మెదక్

కన్నుల పండువగా కల్యాణ వైభవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, జనవరి 13: పట్టణ శివారులోని వైకుంఠపురంలో గోదా శ్రీనివాస కల్యాణ మహోత్సవాన్ని శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన శ్రీ మహాలక్ష్మి గోదా సమేత విరాట్ వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రం కోరిన కోర్కెలు తీరుస్తూ భక్తుల కొంగుబంగారంగా నిలుస్తుంది. ప్రతి యేడాది మాదిరిగానే ఈ యేడాది కన్నుల పండువగా శ్రీనివాసుడి కల్యాణం జరిగింది. శ్రీ దేవనాథ రామానుజ జీయర్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణ, ఆలయ ప్రధాన అర్చకులు కందాడై వరదాచార్యులు,వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. వేలాది మంది భక్తులు పాల్గొని కల్యాణాన్ని తిలకించి తరించారు. అర్చకులు గోదా శ్రీనివాసులకు జీలకర్ర బెల్లం పెట్టి మాంగాళ్యధారణ చేసి ముత్యాల తలంబ్రాలు పోశారు. కల్యాణ మండపాన్ని వివిధ రకాల పూలతో అందంగా అలంకరించారు. కల్యాణ అనంతరం అర్చకులు, భక్తులు నృత్యాలు చేశారు. దేవనాథ రామనూజ స్వామి భక్తులకు ప్రవచనాలు చేశారు. మహిళా భక్తులు వెంకటేశ్వరస్వామి, అమ్మవార్లకు ఒడిబియ్యం పోసి మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారికి పోసిన ముత్యాల తలంబ్రాలను భక్తులకు ప్రసాదంగా వితరణ చేశారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులకు అన్నదానం చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జై శ్రీమన్నారాయణ చారిటబుల్ ట్రస్టు సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు.
108 అడుగుల రాజగోపురం
శ్రీ మహాలక్ష్మి గోదా సమేత విరాట్ వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రం ప్రధాన ధ్వారం వద్ద 108 అడుగుల రాజగోపురం నిర్మించేందుకు పనులు ప్రారంభించారు. ఇంత పెద్ద రాజగోపురం నిర్మించేందుకు ఎక్కువ మొత్తంలో వ్యయం అవుతున్నందున భక్తులు ముందుకొచ్చి తమకు తోచిన సహాయాన్ని చేస్తున్నారు. రాజగోపురానికి కావాల్సిన సామాగ్రి సిమెంట్, ఇటుక, స్టీల్ తదితర రూపాల్లో ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు.

ప్రజలకు నష్టం కల్గించే
2016 చట్టం వద్దని రాష్టప్రతిని కోరుతాం
* ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ నాయకుడు పార్థసారథి
తొగుట, జనవరి 13: ప్రభుత్వం 123జిఓ తరహాలోనే 2016 చట్టాన్ని తీసుకవచ్చి భూసేకరణ చేయాలని చూస్తుందని ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ సభ్యులు, హైకోర్టు న్యాయవాది పార్దసారధి అన్నారు. శుక్రవారం మండలంలోని వేములగాట్‌లో మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా చేపట్టిన రిలేదీక్షలకు వారు సంఘీభావం తెలిపి మాట్లాడుతూ ప్రభుత్వం 2013 చట్టాన్ని కాదని 123 జిఓ తెచ్చి ప్రాజెక్టులకు భూసేకరణ చేపట్టిందని హైకోర్టు తప్పు పట్టడంతో 2016 భూసేకరణ చట్టాన్ని తెచ్చి రాష్టప్రతి నుండి అనుమతి పొందేందుకు చూస్తుందన్నారు. రాష్టప్రతికి అది అమలు చేయవద్దని పోస్టు కార్డుల ఉద్యమం చేయాలని పిలుపునిచ్చారు. తాము సైతం రాష్టప్రతిని ప్రజలకు నష్టం కల్గించే 2016 చట్టం అమలు చేయవద్దని కోరాతమన్నారు. వేములగాట్ ప్రజలు చేస్తున్న పోరాటం అభినందనీయమన్నారు. రైతు సంఘం నాయకులు నక్కల యాదవరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా లాఠీచార్జీలు, కాల్పులు, అక్రమ కేసులు నమోదు చేసినా న్యాయం కోసం ఆందోళనలు చేపట్టి అందరికి ఆదర్శంగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు ఎజాజ్, తుమ్మనపల్లి శ్రీనివాస్, జెఏసి నేతలు శ్రీనివాస్‌రెడ్డి, హయత్, రంగారెడ్డి, నర్సింహరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మినీ స్టేట్‌మెంట్ తీసిస్తానంటూ ఘరానా మోసం

