారులు సమీక్ష నిర్వహించి సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు. తానుకూడా 15రోజులకోసారి సమావేశం నిర్వహిస్తానని తెలిపారు. రైతులకు పంట పూర్తిగా చేతికొచ్చేలా విద్యుత్ సమస్యరాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్లు,్భవనాలు అభివృద్ధి కాదని, రైతులు కష్టాలుతీరి చేతినిండా పంట వచ్చినప్పుడు కండ్లలో ఆనందం చూస్తే అభివృద్ధి జరుగుతుందన్నారు. రైతు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. సమావేశంలో నియోజకవర్గంలోని ఎంపిపిలు మాణిక్యరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, సర్పంచులు, ఎంపిటిసిలు, నేతలు, అధికారులు పాల్గొన్నారు.
కొనసాగుతున్న క్రతువు

సంగారెడ్డి, జనవరి 7: సమాజ శ్రేయస్సు, సుభిక్షం కోసం నిర్వహిస్తున్న శ్రీ సహస్ర చండీ మహా యాగం కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో కొనసాగుతోంది. జిల్లా కేంద్రమైన సంగారెడ్డి పట్టణ నడిబొడ్డులో ఉన్న శ్రీ భవాని భువనేశ్వరీ దేవస్థానం నిర్వహిస్తున్న మహా క్రతువును తొగుట పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతి స్వామి పర్యవేక్షణలో నిరాటకంగా నిర్వహిస్తున్నారు. మహారాష్ట్ర, నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్, బిహార్ తదితర ప్రాంతాల నుంచి తరలివచ్చిన 150 మంది రుత్విక్‌లో వేద మంత్రాలు పఠిస్తూ మహా యాగాన్ని నిర్వహిస్తున్నారు. యాగంతో పాటుగా ఇతర ధార్మిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తుండటంతో ఆలయ ప్రాంగణం అమ్మవారి స్మరణతో మారుమోగుతుంది. శనివారం ఆవాహిత దేవతా పూజ, పారయణములు, హవనములు, ప్రదోషపూజ, తీర్థ ప్రసాద వితరణతో పాటుగా మధ్యాహ్నం 2 గంటలకు మహా లింగార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు నిరంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డి సైతం హాజరై యాగాన్ని దర్శించుకుంటున్నారు. గత యేడాది జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లిలోని ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యవసాయ క్షేత్రం వద్ద నిర్వహించిన అయుత చండీ మహా యాగానికి ఏ మాత్రం తీసిపోకుండా ఇక్కడ కూడా ఏర్పాట్లను భారీగానే చేసారు. విస్తృత ప్రచారం లేకపోవడంతో భక్తుల సంఖ్య సాధారణంగా ఉందని, అంత పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చినా స్థలాభావ సమస్య తలెత్తుతుందని నిర్వాహకులు పేర్కొంటున్నారు. సోమవారం నాటి పూర్ణాహుతి కార్యక్రమంతో యాగం పరిసమాప్తం కానుంది.