మహబూబ్‌నగర్

కల్వకుర్తి ఆయకట్టుకు తూట్లు పొడుస్తున్న ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జనవరి 9: కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి రాష్ట్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తుందని టిజెఎసి జిల్లా కన్వీనర్ రాజేందర్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం మహబూబ్‌నగర్‌లోని టిఎన్‌జిఓ భవనంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ గత ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం రూపకల్పన చేశారని అయితే ప్రస్తుతం ఆ పథకానికి ముఖ్యమంత్రి తూట్లు పొడుస్తున్నారని ఆరోపించారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ఆయకట్టుకు సాగునీరు ఇవ్వకుండా ఢిండికి నీటిని తరలించే కుట్ర చేస్తున్నారన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పరిధిలోని చివరి ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాల్సిందేనని అలా కాకుండా దుందుబీ వాగు నుండి సాగునీటిని అక్రమంగా తరలించుకుపోవడానికి చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కేవలం 18శాతం మాత్రమే ఇక్కడి పొలాలకు సాగునీరు అందుతుందని అదే నల్గొండలో 79శాతం నీరు అందుతుందన్నారు. తాము నల్గొండకు నీటిని తీసుకెళ్లడాన్ని తప్పుపట్టడం లేదని అయితే ఇక్కడ అన్యాయం చేసి అక్కడికి కృష్ణాజలాలను తరలిస్తామంటే ఊరుకునేది లేదన్నారు. ఇప్పటికే కల్వకుర్తి, వెల్దండ, తదితర మండలాల్లో ఆందోళనలు జరుగుతున్నాయని వీటిని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని సమస్యను పరిష్కారించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం బేషజాలలకు వెళ్తుందని ప్రజాసమస్యలను పరిష్కారించాల్సిన ప్రభుత్వాలు కుట్రలకు దిగితే రైతులు తిరుగుబాటు చేసే రోజులు వస్తాయని హెచ్చరించారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పూర్తి చేయాలని ఓ పక్క రైతాంగం డిమాండ్ చేస్తున్నారని మరోపక్క లిఫ్ట్-1,2,3లతో ప్రస్తుతం వస్తున్న సాగునీటిని ప్రాజెక్టు చివరి ఆయకట్టుకు అందించాల్సిన భాద్యత ప్రభుత్వానిదేనన్నారు. అలా కాకుండా మధ్యలోనే కాలువలతో గండ్లుపెట్టి అక్రమంగా ఢిండి ప్రాజెక్టుకు నీటిని తీసుకెళ్లడానికి చేస్తున్న ప్రయత్నాలను ప్రభుత్వం విరమించుకోవాలన్నారు. ఈ నెల 16వతేదిన కల్వకుర్తి ఎత్తిపోతల పథకంపై జెఎసి ఆద్వర్యంలో రౌండ్‌టెబుల్ సమావేశం నిర్వహించడం జరుగుతుందన్నారు. రైతు సంఘాల ప్రతినిధులతో పాటు ప్రజాసంఘాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు, మేధావులు జలసాధన పోరాట ఉద్యమనేతలు హజరుకావాలని కోరారు. త్వరలోనే టిజె ఎసి ఆద్వర్యంలో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కాలువలను తదితర అంశాలపై పరిశీలించడం జరుగుతుందన్నారు. టిజె ఎసి ఆద్వర్యంలో తాము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నామని కల్వకుర్తి ఎత్తిపోతల పథకం చివరి ఆయకట్టుకు సాగునీరు అందించాకే ప్రభుత్వం ఇతర ప్రయత్నాలు చేసుకోవాలని హితవు పలికారు. విలేఖరుల సమావేశంలో పాలమూరు అధ్యాయన వేదిక జిల్లా కన్వీనర్ రాఘవచారి, టిజెఎసి అధికార ప్రతినిధి మెట్టుకాడి ప్రభాకర్, ప్రచార కార్యదర్శి బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు.