మెదక్

మల్కాపూర్ అభివృద్ధి భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తూప్రాన్, జనవరి 17: గ్రామీణ ప్రాంతంలో ఉన్న మల్కాపూర్ గ్రామం అభివృద్ధి చాలా బాగుందని కేంద్ర తాగునీరు, పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ హిరణ్యబోర అభినందించారు. మంగళవారం మల్కాపూర్, హిమాంపూర్ గ్రామాలను సందర్శించిన సందర్భంగా విలేఖరులతో మాట్లాడారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం ఇంటింటికీ తాగునీటి వసతి ఏర్పాటు బాగున్నాయని కితాబిచ్చారు. తాగునీటి సమస్యపై గ్రామస్థులను అడిగి తెలుసుకున్నారు. గ్రామాభివృద్ధికి యువకులు చేస్తున్న కృషిని కొనియాడారు. గ్రామంలోని వీధుల్లో పర్యటించి సంతృప్తిని వ్యక్తంచేశారు. పరిసరాల పరిశుభ్రత, ఇంకుడుగుంతల నిర్మాణాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర వాటర్ షెడ్ విభాగం అధికారులు సుధాకర్‌రెడ్డి, తరుణ్ చక్రవర్తి, జిల్లా కలెక్టర్ భారతి హోలికేరి, డిఅర్‌డిఒ సీతారామారావు, ఎంపిడిఒ శ్రీనివాస్‌రావు, సర్పంచ్ స్వామి, గ్రామస్థులు పాల్గొన్నారు.
ఇప్పెపల్లిలో పాతపంటల జాతర

జహీరాబాద్, జనవరి 17: మండలంలోని ఇప్పెపల్లిలో మంగళవారం సంచార పాతపంటల జాతర ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఎడ్లబండ్లను ఊరేగించారు. వాటిముందు మహిళా సభ్యులు కోలాటంతోపాటు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వసింహించారు. భజన, చిటికెలు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ కోడళ్లకు చిరుదాన్యాల వారసత్వం అందిస్తున్నాట్లు చెప్పారు. సంఘం మహిళా ప్రతినిధులు స్వరూపమ్మ, చెంద్రమ్మ, చంద్రకళ ఇతర సభ్యులు, స్థానికులు మాట్లాడుతూ ముప్పై సంవత్సరాలుగా చిరుధాన్యాల సంరక్షణ సద్యమం చేస్తున్నామన్నారు. వాటి పరిరక్షణకోసం అనేక పాట్లు పడుతున్నామన్నారు. ప్రధానంగా జొన్న, కొర్ర, రాగి, సజ్జ మొదలైన పాతపంటలను సాంప్రదాయ రీతిలో పశువుల ఎరువువేసి, ఎకరాలో సాధ్యమైనన్ని ఎక్కువ రకాల పంపటలు పండించి జీవవైవిద్య పరిజ్ఞానాన్ని భావి తరాలకు అందిస్తున్నామన్నారు. దీంతో పొలానికి, పర్యావరణానికి, పశువులకు, వినియోగదారులకు మేలు జరుగుతుందన్నారు. సెంద్రియ వ్యవసాయానికి అందరు సహాకరించి పరిరక్షణకోసం నడుంకట్టాలన్నారు. సభ్యులు ప్రేమలమ్మ, బేబమ్మ, శోభమ్మ, జాతర కోఆర్టినేటర్ వినయ్‌కుమార్, మంజుల, బాలయ్య, కేషమ్మ తదితరులు పాల్గొన్నారు.