మెదక్

ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, జనవరి 22: ఆరోగ్యమే మహాభాగ్యం అన్న నినాదంతో సంగారెడ్డి నియోజకవర్గ ప్రజల ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి విడుదలై ఎల్‌సి పత్రాలను ఆదివారం తన నివాసంలో బాధితులకు అందజేసారు. కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన ప్రేంకిషోర్ వెన్నుపూస నొప్పితో బాధపడుతూ చికిత్సకు అవసరమైన ఆర్థిక సహాయం అందించాలని ఆశ్రయించగా ముందస్తు చికిత్స నిమిత్తం లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందిస్తూ సిఎం సహాయ నిధి నుంచి ఎల్‌సి అందజేసారు. సంగారెడ్డి మండలం ఇస్మాయిల్‌ఖాన్‌పేటకు చెందిన రంజిత్‌గౌడ్ మూత్ర పిండాల సమస్యకు అవసరమైన చికిత్స కోసం 1.5 లక్షల సహాయం, ఇదే మండలం కులబ్‌గూర్‌కు చెందిన షాజాది బేగం క్యాన్సర్ చికిత్సకు రూ.2 లక్షల ఆర్థిక సహాయాన్ని ఆదివారం తన చేతులమీదుగా అందజేసారు. ముందుగానే చికిత్సలు చేయించుకుని సిఎం సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయం కోసం దరఖాస్తులు పెట్టుకున్న మొత్తం 19 మందికి 6,53,500 రూపాయల ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ఆంధ్రభూమి ప్రతినిధితో ఎమ్మెల్యే ప్రత్యేకంగా మాట్లాడారు. వివిధ కారణాలతో అనారోగ్యానికిలోనై చికిత్సలు పొందలేని అభాగ్యులకు తనవంతు చేయూతను అందించడానికి ముఖ్యమంత్రి సహాయ నిధిని సద్వినియోగం చేసుకుంటున్నట్లు వివరించారు. రెండున్నర సంవత్సరాల తన పదవి కాలంలో ఇప్పటి వరకు నియోజకవర్గం పరిధిలోని సంగారెడ్డి, సదాశివపేట, పట్టణాలు, కంది, సదాశివపేట, కొండాపూర్, సంగారెడ్డి మండలాల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన ఆపన్నులకు రూ.6 కోట్ల మేరకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయం అందించినట్లు వెల్లడించారు. 540 మంది ఆయా రకాల చికిత్సలు పొందడానికి నిధులు సమకూర్చినట్లు స్పష్టం చేసారు. సగటు మనిషికి సత్వరంగా ఆర్థిక సహాయం అవసరమనేది ఆరోగ్య పరిరక్షణకే అన్నారు. ఆపత్కాలంలో ఉండే వారికి చేయూతను అందించినప్పుడే నిజమైన సంతృప్తి లభిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించడంలో సిఎం కృతకృతులుగా ఉన్నారని, టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని సంతృప్తిని వ్యక్తం చేసారు. ప్రభుత్వాసుపత్రులతో పాటుగా ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్సలు పొందిన వారికి సిఎం సహాయ నిధి నుంచి కోట్లాది రూపాయలు కేటాయిస్తూ ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. ఆరు మాసాల క్రితం వివాహ శుభకార్యక్రమానికి వెళుతూ మేడ్చల్ సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డుపై టోల్‌గేట్ వద్ద జరిగిన ప్రమాదంలో సదాశివపేటకు చెందిన 8 మంది మరణించారని, ప్రమాదంలో మరణించిన వారంతా చేతికివచ్చిన యువకులు కావడం, ఆయా కుటుంబాలను మానవతా దృక్పథంతో ఆదుకోవడానికి ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున మొత్తం 40 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని మంత్రి హరీష్‌రావు చేతుల మీదుగా అందజేసినట్లు వివరించారు. ఆయా గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు మరణిస్తే వారికి కుటుంబాలకు కూడా కొంత మేరకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం ఇప్పించడంలో తనవంతు కృషి చేసినట్లు తెలిపారు. పార్టీ సభ్యత్వం ఉండి ప్రమాదంలో మరణించిన కార్యకర్తల కుటుంబాలకు కూడా 2 లక్షల చొప్పున సహాయం అందించినట్లు వెల్లడించారు. అకాల వర్షాలతో సంభవించిన వరదల్లో కొట్టుకుపోయి మృతి చెందిన వారితో పాటు ఇండ్లు కూలి చనిపోయిన వారి కుటుంబాలకు కూడా ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందించినట్లు పేర్కొన్నారు. తన నియోజకవర్గం ప్రజలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేందుకు ప్రభుత్వ పరంగా ఏలాంటి సహాయం అందించడానికైనా తాను ఎళ్లవేళలా సిద్దంగా ఉన్నట్లు పేర్కొన్నారు. తన నియోజకవర్గ ప్రజల ఆరోగ్య పరిరక్షణతో పాటుగా ఇతర బాధితులకు చేయూతనిస్తూ సహకరిస్తున్న సిఎం కెసిఆర్, మంత్రి హరీష్‌రావుకు ఈ సందర్భంగా చింతా కృతజ్ఞతలు తెలిపారు.

