మెదక్

క్యాష్‌లెస్ లావాదేవీలే సులభం..సురక్షితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, జనవరి 22 : సిద్దిపేట నగదు రహితంగా తీర్చిదిద్దేందుకు అన్ని వర్గాలు సహకరించటం అభినందనీయమని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. ఆదివారం స్థానిక ఫ్యాషన్ స్డూడియోలో స్వైప్ మిషన్ ద్వారా లావాదేవీలను ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్ద నోట్లు రద్దు చేయటంతో ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం క్యాష్‌లెస్‌ను ప్రోత్సహిస్తుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ సిద్దిపేటను నగదు రహితంగా మార్చేందుకు ప్రయోగాత్మకంగా ఎంచుకున్నట్లు తెలిపారు. సిద్దిపేట ఇప్పటికే నగదు రహితంలో దూసుకెళ్తుందన్నారు. నియోజక వర్గంలో క్యాష్‌లెస్ లావాదేవీలు జోరందుకున్నాయని, గ్రామీణ ప్రాంతాల్లో నగదు రహిత లావాదేవీలు నిర్వహిస్తున్నారన్నారు. నిరక్ష రాస్యులు సైతం క్యాష్ లెస్ లావాదేవీలు నిర్వహించటం అభినందనీయమన్నారు. క్యాష్‌లెస్ లావాదేవీలు ఏంతో సులభతరం..సురక్షితమైందన్నారు. వ్యాపారస్తులు స్వైప్ మిషన్లు తీసుకొని లావాదేవీలన్ని క్యాష్‌లెస్‌గా నిర్వహించాలన్నారు. సిద్దిపేటను పూర్తిగా క్యాష్‌లెస్‌గా మార్చాలని సూచించారు. ఫోటోస్టూడియోలో క్యాష్‌లెస్ సేవలు ప్రారంభించిన నిర్వాహాకుడు ప్రభుదాస్‌ను అభినందించారు. ఆనంతరం మంత్రి హరీష్‌రావును ప్రభుదాస్ ఘనంగా సన్మానించారు.