మెదక్

బంగారు తెలంగాణ సాధనకు కృషి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, జనవరి 26: బంగారు తెలంగాణ సాధనలో ప్రతి ఒక్కరు భాగస్వాములై జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ మాణిక్యరాజ్ కణ్ణన్ పిలుపునిచ్చారు. గురువారం సంగారెడ్డి పోలీస్ పెరేడ్ మైదానంలో గణతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన తరువాత ప్రజలకు సుపరిపాలన అందించాలనే లక్ష్యంగా ప్రభుత్వం చిన్న జిల్లాలను ఏర్పాటు చేసి అభివృద్ధికి బాటలు వేసిందన్నారు. ఇందులో భాగంగా జిల్లాలో మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, హరితహారం, షాదీముభారక్, కళ్యాణలక్ష్మి, డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం తదితర కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. వివిధ శాఖల ద్వారా జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కలెక్టర్ ప్రసంగం ద్వారా వివరించారు. అనంతరం స్వాతంత్య్ర సమరయోధులను ఘనంగా సన్మానించారు. భారత ఎన్నికల సంఘం, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, అటవీశాఖ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, అగ్నిమాపక శాఖ, వ్యవసాయశాఖ, విద్యా మరియు సర్వశిక్షా అభియాన్ తదితర శాఖలు శఖటాలను ప్రదర్శించారు. జిల్లా పరిషత్ బాలికల ఉన్న పాఠశాల సంగారెడ్డి, కస్తూరీబా బాలికల పాఠశాల జిన్నారం, సబిత విభిన్న వంతుల పాఠశాల సంగారెడ్డి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొండాపూర్ మండలం గంగారం, స్పెక్ట్రా పాఠశాల సంగారెడ్డి, శ్రీ సరస్వతీ శిశుమందిర్ సంగారెడ్డి, సెయింట్ ఆన్స్ పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. గంగారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన ప్రదర్శనకు ముగ్దులైన టిఎన్‌జివోస్ జిల్లా నాయకులు రూ.2వేల నగదు పురస్కారాన్ని కలెక్టర్ చేతుల మీదుగా విద్యార్థులకు అందించారు. అనంతరం అత్యుత్తమ సేవలు అందించిన 33శాఖలకు చెందిన 106 మంది ఉద్యోగులకు కలెక్టర్ ప్రశంసా పత్రాలను అందజేశారు. వివిధ శాఖలు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ స్టాల్స్‌ను కలెక్టర్ సందర్శించారు. సమాచార పౌర సంబంధాల శాఖ ఏర్పాటు చేసిన ఛాయచిత్ర ప్రదర్శన స్టాల్‌ను కలెక్టర్ ప్రారంభించారు. స్వయం సహాయక సంఘాల పిల్లలకు ఉపకార వేతనాలకు చెందిన రూ.కోటి 61లక్షల 37వేల 600ల చెక్కును కలెక్టర్ పంపిణీ చేశారు. మహిళా శిశు, వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నలుగురు దివ్యంగులకు రూ.24వేల విలువ గల నాలుగు ట్రైసైకిళ్లు, దివ్యంగులను వివాహాం చేసుకున్న ఆరు జంటలకు ఒక్కొ జంటకు రూ.50వేల చొప్పున మొత్తం 3లక్షల రూపాయల చెక్కులను అందజేశారు. కార్మిక శాఖ ఆధ్వర్యంలో భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టం, వివిధ పథకాల కింద 11 మందికి 7.70లక్షల రూపాయల చెక్కులను కలెక్టర్ పంపిణీ చేశారు. ఎన్‌సిడిసి పథకం కింద సంగారెడ్డి నియోజకవర్గంలోని మూడు గొర్రెల పెంపకందార్ల సహకార సంఘాల సభ్యులైన 16 మంది లబ్ధిదారులకు రూ.16లక్షల చెక్కులను అందజేశారు. వేడుకల్లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంవి రమణనాయుడు, న్యాయమూర్తులు హరీష, దుర్గాప్రసాద్, శాంతరాజు, వెంకట్రామ్, ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, డిఆర్వో రఘురాంశర్మ, జెడ్పీ చైర్మన్ రాజమణి, అందోల్ ఎమ్మెల్యే బాబుమోహన్, జిల్లా అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.

మూడు జిల్లాల్లో రెపరెపలాడిన మువ్వనె్నల జెండా
అట్టహాసంగా గణతంత్ర వేడుకలు * జిల్లాల ప్రగతిని వెల్లడించిన కలెక్టర్లు

సంగారెడ్డి, జనవరి 26: కొత్తగా ఏర్పడిన మూడు జిల్లాల్లో మొదటి సారిగా గణతంత్ర దినోత్స వేడుకలను ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. 68వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల కేంద్రాల్లో కలెక్టర్లు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. సంగారెడ్డిలోని పోలీస్ ఫరేడ్ మైదానంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించగా, సిద్దిపేటలో హిందూర్ ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో, మెదక్‌లో ఇందిరాగాంధీ స్టేడియం గ్రౌండ్‌లో సంబురాలను నిర్వహించారు. ఉదయం 9 గంటలకు కలెక్టర్లు మానిక్కరాజ్ కణ్ణన్, భారతి హోళికేరి, వెంకట్రాంరెడ్డిలు జాతీయ పతాకాలను ఎగురవేసారు. అంశాల వారిగా ఆయా శాఖలు సాధించిన పురోగతి వివరాలను జిల్లాల ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కొత్త జిల్లాల్లో మొదటి సారి గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించుకుంటున్న సందర్భంగా సాంస్కృతిక ప్రదర్శనలు అందరిని ఆకట్టుకునే విధంగా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది.
విద్యార్థుల నృత్యాలు, ఆహుతులను ఆకట్టుకున్నాయి. సంగారెడ్డిలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ రాజమణి, అందోల్ ఎమ్మెల్యే బాబుమోహన్‌లు పాల్గొన్నారు. పోలీసులు సమర్పించిన గౌరవ వందనాన్ని కలెక్టర్లు స్వీకరించారు. స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులను కలెక్టర్లు సన్మానించారు. వివిధ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగులకు ప్రశంసా పత్రాలతో సత్కరించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో సిద్దిపేట నగర కమిషనర్ శివకుమార్, మెదక్ ఎస్పీ చందనాదీప్తి, సంగారెడ్డి ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డిలు పాల్గొన్నారు. జిల్లాలతో పాటుగా అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు వివిధ కార్యక్రమాల్లో పాల్గొని గణతంత్ర వేడుకలను నిర్వహించారు. పాఠశాలలు, కళాశాలు, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు.