మెదక్

ఉన్న ఊరిలోనే ఉపాధి పొందాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తొగుట, జనవరి 22: యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం పట్టణాలకు వలసపోకుండా ఉన్న ఊరిలోనే వనరులు సద్వినియోగం చేసుకోవాలని మాజీ మంత్రి ముత్యంరెడ్డి అన్నారు. యువత మేలుకో కార్యక్రమంను ఆదివారం తొగుటలోని కోటిలింగాల గుడి ఆవరణలో ప్రారంభించి మాట్లాడారు. యువత గాంధీజీ కలలు గన్న గ్రామస్వరాజ్యం, అంబేద్కర్ రాజ్యాంగ ఫలాలు, వివేకానందుని స్ఫూర్తితో యువత సంస్కృతిని పెంపొందించి దేశాభివృద్ధి, సమాజహితం కోసం పాటుపడాలన్న సంకల్పంతో కార్యక్రమం చేపట్టామన్నారు. రాజకీయాలకు అతీతంగా స్వయం సమృద్ధి సాధించేందుకు కార్యక్రమం దోహద పడుతుందన్నారు. అందరు సుఖసంతోషంగా ఉండాలన్నదే తన సంకల్పమన్నారు. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని, గ్రామాల అభివృద్ధితోనే దేశాభివృద్ది జరుగుతుందన్నారు. ఇందుకు యువత కృషి చేసి ఆదర్శంగా నిలవాలన్నారు. శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి వారి కాళ్ల పై వారు నిలబడేందుకే కార్యక్రమం చేపట్టామన్నారు. గతంలో తాను అమెరికాలో ఏండ్లకొద్ది ఉద్యోగం చేశానని, మిత్రులతోకలిసి ట్రస్టు ఏర్పాటు చేస్తే మధ్యలోనే మోసం చేశారన్నారు. దీంతో తాము సొంతంగా 80లక్షలు వెచ్చించి స్కూల్ భవనం నిర్మించామన్నారు. ఎన్‌ఆర్‌ఐ నుంచి చందాలు వసూలు చేసి నిర్మించినట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్దమని, అరోపణలు చేయవద్దన్నారు. ప్రతి నెల 2రోజుల పాటు మండలంలో ఉండి యువతకు చేయూతనిచ్చేందుకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో ఎఎంసి మాజీ చైర్మన్ కృష్ణారెడ్డి, కనకయ్య, శ్రీనివాస్, వెంకట్‌రెడ్డి, విజయ్‌రెడ్డి, సత్తయ్య, బాల్‌రెడ్డి, రాములు, సుమారు 300మంది యువత పాల్గొన్నారు.

ఎస్పీ కార్యాలయ భవనాలను
పరిశీలించిన కార్పొరేషన్ ఎండి

సంగారెడ్డి, జనవరి 22: జిల్లా కేంద్రమైన సంగారెడ్డి పట్టణంలోని పోలీసు అధికారి కార్యాలయం భవనాలతో పాటు ఇతర భవనాలను పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండి, ఐజి బి.మల్లారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేసారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన కార్యాలయం, ఎఆర్ హెడ్‌క్వార్టర్స్, ఎంఐ రూం, పోలీసు కల్యాణ మండపం తదితర భవనాలను పరిశీలించారు. వాటి వివరాలను ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. పోలీసు సిబ్బంది నివాసాల తీరును కూడా ఈ సందర్భంగా ఎండి అడిగి తెలుసుకున్నారు. వీరివెంట సంగారెడ్డి డిఎస్పీ తిరుపతన్న, ఆర్‌ఐ చెన్నకేశవులు, పట్టణ సిఐ రామకృష్ణారెడ్డి, హౌసింగ్ కార్పోరేషన్ సిబ్బంది పాల్గొన్నారు.