* ఏటిఎం కార్డు మార్చి 31వేలు స్వాహా
* సిపిని ఆశ్రయించిన బాధితురాలు
* నిందితుని ఫోటో విడుదల చేసిన పోలీసులు
* సమాచారమిస్తే బహుమతి ప్రకటన
సిద్దిపేట, జనవరి 13: ఏటిఎం సెంటర్‌లో మినీస్టేట్‌మెంట్ తీసిస్తానని నమ్మించి ఏటిఎం కార్డు మార్చి 31వేలు స్వాహాచేసిన ఘటన సిద్దిపేటలో జరిగింది. పట్టణానికి చెందిన బయ్యారం కరుణ హౌజింగ్‌బోర్డులోని ఆంధ్రాబ్యాంక్ ఏటిఎం సెంటర్‌లో ఈనెల 6న మినీస్టేట్‌మెంట్ కోసం పోగా ఏటిఎం మొరాయించింది. అక్కడ ఉన్న గుర్తుతెలియని వ్యక్తి మినీస్టేట్‌మెంట్ తీసిస్తానని చెప్పి నమ్మపలకడంతో కరుణ ఏటిఎం కార్డు ఇచ్చింది. కార్డుతీసుకున్న వ్యక్తి ఏటిఎం కార్డు మార్చి ఆమెకు ఇచ్చాడు. ఆమె అకౌంట్‌లోని 31వేలను ఏటిఎం ద్వారా డ్రా చేశాడు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో సిసి పుటేజ్‌ద్వారా నిందితుని చిత్రాన్ని పోలీసులు విడుదల చేశారు. వ్యక్తి ఎవరికైనా తారసపడితే సిద్దిపేట సిపి 8332921100, ఏసిపి 9490617009, సిఐ 9490617019, 222433నంబర్‌కు సమాచారం ఇవ్వాలన్నారు. పట్టించిన వారికి నగదుపురస్కారం అందిస్తామని సిపి శివకుమార్ తెలిపారు.

సిఎం హామీ ఇస్తే
దీక్షల విరమణకు సిద్ధం
* పేట అఖిలపక్ష నాయకులు
రామాయంపేట, జనవరి 13: రామాయంపేటను రెవెన్యూ డివిజన్ చేస్తామని ముఖ్యమంత్రి హామి ఇస్తే దీక్షలను విరమించేందుకు సిద్దంగా ఉన్నామని అఖిలపక్ష నాయకులు ప్రకటించారు. శుక్రవారం 120వరోజు రిలేదీక్షలు చేపట్టిన అఖిలపక్ష నాయకులు సరాపు యాదగిరి, సుప్రబాత్‌రావు, రమేష్‌రెడ్డిలు విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఇన్ని రోజులుగా దీక్షలు చేస్తున్న ఎమ్మెల్యే వైఖరిలో మార్పురాలేదని ఆరోపించారు.

సంక్రాంతి కొత్తకాంతులు నింపాలి
* మంత్రి హరీష్‌రావు
సిద్దిపేట, జనవరి 13: సిద్దిపేట జిల్లా ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలను మంత్రి హరీష్‌రావు తెలిపారు. సంక్రాంతి పర్వదినం సుఖసంతోషాలతో జరుపుకోవాలని, భోగభాగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఏయేడు దేవుని అనుగ్రహంతో వానలు బాగాపడి రైతుల కళ్లల్లో కాంతి వెదజల్లాయన్నారు. యాసంగిపంటలు బాగా పండి రైతులకు ఆనందం ఇవ్వాలని, కోటి ఎకరాల మాగాణిగా రాష్ట్రం సస్యశ్యామలం కావాలన్నారు. బంగారు తెలంగాణలో ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని కోరుకుంటు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

