మెదక్

వెంకన్న బ్రహ్మోత్సవాలు ఆరంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, జనవరి 29: బ్రహ్మోండనాయకుని బ్రహ్మోత్సవాలు ఆదివారం వైభోవోపేతంగా ప్రారంభమయ్యాయి. పట్టణ శివారు (వైకుంఠపురం)లో కొలువుదీరిన శ్రీ మహాలక్ష్మీ గోదాసమేత విరాట్ వేంకటేశ్వర స్వామి వారి చతుర్థ వార్షిక బ్రహోత్సవాలు అంగరంగ వైభవంగా మరో ఐదు రోజుల పాటు కొనసాగనున్నాయి. ఉత్సవాల ప్రారంభంలో భాగంగా ఆదివారం ఉదయం నుండే వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాలక్ష్మీ గోదాసమేత విరాట్ వేంకటేశ్వర స్వామి వార్ల ఉత్సవ మూర్తులకు పసుపు, గంధం, పాలు, పండ్ల రసాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలేత్తకుండా జై శ్రీమన్నారాయణ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులకు తీర్థప్రసాదాలతో పాటు అన్నదానం చేశారు.
పాల్గొని తరించండి: ప్రధాన అర్చకులు కందాడై
కోరుకున్న కోర్కేలు తీరుస్తూ భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న వెంకన్న బ్రహ్మోత్సవాల్లో హిందూ బంధువులందరూ పాల్గొని తరలించాలని ఆలయ ప్రధాన అర్చకులు కందాడై వరదాచార్యులు పేర్కొన్నారు. వైకుంఠపుర బ్రహోత్సవాల ప్రారంభంలో భాగంగా ఆదివారం నిర్వహించిన ప్రత్యేక పూజలు, మరో ఐదు రోజుల పాటు నిర్వహించనున్న కార్యక్రమాలను విలేఖరులకు వివరించారు. తెలంగాణ చిన్న తిరుపతిగా పేరొందిన శ్రీ మహాలక్ష్మీ గోదాసమేత విరాట్ వేంకటేశ్వర స్వామి వార్లను ప్రతిష్టించి నాలుగు సంవత్సరాలు పూర్తయిందన్నారు. భక్తుల సహాయ సహకారాలతో ఈ దివ్యక్షేత్రం దిన దినాభివృద్ధి చెందుతుందన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 30న ఉదయం యాగశాల శుద్ధి-ప్రవేశం, ద్వారతోరణ ధ్వకుంభారాధన, అగ్నిప్రతిష్ట, ధ్వజారోహణమ్, పూర్ణహుతి, సాయంత్రం దేవతాహ్వానమ్, శేషవాహన సేవ, 31న లక్ష్మీనారాయణ హోమం, సాయంత్రం ఎదుర్కోలు ఉత్సవం, పల్లకి సేవ కార్యక్రమాలుంటాయన్నారు. ప్రిబవరి 1న శ్రీ మహాలక్ష్మి-గోదా అమ్మవార్లతో శ్రీనివాస కళ్యాణం, గరుడ సేవ, 2న లక్ష్మీహయగ్రీవ హోమం, చంద్రప్రభవాహన సేవ, తెపోత్సవం, 3న హోమ పరిపూర్ణతకు మహాపూర్ణాహుతి హోమం, చక్రస్నానం, రథోత్సవం, శ్రీ పుష్పయాగ పూజ కార్యక్రమాలు ఉంటాయని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీనివాసుడి కృపకు పాత్రులు కావాలని కోరారు.

రుద్రనామం భజే

శ మంజీరా తీరాన వేదఘోష
శ రుద్రయాగంతో పరవశించిన పవిత్ర క్షేత్రం
శ యాగంలో పాల్గొన్న ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ సుభాష్‌రెడ్డి
శ పూజల్లో పాల్గొన్న సిపిడిసిఎల్ డైరెక్టర్ శ్రీనివాస్

