మెదక్

ఘనంగా.. రుద్రపరిషత్ యజ్ఞం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తూప్రాన్, జనవరి 22: మండలంలోని ఇస్లాంపూర్ శివారులో గల రామక్కగుట్ట దేవాలయంలో 277వ రామలింగేశ్వర రుద్రపరిషత్ శని, ఆది వారాలు ఘనంగా జరిగింది. రుద్రపరిషత్ అధ్యక్షులు చాడ మాణిక్యశర్మ ఆద్వర్యంలో ఏకాదశి రుద్రాభిషేకం, శివపంచాక్షరి, అష్టలక్ష్మి, లక్ష్మి గణపతి, హనుమాన్, పాశుపద హోమములు జరిగాయి. అనంతరం తీర్థ ప్రసాదం, మహా ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమానికి భక్తులు సద్దిరాములు, శివకుమార్, నారాయణరెడ్డి, లక్ష్మన్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
కోళ్లఫారంలో పనిచేస్తున్న
అబలపై అత్యాచారం
కొండపాక, జనవరి 22: మహిళపై అత్యాచారం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేయగా ఏఎస్పీ ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నట్లు కుకునూరుపల్లి ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం మండలంలోని కోనాయిపల్లి శివారులోని కోళ్లఫారంలో పనిచేస్తున్న మహిళపై కరీంనగర్‌కు చెందిన కోళ్లఫారం యజమాని నర్సింహారెడ్డి అత్యాచారం చేశాడని, బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

డబుల్ బెడ్ రూం ఇళ్ల్ల నిర్మాణ పనులు ప్రారంభం

దుబ్బాక, జనవరి 22: దుబ్బాకలో డబుల్‌బెడ్ రూం ఇళ్ల పథకానికి ఆదివారం పనులు ప్రారంభించారు. డిఆర్‌ఇఇ శ్రీనివాస్‌రెడ్డి, ఏఎంసి చైర్మన్ ఎల్లారెడ్డి మొదటివిడతగా నిర్మించే ఇళ్ల్లకు ముగ్గుపోసి ప్రారంభోత్సవం చేశారు. ఈనెల 8న దుబ్బాకలో మొదటివిడతగా 128ఇళ్ల నిర్మాణానికి బిసి కాలనీలో మంత్రి హరీష్‌రావు, అంచనాల కమిటీ రాష్ట్ర చైర్మన్ రామలింగారెడ్డి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. పట్టణానికి వెయ్యి ఇళ్ల్లు మంజూరైనాయి. దీంట్లో మొదటగా 128 ఇళ్లు నిర్మించనున్నట్లు తెలిపారు. ఇండ్లులేని పేదలు, గుడిసెల్లో నిర్మించే వారికి ప్రాధాన్యత కల్పిస్తారన్నారు. 128ఇళ్లు పూర్తికాగానే మిగతావి కూడా ప్రారంభమైతాయన్నారు. ఈ పథకంలో ఏలాంటి అక్రమాలకు తావివ్వకుండా పారదర్శకంగా నిజమైన లబ్ధిదారులకు అందేలా చూడాలని మంత్రి హరీష్ అధికారులను ఆదేశించారు. ఇళ్ల్ల నిర్మాణం కాగానే అర్హులకు ఇళ్ల్లు అందిస్తామన్నారు. ఏమాత్రం ఈ పథకంలో అనర్హులకు తావిచ్చేది లేదని, తప్పుజరిగితే సంబంధిత అధికారులదే బాధ్యతని మంత్రి హెచ్చరించడంతో అధికారులు జాగ్రత్తగా జాబితాను రూపొందిస్తున్నారు. నాణ్యత ప్రమాణాలతో,పూర్తి వాస్తు, ప్రణాళికతో ఇండ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. టిఆర్‌ఎస్ నేతలు, అధికారులు పాల్గొన్నారు.