మెదక్

మహారుద్ర యాగానికి ముమ్మర ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్, జనవరి 15: మంజీర నది ఒడ్డున ద్వాపర యుగంలో జనమేజయ మహారాజు సర్పయాగం చేసిన గరుడగంగ క్షేత్రంలో లోక కళ్యాణార్థం మేరుతంత్ర ప్రకారం మహారుద్ర యాగం నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నెల 28 నుండి 30 వరకు నిర్వహించే అస్టోత్తర శతకుండాత్మక 108 (హోమగుండాల పూర్వక) పాశుపత మహా రుద్రయాగానికి త్రయాహ్నిక దీక్షతో మహా వైభవముగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. మంజీర నది కర్ణాటక రాష్ట్రం బోల్కాట్ కొండల మధ్య మంజీర పుట్టింది. 610 కిలోమీటర్ల పొడవున ఈ మంజీర నది ప్రవహిస్తుంది. నిజామాబాద్ కందకుర్తి గోదావరిలో మంజీర నదిలో విలీనమవుతుంది. ఈ మంజీర నదిపైన శ్రీ చాముండేశ్వరి ఆలయము, శ్రీ వనదుర్గ్భావాని ఆలయం, ఆ తరువాత మహా సరస్వతి దేవాలయం నెలకొని ఉన్నాయి. మహా రుద్రయాగంలో భాగంగా రెండు టన్నుల శంకరుడు, ఒక టన్ను నందిని కాశీ నుండి శివలింగమును కాలినడకతో 23 రోజులు 1100 కిలోమీటర్లు పాదయాత్రతో మంజీర నదిపై ఉన్న శ్రీ సరస్వతిమాత ఆలయానికి తేవడం జరిగిందని సరస్వతి ఆశ్రమ వ్యవస్థాపకులు, చండి ఉపవాసకులు శ్రీ దోర్బల రాజవౌళిశర్మ ఆదివారం రోజు మెదక్‌లో విలేఖరులతో మాట్లాడుతూ తెలిపారు. ఇదే రోజు మహారుద్ర యాగానికి సంబంధించిన వాల్‌పోస్టర్లను దోర్భల రాజవౌళిశర్మ ఆయన సతీమణి సంధ్యారాణి విడుదల చేశారు. మంజీర తీరన ఉన్న శ్రీ సరస్వతిమాత ఆశ్రమాలయంలో 2011 సంవత్సరంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, పద్మాదేవేందర్‌రెడ్డి, విజయశాంతి మొదటిసారిగా మంజీర పుష్కరాలు ప్రారంభించడం జరిగిందని వారు గుర్తు చేశారు. 2012లో భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ముగింపు పుష్కరాలు నిర్వహించినట్లు తెలిపారు. మహా రుద్రయాగంలో భాగంగా 10 లక్షల విలువ కలిగిన నాలుగు ఫీట్ల నంది విగ్రహం, రెండు టన్నుల శివలింగంను అప్పలశెట్టి, గాండ్ల నాగభూషణం, ప్రభులింగం, శివలింగం, కుమారస్వామి దాతలుగా నిలిచి వాటిని ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేశారని నిర్వాహకులు దోర్బల రాజవౌళిశర్మ తెలిపారు. కలియుగంలో తొలిసారిగా జనమేజయుడు సర్పయాగం చేసిన మంజీరలో 108 హోమగుండాల్లో భక్తులు తరించడానికి లోక కళ్యాణార్థాం మహారుద్రయాగం సంకల్పించినట్లు ఆయన తెలిపారు. ఈ నెల 28,29,30న మహా రుద్రయాగం జరుగుతుందని, అందుకోసం ఏర్పాట్లన్నియు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. ఈ మహా రుద్రయాగమును మెదక్ ఎమ్మెల్యే, ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి ప్రారంభిస్తారని దోర్బల రాజవౌళిశర్మ తెలిపారు. ఆ తరువాత అందరు ఆహ్వానితులేనని ఆయన తెలిపారు. ముఖ్యంగా ఈ మూడు రోజుల పాటు లక్ష మంది భక్తులు పాల్గొనేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. టాయిలెట్స్, స్నానపుగదులు, బట్టలు మార్చుకునేందుకు ప్రత్యేక వసతులు, మహా రుద్రయాగంలో పాల్గొనే దంపతులకు ప్రత్యేక వసతులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రుద్రయాగం కోసం అదనంగా ఎనిమిది ఎకరాల్లో భూమిని వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రతి రోజు అన్నదాన కార్యక్రమాలు ఉంటాయన్నారు.