మెదక్

దళితులను అవమానిస్తే గద్దె దింపుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తూప్రాన్, జనవరి 20: కెసిఆర్ ప్రభుత్వ హయాంలో దళితులపై అవమానాలు, అత్యాచారాలు, దాడులు, రాజకీయ వివక్షతలు జరుగుతున్నాయని ఎంఆర్‌పిఎస్ అధ్యక్షులు మంద కృష్ణమాదిగ ఆరోపించారు. తెలంగాణలో ఉన్నది అంబేద్కర్, జగ్‌జీవన్‌రాం వారసులమని గుర్తుపెట్టుకోవాలన్నారు. మా కళ్ళముందే మాకు అన్యాయం జరిగితే గద్దె దించే వరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు. శుక్రవారం తూప్రాన్ బస్టాండ్ సమీపంలో బాబుజగ్‌జీవన్‌రాం విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కెసిఆర్ గతంలో దళితుల్ని ఐదేండ్లపాటు ముఖ్యమంత్రిని చేస్తానని, తెలంగాణాకు కాపలాదారునిగా ఉంటానని చెప్పి అధికారంలోకి రాగానే ఆయనే గద్దెపై కూర్చున్నాడని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని అరెస్టయినవారిలో 95శాతం మంది దళితులు జైలుకు వెళ్ళారని, 54 శాతం కళాకారులు దూందాం పాటలతో ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారని, 32 శాతం దళితులు అవమానాలకు గురయ్యారన్నారు. కెసిఆర్ మంత్రివర్గంలో ఎస్సి మంత్రి రాజయ్యను ఎలాంటి కారణం చూపకుండానే నిర్ధాక్షణ్యంగా భర్తరఫ్ చేశారని మండిపడ్డారు. సర్పంచ్ శివమ్మ, నాయకులు పాల్గొన్నారు.
భావిపౌరుల ఆరోగ్యానికి బాటలు వేద్దాం

సంగారెడ్డి టౌన్, జనవరి 20: నులి పురుగుల నిర్మూలనకు 1నుండి 19యేళ్ల వయస్సులోపు వారందరూ అల్‌బెండజోల్ మాత్రలు వేసుకునేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు సంబంధిత అధికారులను ఆదేశించారు. పిబ్రవరి 10న నిర్వహించే జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమ నిర్వహణపై శుక్రవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. జిల్లా, డివిజన్, మండల స్థాయిలో సుమారు 3.50లక్షల మాత్రలను పంపిణీ చేసి పిబ్రవరి 10న వితరణ చేయాలన్నారు. పిల్లల్లో ముఖ్యంగా రక్తహీనత, పోషక లోపం, బలహీనత తదితర ఆరోగ్య సమస్యలు నులి పురుగుల వల్లే సంభవిస్తాయని, వీటిని నివారించేందుకు అల్‌బెండజోల్ మాత్రలు తప్పని సరిగా వేసుకోవాలన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో వీలైనంత ఎక్కువ మందికి మాత్రలు వేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పాలుపంచుకునే వివిధ శాఖల అధికారులకు జిల్లా స్థాయి శిక్షణను ఈ నెల 21న కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 23నుండి 25వ తేదీ వరకు డివిజన్ స్థాయిలో, ఫిబ్రవరి 3న పిహెచ్‌సి స్థాయిలు అధికారులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ గాయత్రిదేవి మాట్లాడుతూ అల్‌బెండజోల్ మాత్రలను ఖచ్చితంగా నమిలి తీసుకోవాలని మింగకూడదనే విషయాన్ని అధికారులు ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ఆహారం తీసుకున్న తరువాత ఈ మాత్రను తీసుకుంటే మంచిదని తెలిపారు. 1-2 సంవత్సరాల లోపు చిన్నారులకు సగం మాత్రను మాత్రమే ఇవ్వాలని సూచించారు. అనివార్య కారణాలతో పిబ్రవరి 10న మాత్రలు వేసుకొని వారికి 15న ఇవ్వడం జరుగుతుందన్నారు. డ్వాక్రా, ఐకెపి, మహిళా సంఘాలు బడి బయట పిల్లల్లో అవగాహన కల్పించి మాత్రలు వేసుకునేలా చూడాలన్నారు. అన్ని ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు ఈ మాత్రలను ఇవ్వడం జరుగుతుందన్నారు. డిపిఓ వెంకటేశ్వర్లు, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి శ్రీ్ధర్, జిల్లా గిరిజన సంక్షేమాధికారి మణేమ్మ, విద్యా, గ్రామీణాభివృద్ధి, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.