మెదక్

అంబరాన్నంటిన సంక్రాంతి సంబురాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, జనవరి 15: మకర సంక్రాంతి వేడుకలను జిల్లా ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. జిల్లాకేంద్రమైన సంగారెడ్డితో పాటు వివిధ మండలాల్లోని అన్ని గ్రామాల్లో సంబురాలు అంబరాన్నంటాయి. పట్టణంలోని అన్ని వార్డులో ఉదయానే్న మహిళలు ముంగిట్లో ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి ఆనందోత్సావంగా పండగను జరుపుకున్నారు. ఆలయాలు, గృహాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రకరకాల పిండి వంటలను తయారు చేసి వారి వారి బంధువులతో వింధు భోజనాలు చేశారు. రంగు రంగుల ముగ్గులు, వివిధ రకాల గాలిపటాలతో పట్టణంలో ప్రత్యేక శోభా సంతరించుకుంది. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సదాశివపేటలో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువకులు, కార్యకర్తలతో కలిసి గాలిపటాలను ఎగురవేసి పండగ శుభాకాంక్షలు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డి వేడుకల్లో పాల్గొని గాలిపటాలను ఏగరవేసి యువకుల్లో ఉత్సాహన్ని నింపారు. సంగారెడ్డి మున్సిపల్ చైర్‌పర్సన్ విజయలక్ష్మి తన నివాసంలో గాలిపటాలను ఏగరవేశారు.

కపిల గోవుకు శ్రీమంతం
సిద్దిపేట టౌన్, జనవరి 15: రాష్ట్రంలో వ్యవసాయం అభివద్ధి చెంది పాడిపంటలు మంచిగా ఉండాలనే సంకల్పంతో కపిల గోవుకు శ్రీమంతం నిర్వహించినట్లు ఎస్‌ఆర్‌ఆర్ ఫౌండేషన్ ప్రతినిధి మురంశెట్టిరాములు అన్నారు. సిద్దిరామేశ్వర ఫౌండెషన్, వావివి వనితాక్లబ్‌ల ఆధ్వర్యంలో ఆదివారం కపిల గోవుకు శ్రీమంతం నిర్వహించారు. ఈ సందర్భంగా సంక్రాంతి లక్ష్మి పేరుతో 13మంది మహిళలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో శివకుమార్, శ్రీనివాస్, నాగేందర్, వాసవి, పద్మ, మంజుల, సంతోషి, స్వరూప, రేణుక, స్వప్న తదితరులు పాల్గొన్నారు.