మెదక్ రూరల్, జనవరి 29: సృష్టి లయకారుడు...బోళాశంకరుడు...పరమేశ్వరుడైన రుద్రుడి నామస్మరణ...శ్రీసరస్వతీమాతాయేనమ: అంటు భక్తులు మొక్కంగా...వేదమూర్తుల మంత్రాలతో మంజీరా (గరుఢగంగ) తీరం...తపోభూమి పరవశించింది. మహారుద్రయాగం జరుగుతున్న రెండవ రోజైన ఆదివారం అన్ని దారులు పేరూరువైపు సాగాయి..మేరుతంత్ర ప్రకారం సగ్రహముక శివ పంచాయతన యజన పురస్సకఅష్టోత్తర శతకుండాత్మక (108) పూర్వక పాశుపత మహారుద్రయాగం జరుగుతున్న విషయం తెల్సిందే. ఆలయ నిర్వాహకులు దోర్బల రాజవౌళీశర్మ ఆధ్వర్యంలో లోకకళ్యాణార్దం ఈ మహారుద్రయాగం నిర్వహిస్తుండగా 108 హోమగుండాలతోపాటు ప్రధాన హోమ గుండం వద్ద యజ్ఞం కొనసాగుతుంది. వరంగల్‌కు చెందిన కాళీ ఉపాసకులు కాళీప్రసాద్‌శర్మ ఆధ్వర్యంలో హైదరాబాద్, వరంగల్, మహారాష్ట్ర, కర్నాటకకు చెందిన సుమారు వంద మంది బ్రాహ్మణోత్తములు ఈ క్రతువులో పాల్గొంటున్నారు.
పెద్దయెత్తున భక్తుల రాక
మహారుద్ర యాగం జరుగుతున్న మంజీర తీరంలోని శ్రీ సరస్వతీ క్షేత్రానికి సుదూర ప్రాంతాల నుండి భక్తులు విచ్చేశారు. ఆదివారం సెలవు దినం కావడంతో రద్దీ మరింత పెరిగింది.
ఉద్యోగులు, వ్యాపారులు కుటుంబ సమేతంగా పెద్దయెత్తున తరలివచ్చారు. యాగంలో వందలాదిమంది పుణ్యదంపతులు కూర్చోగా, భక్తులు ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన షెడ్‌లో కూర్చుండి యాగాన్ని తిలకించారు. అమ్మవారి దర్శనం కోసం గంటల తరబడి వరుసలో భక్తులు నిల్చున్నారు. విచ్చేసిన భక్తులకు అన్నదానం నిర్వహించారు. రూరల్ సిఐ రామకృష్ణ, హవేళీఘణాపూర్ ఎస్‌ఐ శ్రీకాంత్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మహారుద్రయాగం జరుగుతున్న పేరూరు సరస్వతీ క్షేత్రం జాతరను మరిపించింది. సిపిడిసిఎల్ డైరెక్టర్ తోట శ్రీనివాస్ ఉదయం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. రాజవౌళీశర్మ ఆధ్వర్యంలో గుణాకరశర్మ, మహేశ్‌శర్మలు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ సుభాష్‌రెడ్డి పూజలు
రాష్ట్ర ఖనిజాభివృద్ది సంస్థ చైర్మన్, ముఖ్యమంత్రి కెసిఆర్ రాజకీయ కార్యదర్శి శేరి సుభాష్‌రెడ్డి దంపతులు మహారుద్రయాగంలో పాల్గొన్నారు. కుటుంబసమేతంగా రాగా ఆలయ మర్యాదలు, పూర్ణకుంభస్వాగతం పలికారు. అనంతరం యాగంలో పాల్గొని, సరస్వతీమాతకు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కనివినీ ఎరుగని రీతిలో మహారుద్రయాగం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. యాగ ఫలితం ఈ ప్రాంత ప్రజలకు దక్కాలని ఆకాంక్షించారు. ఈ ప్రాంతం ఎంతో పుణ్యం చేసుకుందన్నారు. ప్రభుత్వ పక్షాన పూర్తి సహకారం ఉంటుందన్నారు. డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి కూడా పాల్గొని వెళ్లడం, తాను పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక్కడ ఏర్పాట్లు బాగున్నాయని ప్రశంసించారు. ఆయన వెంట మాజీ సర్పంచ్‌లు బాలాగౌడ్, అయ్యవారి వెంకటేశ్వర్లు, మాజీ ఎంపిటిసి రమేశ్ తదితరులున్నారు.
భగవన్నామస్మరణతోనే జీవన్ముక్తి: వేలేటి సుధాకర శర్మ
ప్రతి ఒక్కరూ భగవన్నామస్మరణలో తరించాలని నిజామాబాద్ లలితాదేవి ఆశ్రమాలయ నిర్వాహకులు వేలేటి సుధాకరశర్మ భక్తులకు సూచించారు. రెండవ రోజు మహారుద్రయాగం అనంతరం భక్తులకు ధార్మిక సందేశాన్నిచ్చారు. ప్రతి ఒక్కరూ యాగం, పూజలు, వ్రతాలు చేయడం వల్ల అనేక మంచి ఫలితాలు కలుగుతాయన్నారు. స్వయంగా కాశీ నుండి ఇక్కడికి శివలింగం, నంది విగ్రహాలు వచ్చాయంటే శ్రీ సరస్వతీ క్షేత్రం ఎంతో అభివృద్ది చెందుతుందన్నారు. కారడవి మహాక్షేత్రంగా విరిజిల్లుతుందని సూచించారు. పరమాత్మునిలీల మనకు అర్థం కాదన్నారు. భగవంతునికి మనమిచ్చేది తృణప్రాయమన్నారు. మనలో భక్త్భివం ఒక్కటి ఉంటేచాలు అంతా భగవంతుడే చూసుకుంటాడని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఇక్కడ సరస్వతీమాత ఒంటరిగా ఉండేది ఇక ఆమె అన్న శివుడు త్వరలో కూర్చుండబోతున్నాడని తెలిపారు.

