మెదక్

సౌర విద్యుత్ వినియోగంలో మెదక్ జిల్లాకు కేంద్ర పురస్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్ టౌన్, జనవరి 23: ఇంటింటికీ సౌర విద్యుత్ పరికరాలను అమర్చినందుకు రాష్ట్రంలో మెదక్ జిల్లాకు రెండవ స్థానం దక్కింది. సౌర విద్యుత్ యూనిట్‌ల ఏర్పాటు, వినియోగంపై ప్రజలను చైతన్యపరిచినందుకు జిల్లా కలెక్టర్ భారతి హొళ్లికేరికి అపూర్వ గౌరవం దక్కింది. అవార్డుతో పాటు ప్రశంసా పత్రాన్ని అందుకోవాలంటూ మెదక్ జిల్లా కలెక్టర్ భారతి హొళ్లికేరికి రాష్ట్ర ప్రభుత్వ సహాయ కార్యదర్శి నుంచి సోమవారం ఉత్తర్వులు అందాయి. ఈ మేరకు మెదక్ జిల్లా కలెక్టర్ సోమవారం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈ నెల 24న ఢిల్లీలోని గుల్‌మోహర్ హాల్‌లో బొగ్గు, భూగర్భ గనులు, విద్యుత్ శాఖ మంత్రి చేతుల మీదుగా కలెక్టర్ అపూర్వ గౌరవాన్ని అందుకోనున్నారు. జిల్లాలో 2015-16 సంవత్సరంలో గృహ అవసరాలు, సౌర విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు విరివిగా అనుమతులు ఇచ్చి వినియోగంలోకి తెచ్చేందుకు కృషి చేసినందుకు ఈ గౌరవం దక్కింది.

గణతంత్ర దినోత్సవానికి ముస్తాబు

సంగారెడ్డి, జనవరి 23: సర్వసత్తాక దేశంగా ఆవిర్భవించిన 68వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఉమ్మడి మెదక్ జిల్లాలో కొత్తగా ఏర్పాటైన సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లా కేంద్రాలు నిర్వహించుకోవడానికి ముస్తాబవుతున్నాయి. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఎప్పటి మాదిరిగానే పోలీస్ ఫరేడ్ గ్రౌండ్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించనుండగా కొత్తగా ఏర్పాటైన సిద్దిపేట, మెదక్‌లో కూడా వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి అధికార యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. డివిజన్ కేంద్రంగా ఉన్నప్పుడు సిద్దిపేటలో హైస్కూల్ గ్రౌండ్‌లో స్వాతంత్ర, గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించేవారు. కాగా అక్కడ తాత్కాలికంగా రైతు బజార్‌ను ఏర్పాటు చేయడంతో పత్తి మార్కెట్, హిందూర్ ఇంజనీరింగ్ కళాశాలల ఆవరణలో నిర్వహించాలని అధికారులు పరిశీలించారు. హిందూర్ ఇంజనీరింగ్ కళాశాలను చివరకు ఖరారు చేసి ఏర్పాట్లను చేస్తున్నారు. నగర కమిషనర్ శివకుమార్ ఆధ్వర్యంలో పోలీసు ఫరేడ్‌ను నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. మెదక్ పట్టణంలో ఇందిరాగాంధీ స్టేడియం గ్రౌండ్‌లో గణతంత్ర వేడుకలను నిర్వహించడానికి జిల్లా యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. మొదటి సారిగా ముగ్గురు కలెక్టర్లు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి జిల్లాల ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఆహుతులను ఆకట్టుకునే విధంగా విద్యార్థినీ విద్యార్థులకు తగిన తర్ఫీదునిస్తున్నారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన అన్ని శాఖల ఉద్యోగులకు కలెక్టర్ల చేతులమీదుగా ప్రశంసా పత్రాలను, జ్ఞాపికలను అందజేయనున్నారు. స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులను సన్మానించి సత్కరించే కార్యక్రమాన్ని కూడా ఆనవాయితి ప్రకారంగా నిర్వహించనున్నారు. వివిధ శాఖల శకటాలను ప్లాస్టిక్ రహితంగా తయారు చేయించి ప్రజలకు ప్లాస్టిక్ వాడకూడదనే అవగాహన కల్పించనున్నారు. ఉదయం 9 గంటలకు కలెక్టర్లు మువ్వనె్నల జెండాలను రెపరెపలాడించనున్నారు. అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు ఆయా జిల్లాల్లో సాధించిన ప్రగతి నివేధికలను కలెక్టర్లు సందేశం ద్వారా జిల్లాల ప్రజలకు తెలియజేయనున్నారు. సిద్దిపేట, మెదక్ జిల్లాలతో పాటుగా స్వంత పేరుతో జిల్లాగా ఆవిర్భవించిన సంగారెడ్డి జిల్లాల్లో మొట్టమొదటి గణతంత్ర దినోత్సవ వేడుకలకు 68వ గణతంత్ర దినోత్సవం వేదికగా నిలిచి చరిత్రకెక్కనుండటం విశేషం.