ఘనంగా గురుపాద పూజ
కొల్చారం, జనవరి 13: మండలంలోని పైతర గ్రామపంచాయతీ శివారు గ్రామమైన తుక్కాపూర్‌లో మాధవానంద స్వామిజీ పాదపూజ శుక్రవారం ఘనంగా నిర్వహించారు. రంగంపేట సర్పంచ్ విజయ్‌కుమార్, అప్కో డైరెక్టర్ అరిగె రమేశ్, పైతర సర్పంచ్ సునంద భానుప్రకాశ్‌రెడ్డి, తెరాస నాయకులు అంజనేయులు ఇంటి వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా మహిళలు మంగళ హారతులతో స్వామిజీకి స్వాగతం పలికారు. అనంతరం స్వామిజీ పాదపూజ నిర్వహించగా స్వామిజీ మాట్లాడుతూ మండలంతో పాటు రాష్ట్రంలోని ప్రజలందరు భగవంతుని కృపచేయ ఆయురారోగ్యాలతో ఉండాలన్నారు. ప్రతి మానవుడు ఆధ్యాత్మిక చింతన, నడవడి అవలంభించుకోవాలని ప్రవచనాలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పైతర ఎంపిటిసి చంద్రశేఖర్‌రెడ్డి, రంగంపేట పిఎసియస్ చైర్మన్ మల్లేశం, వైస్ చైర్మన్ అల్లు మల్లారెడ్డి, గ్రామస్తులు, మహిళలు భారీయెత్తున పాల్గొన్నారు.
బ్యాంకువద్ద
రైతు సొమ్ము తస్కరణ
కొల్చారం, జనవరి 13: గుర్తు తెలియని దుండగుడు రైతుకు మాయమాటలు చెప్పి డబ్బులతో ఉడాయించిన సం ఘటన శుక్రవారం కొల్చారం మండలంలో చోటు చేసుకుంది. బాధితుని కథనం మేరకు వివరాల్లోకి వెళితే.. మండలంలోని ప్రముఖ వ్యాపార కేంద్రమైన రంగంపేట ఎస్‌బిఎస్ బ్యాంక్ వద్ద సంగాయిపేట గ్రామానికి చెందిన రైతు తంబు లస్మయ్య తాను విక్రయింఛిన ధాన్యం డబ్బుల కోసం బ్యాంక్‌కు వచ్చాడు. బ్యాంక్‌లో క్యాషియర్ వద్దకు వెళ్లి డబ్బులు తీసుకుంటుండగా బ్యాంక్ క్యాషియర్ 50 రూపాయల నోట్లు కలిగిన రెండు వేలు ఇవ్వగా వాటిని లెక్కించుతుండగా చేతిలో నుంచి కొంత డబ్బు జారిపడిపోయంది. కిందికి వంగి ఆ డబ్బు తీసుకునే సమయంలో ముందునే నిల్చున్న దుండగుడు మిగిలిన ఎనిమిది వేలు కౌంటర్‌లో నుంచి తీసుకొని పరారయ్యాడు. బ్యాంక్‌లో జనం రద్దీగా ఉండటంతో ఆ వ్యక్తిని పసిగట్టలేక పోయానంటున్నాడు బాధితుడు. ఈ విషయాన్ని మేనేజర్‌కు తెలుపగా వెంటనే వెతికినా ఫలితం లేకపోయంది. దీంతో సిసి కెమెరాలో చూసే సరికి ఆ వ్యక్తి ఇక్కడివాడు కాదని తేలింది. త్వరలోనే దుండగుడిని పట్టుకుంటామని ఎస్సై విద్యాసాగర్‌రెడ్డి తెలిపారు.
18నుంచి రాష్టస్థ్రాయి
క్రికెట్ టోర్నమెంట్
పటన్‌చెరు, జనవరి 13: రాష్ట్ర స్థాయి మైత్రి క్రికెట్ ట్రోఫి టోర్నమెంట్ ఈ నెల 18 నుంచి పట్టణంలోని మైత్రి మైదానంలో నిర్వహించనున్నట్లు మైత్రి క్రికెట్ క్లబ్ అధ్యక్షుడు హనుమంతరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. 30వ రాష్ట్ర స్థాయి ఈ టోర్నమెంట్ ఈ నెల 18 నుంచి 26 వరకు జరుగుతుందన్నారు. గత 29 సంవత్సరాలుగా దిగ్విజయంగా నిర్వహిస్తున్న ఈ క్రికెట్ పోటీలకు సంబంధించిన ఎంట్రీలను 16వ తేదీలోపు తీసుకోవాలని కోరారు. ఈ క్రికెట్ పోటీలలో గెలుపొందిన విజేతకు 35 వేల రూపాయల నగదు బహుమతి, రెండవ విజేతకు 25 వేల రూపాయల నగదు అందిస్తామన్నారు. హైద్రాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు చెందిన అంపైర్స్ అధ్వర్యంలో జరుగే ఈ క్రికెట్ టోర్నీ ఫైనల్ మ్యాచ్ ఈ నెల 26న జరుగుతుందన్నారు.

సర్వజనులూ సుఖశాంతులతో జీవించాలి
కౌడిపల్లి, జనవరి 13. మాజీ మంత్రి, డిసిసి అధ్యక్షురాలు సునీతారెడ్డి నర్సాపూర్ నియోజకవర్గం ప్రజలకు మకర సంక్రాంతి పర్వదినం శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రభూమి విలేకరితో మాట్లాడుతూ సంక్రాంతి పర్వదినంను ప్రజలు ఆనందోత్సావాలతో జరుపుకోవాలని అకాక్షించారు. రైతులు పాడిపంటలతో సుఖఃసంతోషాలతో ఆనందంగా ఉండాలని కోరారు. మూడు రోజులు జరుపుకునే మకర సంక్రాంతి పండుగ అన్ని వర్గాల ప్రజలకు భోగ భాగ్యాలు, సర్వ సుఖాలను అందించాలని, కష్టాలను తొలగించాలని భగవంతుడి ఆశ్వీరాదాలు అందరిపై ఉండాలని ప్రార్థిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ సంక్రాంతి పండుగ ప్రజల జీవితాలలో కొత్త వెలుగులు నింపాలని మనసారా కోరుకుంటున్నట్లు సునీతారెడ్డి తెలిపారు. సంక్రాంతి పండుగతో ప్రజల ఇండ్లలో సుఖఃసంతోషాలు, ఆనందం విరయబూయాలని సునీతారెడ్డి కోరారు. ప్రజల సంతోషంగా ఉన్నప్పుడే పల్లెలు ప్రశాంతంగా ఉంటాయని అన్నారు. ప్రజల సంతోషమే తన సంతోషంగా భావిస్తానని ఆమె తెలిపారు. ప్రజల కష్టసుఖాలలో పాలుపంచుకొని ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని సునీతారెడ్డి తెలిపారు. అలాగే మెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట ప్రజలకు ఆమె సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.