అమ్మ క్షేత్రానికి ఆదివార శోభ

శ కిటకిటలాడిన ఏడుపాయల
పాపన్నపేట, జనవరి 22: ఏడుపాయల వనదుర్గ్భావాని మాత పుణ్యక్షేత్రం ఆదివారం రోజు వేలాది మంది భక్తులతో జనసంద్రంగా మారింది. తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచే కాక పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ తదితర ప్రాంతాల నుండి భక్తులు వివిధ వాహనాల్లో భారీయెత్తున ఏడుపాయలకు తరలివచ్చారు. వనదుర్గామాత సన్నిధిలో ప్రవహిస్తున్న పవిత్ర మంజీర నదీపాయల్లో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. ఆదివారం ఉదయం వనదుర్గామాత ఆలయంలో అమ్మవారికి అలయ అర్చకులు అభిషేకం, కుంకుమార్చన తదితర ప్రత్యేక విశేషాలంకరణ పూజలు నిర్వహించారు. అమ్మవారిని గర్భాలయంలో అలయ అర్చకులు ఆకుపచ్చని పట్టు వస్త్రంలో అత్యంత సుందరంగా అలంకరించారు. అమ్మవారు దీప కాంతుల మధ్య కోటి సూర్యప్రభ విద్యుత్ కాంతులతో బంగారు వర్ణంలో దగదగలాడుతూ భక్తజనావళికి దర్శనమిచ్చారు. డప్పుచప్పులు, బ్యాండ్ మేళాల మధ్య భారీ బోనాల ఉరేగింపులు, శివసత్తుల శిగాలు, పోతరాజుల విన్యాసాలు తెలంగాణ సంస్కృతిని ప్రతిభింబించే విధంగా ఏడుపాయల ప్రాంగణమంతా హోరెత్తింది. అత్యధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఆలయంలో క్యూలైన్ల ద్వారా వనదుర్గామాతను భక్తిశ్రద్దలతో దర్శించుకున్నారు. మహిళా భక్తులు నెత్తిని విరబోసుకొని ఆపై గండదీపం పెట్టుకొని, ముఖానికి పసుపు రాసుకొని వేప కొమ్మలు చేతబూని, మెడలో గవ్వలహారాలు, పూలదండలు చేతిలో కొరడా పట్టుకొని నెత్తిపై బోనం ఎత్తుకొని డప్పుచప్పుళ్లకు అనుగుణంగా లయబద్దంగా నృత్యాలు చేస్తూ అమ్మవారి ఆలయం వైపు సాగిపోతున్న దృశ్యాలు చూస్తూ భక్తులు మంత్రముగ్దులయ్యారు. భక్తులు దుర్గామాత అమ్మవారికి బోనాలు, కొబ్బరికాయలు, తలనీలాలు, అమ్మవారికి చీరలను, గాజులను సమర్పించి మొక్కులను తీర్చుకున్నారు. సంతాన ప్రాప్తి కలగాలని అమ్మవారి సన్నిధిలోని సంతాన గుండంలో దంపతులు పవిత్ర స్నానాలు ఆచరించారు. కోరిన కోర్కెలు తీరిన భక్తులు దుర్గామాత ఆలయంలో కొబ్బరికాయలు, తొట్టెలను కట్టారు. ఆలయ ఈఓ టి.వెంకటకిషన్‌రావు, ఆలయ సిబ్బంది చల్లా గోపాల్, జెన్న రవికుమార్, సిద్దిపేట శ్రీనివాస్, పి.మధుసూదన్‌రెడ్డి, సూర్య శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, ప్రతాప్‌రెడ్డి, తదితరులు భక్తులకు తమతమ సేవలందించారు.