మెదక్

సిద్దిపేట రైల్వేలైన్‌కు నెల రోజుల్లో భూసేకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట,జనవరి 17 : సిద్దిపేట రైల్వేలైన్ భూ సేకరణ నెల రోజుల లోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సిఎం కెసిఆర్, మంత్రి హరీష్‌రావు ప్రాతినిథ్యం వహిస్తున్న జిల్లా కాబట్టి అధికారులంత ప్రత్యేకశ్రద్ధతో బాధ్యతలు నిర్వర్తించాలని సూచించారు. మంగళవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయ సమావేశ మందిరంలో జెసి హన్మంత్‌రావు, సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్ ఆర్డీఓలు, జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన తహశీల్దార్లు, విఆర్‌ఓలు, సాదాబైనామా, ఆసైన్డ్ భూములు, రైల్వేలైన్, ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతిపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈమేరకు సాదాబైనామా, రైల్వేలైన్, ఇరిగేషన్ ప్రాజెక్టులు, జాతీయ రహదారులకు సంబంధించి భూసేకరణ తదితర అంశాలపై రెవెన్యూ యంత్రాంగానికి కలెక్టర్ పలు సూచనలు చేశారు. సిద్దిపేట రైల్వేలైను భూసేకరణ, జిల్లా మీదుగా జాతీయ రహదారులు రానున్న క్రమంలో ఆ ప్రాంతాల్లోని రెవెన్యూ అధికారులతో భూసేకరణపై క్షుణ్ణంగా చర్చించారు. జిల్లాలో 83 కిలో మీటర్ల మేర రైల్వేలైన్‌కు గాను, ఇంకా దాదాపు 40 కిలోమీటర్ల మేర రైల్వేలైన్ భూ సేకరణ ప్రక్రియ చేపట్టాల్సి ఉందని వివరించారు. యుద్ధప్రాతిపాదికన రైల్వేలైన్ భూ సేకరణను చేపట్టేలా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని, వీరిలో కలెక్టర్‌తో పాటు జిల్లాలోని మూడు డివిజన్లకు చెందిన ఆర్డీఓలు బృంద సభ్యులుగా ఉంటారన్నారు.
సాదాబైనామా దరఖాస్తులకు త్వరగా పరిష్కారం
సాదాబైనామాల కోసం వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి జిల్లాలోని తహశీల్దార్లు, విఆర్‌ఓలను ఆదేశించారు. ప్రభుత్వం ప్రధాన అంశంగా తీసుకున్న సాదాబైనాల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించవద్దని రెవెన్యూ అధికారులకు ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో సంబంధిత అధికారులు పర్యటించి సమస్యలు పరిష్కరించాలని సూచించారు. సాదాబైనామాల్లో అసైన్డు భూములకు సంబంధించి దరఖాస్తులు వస్తే వెంటనే తిరస్కరించాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. ముఖ్యంగా సాదాబైనామాల విషయంపై గ్రామీణ ప్రాంత ప్రజలకు అవగాహన కల్పిస్తునే వారి భూములకు చట్టపరమైన హక్కులు కల్పించేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. సాదాబైనామాలకు రాజ్యాంగబద్ధమైన చట్ట హక్కులను కల్పించేలా ఫ్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. ప్రజా సంక్షేమం దృష్ట్యా, ప్రజాహిత కార్యక్రమాలు, రైతు హిత కార్యక్రమాలకు భూమి అవసరం ఉంటుందని వివరించారు. అలాంటి భూమికి చట్టపరమైన హక్కులు ఉంటేనే ఉపయోగకరమని, భూముల చట్టాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాల్సిన అవసరముందన్నారు. ఈ వీడియో కాన్పరెన్స్‌లోసిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్ ఆర్డీఓలు ముత్యంరెడ్డి, విజేందర్‌రెడ్డి, శంకర్, జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన తహాశీల్దార్లు పాల్గొన్నారు.

వైభవంగా శ్రీ చాముండీశ్వరీ దేవీ ఆలయ వార్షికోత్సవాలు
కౌడిపల్లి, జనవరి 17. శ్రీ చాముండేశ్వరీ దేవి 34వ ఆలయ వార్షికోత్సవాలు అంగరంగ వైభవంగా మంగళవారం నాడు ప్రారంభమయ్యాయి. చిలిపిచెడ్ మండలం మంజీరా నది తీరాన కొలువుదీరిన శ్రీ చాముండేశ్వరీ దేవీ 34వ ఆలయం వార్షికోత్సవాలకు ఉదయం నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. మూడు రోజుల పాటు నిర్వహించే ఆలయ వార్షికోత్సవాల్లో భాగంగా మొదటి రోజైన మంగళవారం నాడు భక్తులు మంజీరా నదిలో పుణ్యస్నానాలు ఆచరించి, మంజీరా జలాలను కుండలతో నింపుకొని మంగళవాయిద్యాలతో ఉరేగింపుగా శ్రీ చాముండేశ్వరీ దేవి ఆలయంకు తీసుకొనివచ్చారు. ఆలయ పూజారి ప్రభాకరశర్మ ఆధ్వర్యంలో వేద బ్రాహ్మణోత్తములు మోతీలాల్‌శర్మ, సుబ్రమణ్యశర్మ, రామశర్మ, విఠల్‌శర్మలు మంజీరా జలాలతో శ్రీ చాముండేశ్వరీ దేవికి అభిషేకం నిర్వహించారు. అనంతరం పంచామృతంతో అమ్మవారికి అభిషేకించారు. గణపతి పూజ, స్వస్తివాచనము, కలశస్థాపన, ఋత్విగ్వరణము, అఖండ దీపారాధన, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పట్టువస్త్రాలతో, పూలమాలలతో శ్రీ చాముండేశ్వరీ దేవిని అందంగా అలంకరించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా క్యూలో నిల్చున్నారు. ఆలయ ప్రధాన పూజారి అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయ వ్యవస్థాపకులు అయిలావజ్జెల సుబ్రమణ్యశాస్ర్తీ అధ్వర్యంలో శ్రీ చాముండీశ్వరీ సేవాసమితి శాక్తామండల్ కమిటీ భక్తులకు తగిన వసతులు కల్పించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మహా చండీహవనము, మహాపూజ, మహా నివేదన, హారతి, తీర్థప్రసాద వితరణ తదితర కార్యాక్రమాలను నిర్వహించారు. ఆలయం పరిసరాలు భక్తులతో నిండిపోయింది. సేవా సమితి కమిటీ సభ్యులు చిట్కుల్ నారాయణరెడ్డి, జనార్థన్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, శోభన్ చిట్కుల్ గ్రామస్థులు తదితరులు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. జంటనగరాలైన హైదరాబాద్, సికింద్రాబాద్ పట్టణాలతో పాటు , పటాన్‌చెరు, కౌడిపల్లి, అందోల్, హత్నూర, చిలప్‌చెడ్ మండలాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. మహరాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు శ్రీ చాముండేశ్వరీ దేవీ ఆలయం వార్షికోత్సవాలల్లో పాల్గొన్నారు. భక్తులకు అన్నదానం చేశారు.