పేట కమిషనరేట్‌లో కలకలం
సిపి వేధించారంటూ సిఐ ఆవేదన ఖండించిన ఎసిపి

హుస్నాబాద్, జనవరి 29 : అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లి లీవుల అనంతరం డ్యూటీలో జాయిన్ కాకుండా వరంగల్ డిజిపి కార్యాలయానికి బదిలీ చేస్తూ వెంటనే వెళ్లాలని, ప్రభుత్వ వాహనం కూడా వాడరాదంటూ హుకుం జారీ చేస్త్తూ తనను సిద్దిపేట పోలీస్ కమిషనర్ శివకుమార్ మానసిక వేదింపులకు గురిచేస్తున్నాడని హుస్నాబాద్ సిఐ దాసరి భూమయ్య అవేదన వ్యక్తం చేశారు. అదివారం హుస్నాబాద్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో అయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కానిస్టేబుల్ జై తెలంగాణ తెలంగాణ అన్నందుకు అతనికి తాను మద్దతు ఇచ్చినందుకు అప్పుడు తనను సస్పెండ్ చేశారన్నారు. ఆనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కెసిఅర్ మంత్రి హరీష్‌రావు, కెప్టెన్ లక్ష్మీకాంతారావు ఆదేశాలతో మళ్లీ హుస్నాబాద్‌కు వచ్చానని అన్నారు. కరీంనగర్‌లో పోలీసు అమరుల భవన నిర్మాణంపై అర్‌టిఐ జివో ప్రకారం నిధుల ఖర్చులు అడిగినందుకు కక్షతో సిపి ఇలా వేదింపులకు గురి చేస్తున్నారని అరోపించారు. ఒకప్రభుత్వ ఉద్యోగిగా బదిలీ అయినప్పటికినీ ప్రభుత్వ వాహనం వాడరాదంటున్న సిపి గారు ప్రభుత్వ వాహనాన్ని తన భార్య అవసరాలకు ఒక ప్రభుత్వ ఉద్యోగి అయిన కానిస్టేబుల్ డ్రైవరుగా ఇప్పటికీ వాడుచున్నారని, దాన్ని ఏమంటారో చెప్పాలని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఎక్కడైనా తన బాధ్యతను ఎలాంటి అవరోధం కలుగకుండా పని చేస్తానని సి ఐ దాసరి భూమయ్య అన్నారు,
సిఐ ఆరోపణలు నిరాధారం: ఎసిపి నర్సింహారెడ్డి
సిద్దిపేట: సిద్దిపేట పోలీస్ కమిషనర్ శివకుమార్‌పై హుస్నాబాద్ సిఐ దాసరి భూమయ్య చేసిన ఆరోపణలు నిరాధారమైనవని సిద్దిపేట ఎసిపి నర్సింహారెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి తన కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ సిఐ భూమయ్య సిపి శివకుమార్ పై వ్యక్తిగత ఆరోపణలు చేయడం సముచితం కాదన్నారు. భూమయ్య వ్యక్తిగత కారణాల పై ఈనెల 10న సిక్ చేసి లీవులో వెళ్లాడన్నారు. ఆయన స్థానంలో రామగుండం నుంచి శ్రీనివాస్ అనే సిఐకి పోస్టింగ్ ఇచ్చారన్నారు. సిఐ భూమయ్యను వరంగల్ డిఐజికి అటాచ్ చేస్త్తూ బదిలీ చేశారన్నారు. సిఐ భూమయ్య నిబంధనల ప్రకారం ఈరోజు సిపిని కలిసి రిపోర్టు చేయాల్సి ఉందన్నారు. కానీ భూమయ్య నేరుగా హుస్నాబాద్‌లోని కార్యాలయానికి వెళ్లి చార్జి తీసుకొని సిపి కార్యాలయానికి ఫ్యాక్స్‌ద్వారా సమాచారం అందించారన్నారు. అనంతరం బదిలీ ఉత్తర్వులు తీసుకువెళ్లాల్సిఉందన్నారు. కానీ బదిలీ ఉత్తర్వులు తీసుకున్న అనంతరం మీడియా ముందు ఆ అధికారి పై నిరాధార ఆరోపణలు చేయడం సమంజసం కాదన్నారు. పోలీసు శాఖలో పైఅధికారి పై వ్యక్తిగత ఆరోపణలు చేయడం క్రమశిక్షణను ఉల్లంఘించడమేనన్నారు. సమస్యలుంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలని, రచ్చకీడ్చడం సరికాదన్నారు.
పల్స్‌పోలియో విజయవంతం
సంగారెడ్డి టౌన్, జనవరి 29: పోలియో వ్యాధిని నిర్మూలించేందుకు ఆదివారం చేపట్టిన పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతమైంది. ఉదయం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జిల్లా కలెక్టర్ మాణిక్యరాజ్ కణ్ణన్‌లు చిన్నారులకు పోలియో చుక్కలు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలను తప్పక వేయించాలని సూచించారు. ఎవరైన మిగిలి పోయిన వారుంటే వారింటికే వచ్చి చుక్కల మందును వేయడం జరుగుతుందన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ బాలసదన్‌లోని చిన్నారులకు చుక్కల మందును వేశారు. చిన్నారులను జాగ్రత్తగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని సిబ్బందికి సూచించారు. పట్టణంలోని ఇందిరానగర్ హెల్త్‌సెంటర్‌లో జాయింట్ కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు చిన్నారులకు చుక్కల మందును వేశారు. మందు వేయించని పిల్లల కోసం ప్రతి ఇంటిని సందర్శించి చుక్కల మందును వేయాలని సూచించారు. మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ గాయత్రిదేవి, ఆసుపత్రి సూపరింటెండెంట్ మురహరి, వైద్యులు హిరణ్మయి, శశాంక్ తదితరులు పాల్గొన్నారు.

