మెదక్

ఇస్నాపూర్ కూడలిలో ఆక్రమణల కూల్చివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటన్‌చెరు, జనవరి 17: పటన్‌చెరు మండలం ఇస్నాపూర్ కూడలిలో జాతీయ రహదారి పక్కనగల పలు ఆక్రమణలను ఆధికారులు మంగళవారం కూల్చివేసారు. నేషనల్ హైవే అధికారులు, రెవెన్యూ అధికారులు స్థానిక పొలీసుల సహకారంతో కూల్చివేతలు చేపట్టారు. పటన్‌చెరు డిఎస్‌పి సీతారాం పర్యవేక్షణలో సిఐలు ప్రభాకర్, రాంరెడ్డి బందోబస్తు ఏర్పాటు చేసారు. ఉయదం ఏడు గంటలకే పనులు ప్రారంభించిన అధికారులు ఇస్నాపూర్ కూడలిలో జాతీయ రహదారి పక్కనగల దర్గాకు ఇరువైపులా ఉన్న దుకాణాలను ముందుగా కూల్చివేసారు. గత నలభై సంవత్సరాలుగా అక్కడే వ్యాపారాలు చేసుకుంటున్న వారికి తగిన నష్టపరిహారం ఇప్పిస్తామని స్థానిక తహశీల్దారు గిరి హామీ ఇచ్చారు. ఒక్కొక్కరికి వంద గజాల స్థలం ఇవ్వాలని ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి సూచించినట్లు ఆయన చెప్పారు. ఇస్నాపూర్ చౌరస్తా నుంచి ముత్తంగి వరకు గల ఆక్రమణలను తొలగించిన అధికారులు జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చర్యలు చేపట్టారు. ముత్తంగి గ్రామ శివారులలో గల ఔటర్ రింగ్ రోడ్డు నుంచి సంగారెడ్డి జిల్లా సరిహద్దు అయిన జహీరాబాద్ పట్టణ శివారు వరకు చేపట్టనున్న ఆరు లైన్ల రహదారి విస్తరణకు అవసరమైన రీతిలో ఇరువైపులా గల ఆక్రమణలను తొలగిస్తామని నేషనల్ హైవే అధికారులు ఈ సందర్భంగా స్పష్టం చేసారు.
అన్యమత ప్రచారాన్ని
అడ్డుకున్న బిజెపి నేతలు
* ప్రచారకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
నంగునూరు, జనవరి 17: హిందూ, ముస్ల్లిం దేవుళ్లు దయ్యాలని, ఎలాంటి రుగ్మతలు వచ్చినా ఏసు నయం చేస్తాడని నంగునూరు ఎస్సీకాలనీలో క్రైస్తవులు చేపట్టిన ప్రచారాన్ని బిజెపి నేతలు అడ్డుకున్నారు. మంగళవారం గ్రామానికి వచ్చిన క్రైస్తవ ప్రతినిధులు పౌల్‌రాజ్, ప్రభుదాస్, బుచ్చవ్వ, సంగీత, వినోదలు మతప్రచారం చేస్తున్నారు. ఇతర మతాల గురించి చెడు ప్రచారం చేయడంతో బిజెపి నేతలు వారితో వాగ్వాదానికి దిగారు. దీనిపై రాజగోపాల్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేయగా అక్కడికి చేరుకొని క్రైస్తవ ప్రచారకులను గ్రామం నుంచి తీసుకువెళ్లారు.