మహబూబ్‌నగర్

కంది కొనుగోలు కేంద్రం ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోస్గి, జనవరి 9: గత కొంతకాలంగా ఈ ప్రాంత రైతులు పండించిన పంటను వికారాబాద్ జిల్లా తాండూర్ ప్రాంతానికి అమ్మడానికి వెళ్తుండేవారు. గిట్టుబాటుధర రాక రైతులు ఇబ్బందులు పడుతున్నారని గుర్తించి స్థానిక మార్కెట్ యార్డు అధికారులు సోమవారం కోస్గి మార్కెట్ యార్డులోనే కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. జిల్లా మార్కెట్ అధికారి భాస్కరయ్య ఆద్వర్యంలో ఈ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. స్థానికంగా ఉన్న రైతులకు క్వింటాల్ కందులకుగాను ప్రభుత్వం ఇచ్చే గిట్టుబాటు ధర రూ.5050లను ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. రైతులకు వారి ఖాతాల్లో వారం రోజుల్లో డబ్బులు జమ చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపిపి సోమరాజేశ్వర్, జడ్పిటిసి బాలరాజు, ఎంపిటిసి రాజేష్, నాయకులు రామకృష్ణ, హన్మంతు, మార్కెటింగ్‌శాఖ అధికారులు, సిబ్బంది సతీష్, బాలు, రమేష్‌లతో పాటు తదితరులు ఉన్నారు.

చట్టసభల్లో బిసిలకు
రిజర్వేషన్లు కల్పించాలి
* బిసి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణయ్య
మహబూబ్‌నగర్‌టౌన్, జనవరి 9: పార్లమెంట్ చట్టసభల్లో బిసిలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని బిసి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం అంబేద్కర్ కళాభవన్‌లో బిసి యువగర్జన సమావేశానికి ఆయన ముఖ్యఅతిధిగా హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో బిసి అభ్యర్థికి ముఖ్యమంత్రి పదవిని ఇవ్వలేదని జనాభాలో 52శాతం ఉన్న బిసిలకు పదవులు రాకపోవడం బాధకరమన్నారు. ముస్లీంలకు 12శాతం రిజర్వేషన్ల కోసం ఏ విధంగా ముస్లీంలు ఐక్యంగా ఉన్నారో బిసిలు కూడా ఐక్యంగా ఉండి రిజర్వేషన్ల కోసం పోరాటలు చేయాలన్నారు. రాజకీయ నాయకులు కేవలం వారి స్వలాభాల కోసమే పనిచేస్తున్నారని బిసి నాయకులను రాజకీయంగా అనిచివేశారని కావున బిసి కులస్థులందరు బిసి అభ్యర్థిని ఎన్నుకుని ఓటు వేయాలని ఆయన సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నభోజన పథకం పదవతరగతి వరకు కల్పిస్తున్నారని అలా కాకుండా ఇంటర్ విద్యార్థులకు కూడా భోజన సదుపాయం కల్పించాలన్నారు. ముఖ్యంగా విద్యార్థులు ఫిజు రియింబర్స్‌మెంట్ కోసం ఆందోళనలు చేస్తున్నారని ఒకే విడతలో రూ.4వేలకోట్ల పెండింగ్ బకాయిని చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. బిసి కులస్థులు గ్రామగ్రామాన పర్యటించి బిసిలను ఐక్యం చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో బిసి నాయకులు మున్నూరు రాజు, ఎన్‌పి వెంకటేష్, రాజీవ్‌ముదిరాజ్, ఉపాద్యాయ ఎమ్మెల్సీ విజయ్‌కుమార్, మధు, లక్ష్మణ్‌రావు తదితరులు పాల్గొన్నారు.