పోలియో రహిత సమాజం లక్ష్యం కావాలి

* కలెక్టర్ భారతి
మెదక్ రూరల్, జనవరి 29: పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని జిల్లా కలెక్టర్ భారతి హొళ్లికేరి సూచించారు. ఆదివారం ఐదేళ్లలోపు చిన్నారులకు పల్స్‌పోలియో చుక్కల కార్యక్రమాన్ని మండలంలోని మాచవరం గ్రామపంచాయతీ వద్ద ప్రారంభించారు.
తన కూతురు ఆద్యతోపాటు ఇతర చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డాక్టర్ అమర్‌సింగ్, జిల్లా అధికారి డాక్టర్ నవీన్, స్థానిక సర్పంచ్ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.
గ్రామాల్లో...
పల్స్ పోలియో కార్యక్రమాన్ని గ్రామాలు, తండాల్లో సైతం నిర్వహించారు. సర్పంచ్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఆయా గ్రామాల్లో ఆరోగ్య సిబ్బంది, అంగన్‌వాడి కార్యకర్తలు, సామాజిక కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంచార బృందాల ద్వారా కూడా పిల్లలకు చుక్కలు వేశారు.
నేటినుంచి శ్రీ విద్యాధరి క్షేత్ర రజతోత్సవాలు

