మెదక్

జాతిపితని కించపరిస్తే సహించేది లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, జనవరి 16: దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన జాతిపిత మహాత్మాగాంధీకి గౌరవం లేకుండా పోతుందని, గాంధీజీని కించపరిస్తే సహించేది లేదని కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ రాజ్యసభ సభ్యులు వి.హనుమంతరావు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వ వ్యితిరేక విధానాలు, పెద్దనోట్ల రద్దును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డి (జగ్గారెడ్డి) అధ్యక్షతన సోమవారం జిల్లాకేంద్రమైన సంగారెడ్డిలో భారీ ర్యాలీ, బహిరంగ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన హనుమంతరావు సభను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రపంచ దేశాలు మహాత్మాగాంధీని గౌరవిస్తుంటే ఎన్డీఏ ప్రభుత్వం అగౌర పర్చేవిధంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. ఖాదిబోర్డు క్యాలెండర్‌లో ప్రధాని మోడి చక్రం తిప్పునట్లు చూపడం దారుణమని, గాంధీ కాలిగోటికి కూడా మోడి సరిపోడని ధ్వజమెత్తారు. మహాత్మాగాంధీ నోటు వల్లే అవినీతి పెరిగిందని ఒక కేంద్ర మంత్రే ప్రకటించడం, మళ్లీ తెల్లవారే తప్పాయిందని ప్రకటించడం ఎంత వరకు న్యాయమన్నారు. మరోసారి గాంధీ పై నోరు జారితే ఊరుకునేది లేదన్నారు. పెద్దనోట్ల రద్దుతో ధనికులకు ఎలాంటి ఇబ్బంది లేదని సామాన్య ప్రజలే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నోట్ల రద్దు దిక్కుమాలిన నిర్ణయమన్న కేసిఆర్ ఢిల్లీ వెళ్లి చల్లబడ్డాడని, ఈ విషయంలో మోడికి వత్తాసు పలుకడం సిగ్గుచేటన్నారు. నల్లధనం మాట ఏమో కానీ ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో రాహుల్‌గాంధీ పెరుగుతున్న ఆధారణ చూసి భయపడ్డ మోడీ నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నాడని విమర్శించారు. రాష్ట్రంలో విచ్చల విడిగా వైన్స్ షాపులు పెరిగి పోయాయని, మరో ఐదేళ్లలో రోడ్లపై తూలుతూ నడిచే వారి సంఖ్య అధికంగా పెరుగుతుందన్నారు. కేసిఆర్ అన్న బంగారు తెలంగాణ ఏమో కానీ తాగుబోతు తెలంగాణగా మారడం ఖాయమన్నారు. విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి పేదవాడి అకౌంట్లలో రూ.15లక్షల జమచేస్తానన్న మోడీ హామి ఎమైందని ప్రశ్నించారు. ఈ విషయంలో మహిళలు, మహిళా సంఘాల సభ్యులు బ్యాంకుల ముందు ధర్నాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి మాట్లాడుతూ నోట్ల రద్దు సామాన్యుల జీవితాల్లో చీకటి నింపిందన్నారు. ప్రధాన మంత్రి జీవితం ఇచ్చిన తల్లినే రోడ్డుపాలు చేశాడని, డబ్బుల కోసం తల్లినే బ్యాంకులో క్యూకట్టించిన చరిత్ర తనదని ఎద్దేవ చేశారు. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందన్నారు. సిఎం కేసిఆర్ తన స్వార్థ ప్రయోజనాల కోసం కేంద్ర భజన చేస్తున్నాడని ఘాటుగా విమర్శించారు. ప్రజలు గమనిస్తున్నారని తగిన గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. అంతకు ముందు హనుమంతరావు, ఇతర నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జెట్టి కుసుమ్‌కుమార్, శ్రావణ్‌రెడ్డి, మాజీ ఎంపి సురేష్‌షెట్కార్, రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షులు కంరోద్దీన్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నిర్మలాజగ్గారెడ్డి, జిన్నారం జెడ్పీటిసి ప్రభాకర్‌రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శంకర్‌రెడ్డి, నాయకులు తోపాజీ అనంతకిషన్‌తో పాటు యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యుఐ నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.