మెదక్

కోమటి చెరువుకు పర్యాటక శోభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, జనవరి 27 : సిద్దిపేట కోమటిచెరువును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. అమృత్ పథకంలో భాగంగా 1.10 కోట్లతో చెరువు చుట్టు రింగ్ రోడ్డు, వాకింగ్, సైక్లింగ్ ట్రాక్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. శుక్రవారం కోమడిచెరువు వద్ద అభివృద్ధిపై టూరిజం, ఇరిగేషన్, మున్సిపల్, రెవెన్యూ అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ కోమటిచెరువు ఎఫ్‌టిఎల్ చుట్టు భూసేకరణ వేగవంతం చేయాలన్నారు. 2కోట్ల రూపాయలతో గ్రీనరీ పార్కు అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. మున్సిపల్ కౌన్సిల్, రెవెన్యూ, ఇరిగేషన్, టూరిజం అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి భూ సేకరత సత్వరం చేయాలన్నారు. చెరువులో జెట్టి బోటును ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కోమటిచెరువు వద్ద యోగ కేంద్రాన్ని ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రతి రోజు యోగ శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. చెరువు వద్ద శిల్పరామం, పార్కు, బతుకమ్మ ఫ్లాట్ ఫాంను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
రూ. 3కోట్లతో వైశ్య భవన్ నిర్మాణం
సిద్దిపేటలో 3కోట్లతో వైశ్య భవన్‌ను అన్ని హాంగులతో నిర్మించుకుందామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావుఅన్నారు. శుక్రవారం వైశ్య భవన్ నిర్మాణ పనులను పరిశీలించిన ఆనంతరం మాట్లాడారు. పట్టణంలో 5కోట్ల రూపాయలతో పుట్‌ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. ట్రాఫీక్ సమస్య పరిష్కారంలో భాగంగా 2.25 కోట్లతో ఎలక్ట్రానిక్ సిగ్నలింగ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పట్టణంలో 9 జంక్షన్లు అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. పట్టణంలో 60 లక్షలతో మ్యూజికల్ ఫౌంటేన్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 50 కోట్లతో పట్టణం చుట్టు రింగ్ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. 25 ఏకరాల స్థలంలో మెడికల్ కళాశాల మంజూరు చేసుకున్నట్లు తెలిపారు.
కొత్తగా 500 మెడికల్ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందన్నారు. పట్టణంలో మరో వైకుంఠ రథాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సిద్దిపేట పట్టణాభివృద్ధికి ప్రజలు సహాకారం అందించాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే విద్యాసాగర్, కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి, ఇరిగేషన్ ఇఇ శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, వైస్ చైర్మన్ అత్తర్‌పటేల్ పాల్గొన్నారు.