* శత చండీ యాగం ఏర్పాట్లు పూర్తి
* ఫిబ్రవరి 1న శ్రీ పంచమి మహోత్సవం
గజ్వేల్, జనవరి 29: వర్గల్ శ్రీ విద్యాధరి క్షేత్రం రజతోత్సవ సంబురాలకు ముస్తాబైంది. క్షేత్ర మహత్యం నలుదిశలా వ్యాపించడంతో పాటు 25 యేండ్లు పూర్తవుతున్న సందర్బంగా పెద్ద ఎత్తున వేడుకల నిర్వాహనకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ముఖ్యంగా ఈ నెల 30న క్షేత్రంలో శత చండీయాగం ఆరంభం కానుండగా, ఫిబ్రవరి 1న జరిగే వసంత, శ్రీ పంచమి వేడుకలకు ఆలయ వ్యవస్థాపక చైర్మెన్ యాయవరం చంద్రశేఖరశర్మ సిద్దాంతి నేతృత్వంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు.
సోమవారం మహా క్రతువు రుద్రస్వాహకార పూర్వక పంచ కుండాత్మక శత చండీయాగం 3 రోజులపాటు వైభవంగా జరుగనుంది. ఇందులో భాగంగానే క్షేత్రాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దడంతోపాటు విద్యుత్ దీపాల అలంకరణతో ఆలయ అందాలు ద్విగుణీకృతమవుతున్నాయి. అలాగే భక్తుల సౌకర్యాల కల్పనలో ఆలయ కమిటీ ముందుండి శ్రమిస్తోంది.
సంబురాలకు ఏర్పాట్లు పూర్తి
రజతోత్సవ సంబురాలకు శ్రీ విద్యాధరి క్షేత్రాన్ని సిద్దం చేసినట్లు ఆలయ వ్యవస్థాపకులు యాయవరం చంద్రశేఖర శర్మ సిద్దాంతి పేర్కొన్నారు. ఈ నెల 30, 31వ తేదీలలో గణపతిపూజ, యాగశాల ప్రవేశం, మండప దేవతాహవనము, అగ్నిప్రతిష్ట, మూలమంత్ర జపము, చండీ అవాహిత దేవత హవనము, రాజోపచార పూజలు, సుహాసినీ పూజ, ప్రత్యేక పూజలు తదితర కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ఫిబ్రవరి 1న వసంత పంచమి, శ్రీ పంచమి మహోత్సవం జరుగనుండగా, తెల్లవారుజామున అమ్మవారికి విశేష పంచామృతాభిషేకం, ఉదయం లక్ష పుష్పార్చన, 56 నైవెద్యాలతో నివేదన, శ్రీ విద్యాజ్యోతి దర్శనం, యాగశాలలో గణపతిపూజ, మూల మంత్ర స్థాపిత దేవతా పూజ, చండీహవనము, పూర్ణాహుతి, బలిప్రదానము, అగ్ని ప్రదక్షన, కలశాభిషేకము, రుత్విక్ సన్మానము, వేద విద్యార్థులకు జయపట్టాల ప్రదానము జరుగుతాయన్నారు.

ప్రభుత్వ పనితీరుతోనే పార్టీలో చేరికలు

* ఎమ్మెల్యే గూడెం మహీపాల్ రెడ్డి
* టిఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్న పలువురు
పటన్‌చెరు, జనవరి 29: తెలంగాణ ప్రభుత్వ పనితీరుతోనే పార్టీలో చేరడానికి పలువురు ఆసక్తి కనబరుచుతున్నారని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పార్టీ విధానాల పట్ల ఆకర్షితులవుతున్న యువకులు టిఆర్‌ఎస్‌లో చేరి బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు అవుతున్నారని ఆయన స్పష్టం చేసారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన అమీన్‌పూర్ గ్రామ పంచాయతీ సభ్యులు, మరికొంత మంది నాయకులను ఆదివారం తన నివాసంలో కండువా కప్పి టిఆర్‌ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించడంలో ముఖ్యమంత్రి కెసిఆర్ కనబరిచిన పోరాట పటిమను మెచ్చిన ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టిఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోవడానికి తరలి వస్తున్నారని ఈ సంధర్బముగా ఎమ్మెల్యే అన్నారు. కెసిఆర్ సారద్యంలోనే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి పధంలో పరుగులు పెడుతుందని నమ్మిన వారు స్వచ్ఛందంగా పార్టీలోకి వస్తున్నారని స్పష్టంచేసారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎంపిటిసిలు శ్రీనివాస్‌రెడ్డి, కొల్లూరి మల్లేష్, మాజీ ఎంపిటిసిలు తుమ్మల పాండురంగారెడ్డి, వడ్ల కాలప్ప, నందారం నర్సింహాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.