మెదక్

ఆత్మాభిమానంతో బతకాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబ్బాక, జనవరి 26: పేదరికాన్ని పారదోలడమే కాక ప్రతి ఒక్కరు ఆత్మాభిమానంతో బతకాలని ప్రభుత్వం కృషి చేస్తుందని అంచనాల కమిటి రాష్ట్ర చైర్మన్ రామలింగారెడ్డి అన్నారు. దుబ్బాకలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా గాంధీ విగ్రహం వద్ద వేడుకల్లో పాల్గొని మాట్లాడుతూ ప్రతి పేద కుటుంబానికి కూడు,గుడ్డ, గూడు కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకుపోతుందన్నారు. నియోజకవర్గంలో గుడిసెలేకుండా గృహవసతి కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కిరాయిలు, గుడిసెల్లో ఉన్నవారికి డబుల్ బెడ్‌రూంలు అందిస్తారన్నారు. రామసముద్రం, పెద్దచెరువులను ట్యాంక్‌బండ్‌లా మార్చుతామని, మిషన్ భగీరథ కింద ఇంటింటా తాగునీరు అందిస్తామన్నారు. అనంతరం సర్కార్ దవాఖానను సందర్శించి పేదలకు ఏమేరకు వైద్యం అందుతుందో వైద్యులతో సమీక్షించారు. మండలంలోని పర్శరాంనగర్‌లో డబుల్ బెడ్ రూం పథకానికి శంకుస్థాపన చేశారు.
తలకిందులుగా..
దుబ్బాకలో గురువారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా గాంధీ విగ్రహం వద్ద జరిగిన వేడుకల్లో జాతీయ పతకానికి అవమానం చోటుచేసుకుంది. వేడుకల్లో తలకిందులుగా జాతీయ పతాకాన్ని ఎగురవేయడంతో అక్కడున్నవారంతా నిర్ఘాంతపోయారు. నగర పంచాయతీ కమిషనర్ భోగేశ్వర్లు తలకిందులుగా ఉన్న జెండాను ఎగురవేయడంతో అక్కడ ఉన్న ఎమ్మెల్యే రామలింగారెడ్డి, ఉన్నవారంతా గమనించి మళ్లీ పతాకాన్ని సరిచేసి ఎగురవేశారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే పతాకానికి అవమానం జరుగడం పట్ల విచారం వ్యక్తం చేశారు. సంఘటన పట్ల ఎమ్మెల్యే క్షమాపణ చెప్పారు.

గామీణ విద్యార్థులకు ప్రభుత్వ ప్రోత్సాహం
143 గురుకులాల్లో 28 వేల మంది విద్యార్థులకు బోధన
డిజిటల్, మన టివిలతో సమర్థవంతంగా విద్యాబోధన
బిసి సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అశోక్‌కుమార్
గజ్వేల్, జనవరి 26: తెలంగాణ ప్రభుత్వంలో గ్రామీణ విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉందని బిసి సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అశోక్‌కుమార్ పేర్కొన్నారు. గురువారం ప్రజ్ఞాపూర్‌లోని మహాత్మా జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల బాలికల గురుకుల కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన సందర్బంగా ఆయన మాట్లాడారు. బాలికా విద్యను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం వారిలో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీస్తుండగా, క్రమశిక్షణ, పట్టుదల, ప్రణాళికాబద్దంగా విద్యనభ్యసిస్తూ చక్కటి ఫలితాలు సాదించాలని కోరారు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 143 గురుకులాలు, కళాశాలల్లో 28వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తుండగా, ప్రతి విద్యార్థిపై ప్రభుత్వం రూ. లక్షా 25వేలు వెచ్చిస్తున్నట్లు స్పష్టం చేశారు. వచ్చే యేడాది మరిన్ని గురుకుల కళాశాలలను ఏర్పాటుచేస్తుండగా, మెరిట్ ఆదారంగా విద్యార్థుల ఎంపిక జరుగుతుందని తెలిపారు. అలాగే గజ్వేల్ మహాత్మా జ్యోతిబాపూలే కళాశాల ఏర్పాటు కోసం పీర్లపల్లి శివారులో 42 ఎకరాలు గుర్తించగా, రూ. 118 కోట్ల వ్యయంతో త్వరలోనే నిర్మాణాలు చేపట్టనున్నట్లు చెప్పారు. కాగా మొదటగా కళాశాలలోని తరగతిగదులు, విద్యార్థులకు వడ్డించడానికి సిద్దంగా ఉన్న ఆహార పదార్ధాలు తనిఖీ చేయడంతోపాటు అక్కడ నెలకొన్న సమస్యలను విద్యార్థుల నుండి అడిగి తెలుసుకున్నారు.