మెదక్

కేంద్ర పథకాల పేర్లుమార్చి అమలుచేయటం సిగ్గుచేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, జనవరి 31 : కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వ పేర్లు మార్చి తామే అమలు చేస్తున్నట్లు ప్రచారం చేసుకుంటే బిజెపి నేతలు చూస్తు ఊరుకోరని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి అన్నారు. స్వచ్ఛ భారత్‌లో ప్రతి ఇంటికి నిర్మించే శౌచాలాయానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయిస్తే వాటికి గులాబీ రంగు వేసి ప్రచారం చేసుకోవటం సిగ్గుచేటని విమర్శించారు. మంగళవారం స్థానిక శివానుభావ మండలంలో జరిగిన బిజెపి కార్యకర్తల ముగింపు శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. శౌచలయాలకు సైత గులాభి రంగు వేసుకునే స్థాయికి టిఆర్‌ఎస్ ప్రభుత్వం దిగజారిందని విమర్శించారు. టిఆర్‌ఎస్ ఫ్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తుందని దుయ్యపట్టారు. కేంద్ర ప్రభుత్వం నిరుపేదల ఇళ్ల నిర్మాణం కోసం రాష్ట్రానికి 90 వేల ఇళ్ల్లు కేటాయించిదన్నారు. ఒక్కో ఇంటికి గ్రామాల్లో 1.65 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో 2.35 లక్షలు కేటాయిస్తుందన్నారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులను తీసుకొని మరికొన్ని నిధులను కలిపి పూర్తిగా డబుల్ బెడ్ రూం ఇళ్లునిర్మించుకున్నట్లు తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఎక్కటికక్కడ ఎండగడుతామన్నారు. కేంద్ర పథకాలను పేర్లు మార్చి టిఆర్‌ఎస్ సర్కార్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తుందని విమర్శించారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజలకు పూర్తిగా వివరిస్తామన్నారు. కేంద్ర నిధులతోనిర్మించే సంక్షేమ పథకాలను టిఆర్‌ఎస్ సర్కార్ గులాభి రంగు వేయాటాన్ని నిలిపివేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్ కోసం 10,400 కోట్లు కేటాయిస్తే రాష్ట్ర ప్రభుత్వం కేవలం 4.254 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. మతపరమైన రిజర్వేషన్లకు బిజెపి వ్యతిరేకమన్నారు. ముస్లీంలకు, క్రైస్తవులకు బిజెపి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. అగ్రవర్ణాల్లో వెనుకబడిన వారికి సైతం బిజెపి వ్యతిరేకం కాదన్నారు. ముస్లీంలకు 12 శాతం మతపరమైన రిజర్వేషన్ల పేరిట కెసిఆర్ సర్కార్ కుట్ర చేస్తున్నారన్నారు. గతంలో మతపరమైన రిజర్వేషన్లుతో దేశాన్ని విచ్చిన్నం చేశారన్నారు. ముస్లీంలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు చట్టపరంగా సిఎం కెసిఆర్ కృషిచేస్తున్నాడన్నారు. రాజకీయాల్లో మతపరమైన రిజర్వేషన్లు, వేర్పాటు వాదాన్ని బిజెపి వ్యతిరేకిస్తుందన్నారు. హింధువులను కులాలు, వర్గాలుగా టిఆర్‌ఎస్ సర్కార్ విభజిస్తుందన్నారు. వ్యక్తులకు, కులాలకు బిజెపి వ్యతిరేకం కాదని, దేశ మంత సమిష్టిగా ఉండటమే బిజెపి ధ్యేయమన్నారు. కేంద్ర ఫ్రభుత్వ సంక్షేమ పథకాలను సామాన్యుల దరికి చేర్చేందుకు బిజెపి కార్యకర్తలు కృషిచేయాలన్నారు. రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వస్తేనే సామాన్యులకు అన్ని సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. ఇందుకోసం పార్టీ అభివృద్ధి కోసం కార్యకర్తలు కలసికట్టుగా కృషిచేయాలన్నారు. బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి రఘనందన్‌రావు మాట్లాడుతూ దళితుల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కేటాయించిన భూములను టిఆర్‌ఎస్ సర్కార్ లాక్కోవాలని కుట్ర పన్నుతుందన్నారు. 2003 దుద్దెడ వద్ద లెదర్ పార్క్ కోసం 30 ఎకరాల భూమిని కేటాయించిదన్నారు. రాష్ట్ర ఫ్రభుత్వం కలెక్టరేట్, మెడికల్ కళాశాల పేరిట భూములు లాక్కోవాలని చూడటం సరికాదన్నారు. దళితుల అభివృద్ధికి భూములు ఇవ్వాల్సింది పోయి, ఇచ్చిన భూములను గుంజుకోవాలనుకోవటం సరికాదన్నారు. సిద్దిపేట బిజెపి అభివృద్ధి కోసం సమావేశంలో ప్రవేశపెట్టిన తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈకార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నాయిని నరోత్తంరెడ్డి, రాష్ట్ర నేతలు వంగ రాంచంద్రారెడ్డి,రాంరెడ్డి, ఆకుల రాజయ్య, నరేందర్‌రెడ్డి, జిల్లా నేతలు మోహన్‌రెడ్డి, బాలేశ్, శశిదర్‌రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు శ్రీకాంత్‌రెడ్డి, బాసంగారి వెంకట్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.