మహబూబ్‌నగర్

రూ.480కోట్లతో మిషన్ భగీరథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జనవరి 9: రూ.480కోట్లతో మీషన్‌భగీరథ పనులు ప్రారంభం అయ్యాయని తొలిదశలోనే మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి మంచినీరు అందించడం జరుగుతుందని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ స్పష్టం చేశారు. సోమవారం మన్యంకొండలో జరుగుతున్న మీషన్‌భగీరథ రిజర్వాయర్‌తో పాటు పలు అభివృద్ధి పనులను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. దేవాలయం వెనుక నుండి రూ.కోటితో నిర్మించతలపెట్టే రోడ్డు మార్గాన్ని కూడా అధికారులతో కలిసి పరిశీలించారు. అంతేకాకుండా రిజర్వాయర్‌లోకి నీరు వచ్చిచేరే పైప్‌లైన్‌ను కూడా పరిశీలించారు. రిజర్వాయర్‌లో జరుగుతున్న పనులపై ఆరా తీస్తూ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. అనంతరం అక్కడే సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ మీషన్‌భగీరథలో భాగంగా తొలిదశలోనే మహబూబ్‌నగర్ నియోజకవర్గానికి స్వచ్ఛమైన నీటిని ప్రజలకు అందిస్తానని హామీ ఇవ్వడంతో మార్చి చివరినాటికి మహబూబ్‌నగర్, హన్వాడ మండలాల పరిధిలోని 57 గ్రామాలకు ఫిల్టర్ వాటర్‌ను ఇవ్వడం జరుగుతుందన్నారు. అందుకుగాను అధికారులు సమాయత్తం కావాలని సూచించారు. మన్యంకొండలో నూతనంగా నిర్మించిన రిజర్వాయర్ నుండే మహబూబ్‌నగర్ నియోజకవర్గంతో పాటు వివిధ నియోజకవర్గాలకు తాగునీరు సరఫరా చేయడం జరుగుతుందన్నారు. ఈ ఏడాది చివరినాటికి అనుకున్న లక్ష్యంగా అన్ని గ్రామాలకు మీషన్‌భగీరథ ద్వారా మంచినీరు అందించడం జరుగుతుందన్నారు. అధికారులు మన్యంకొండపై వేయి కార్లు నిలిచి ఉండే పార్కింగ్ స్థలాన్ని కూడా గుర్తించాలని, కొండపై మంచివాతావరణం ఉన్నందున పర్యాటక శాఖ అధికారులు ప్రత్యేకదృష్టిపెట్టి వసతి గృహాలతో పాటు మన్యంకొండకు వచ్చే భక్తుల సౌకర్యార్థం కోసం ఓ శాఖాహార హోటల్‌ను ప్రారంభించాలని సూచించారు. కొండ వెనుకాల నుండి మరోరోడ్డు మార్గానికి ప్రభుత్వం రూ.కోటి నిధులు విడుదల చేస్తూ జి ఓ 2ను కూడా విడుదల చేసిందన్నారు. వాటర్‌గ్రిడ్ ద్వారా బయటకు వచ్చే వృధానీటిని కోనేరులోకి కలిపి అక్కడి నుండి కొండపై ఉన్నటువంటి పర్యావరణం కోసం, పార్కుల కోసం వాడుకునేలా ప్రణాళికలు రచించాలని అధికారులకు సూచించారు. మన్యంకొండ ముఖద్వారం పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి కెసి ఆర్ చేతుల మీదుగా మహబూబ్‌నగర్ పట్టణంలో పేదలకు 2000లకుపైగా డబుల్‌బెడ్‌రూం ఇళ్లను ఇవ్వనున్నట్లు ఇప్పటికే ఆ పనులు 80శాతం పూర్తి అయ్యాయని వెల్లడించారు. రూ.100కోట్లతో మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రానికి బైపాస్ రోడ్డు నిర్మాణం, మరో రూ.33కోట్లతో పట్టణంలో రోడ్డు విస్తరణ, రూ.163కోట్లతో పట్టణంలోని మంచినీటి సరఫరా కోసం ట్యాంకులు, పైప్‌లైన్‌ల నిర్మాణం వాటిని వాటర్‌గ్రిడ్‌కు అనుసంధానం చేసే కార్యక్రమాలను వేగవంతం చేయాలని అధికారులను కోరారు. ఈ సమావేశంలో వాటర్‌గ్రిడ్ ఇఇ శ్రీనివాస్, డిఇలు పుల్లారెడ్డి, ప్రశాంత్, నాగరాజు, యాదయ్య, దీప, రాజేందర్, ఆర్‌డబ్ల్యూఎస్ ఇఇ లలిత, నాయకులు రాజేశ్వర్‌గౌడ్, వెంకటయ్య, రాజేశం, ఎంపిపి సావిత్రి, జడ్పిటిసి శ్రీదేవి, సర్పంచు రామకృష్ణమ్మ తదితరులు పాల్గొన్నారు.