మెదక్

కలలబండి ఇక కళ్లెదుటే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, ఫిబ్రవరి 25: సిద్దిపేట- మనోహరాబాద్ రైలుమార్గానికి కేంద్ర ప్రభుత్వం రూ.350 కోట్లు కేటాయించటంతో సిద్దిపేటలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సిద్దిపేట ప్రజల చిరకాల వాంఛ అయన రైలుకూత త్వరలో ఖాయమన్న భరోసాను కేంద్ర ప్రభుత్వం కల్పించింది. సిద్దిపేట జిల్లా కేంద్రం వర్తక, వాణిజ్య కేంద్రంగా ప్రసిద్ధిగాంచింది. సిద్దిపేట నుంచి నిత్యం వందలాది వ్యాపారులు తమ పనుల నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్లి వస్తుంటారు. సిద్దిపేటకు రైల్వేలైన్ మంజూరు చేయాలని అప్పటి ఎమ్మెల్యే, ప్రస్తుత సిఎం కెసిఆర్ కలలుగనే వారు. సిద్దిపేటకు రైల్వేలైన్ మంజూరైతే ఈప్రాంత మరింతం అభివృద్ధి చెందే అవకాశాలున్నాయని పలు సందర్భాల్లో సిఎం కెసిఆర్ పేర్కొనేవారు. 2005లో యుపిఏ హయాంలో అప్పటి కేంద్ర కార్మిక శాఖ మంత్రి, ప్రస్తుత సిఎం కెసిఆర్ సికింద్రాబాద్- సిద్దిపేట- కరీంనగర్‌కు 149కి.మీ 308 కోట్లు అవసరమవుతాయని ప్రాథమిక అంచనావేశారు. సామాజికంగా, అర్థికంగా, వెనుకబడిన ప్రాంతం అభివృద్ధి కోసం కేంద్ర రైల్వే శాఖ ఈ ప్రతిపాదన ఆమోదించింది. మొదటి విడతగా రైల్వేలైన్ సర్వే కోసం రూ.40 కోట్ల నిధులను సైతం కేటాయించారు. రైల్వే లైన్ సర్వేకు అనుకూలంగా నిధులు కేటాయించటంలో నిర్లక్ష్యం వహించటంలో ఈ రైలు కూత సిద్దిపేటకు కలగానే మిగిలిపోయింది. అప్పటి నుంచి ఎప్పుడు రెల్వే బడ్జెట్ వచ్చినా సిద్దిపేట ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూసేవారు. అయతే ఎప్పుడూ అరకొర నిధులు మాత్రమే మంజూరవుతుండటంతో ఇప్పటి వరకు నిరాశే మిగిలింది. ఉమ్మడి రాష్ట్రంలో మనోహరాబాద్- సిద్దిపేట -కొత్తపల్లి రైల్వే లైన్‌కు రైల్వే బోర్డు ప్రతిపాదించిన అన్ని నిబంధనలనూ అనుమతించకపోవటంతో రైల్వేలైన్ ఏర్పాటులో తీవ్ర జాప్యం జరుగుతూ వచ్చింది. 2014లో టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైల్వేశాఖ పెట్టిన షరతులను అంగీకరిస్తూ సిఎం కెసిఆర్ రైల్వే బోర్డుకు లేఖ రాసారు. దీంతో మనోహరబాద్- కొత్తపల్లి రైల్వే లైన్‌కు బోర్డు అమోదం ప్రకటించింది. కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేష్‌ప్రభు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో మనోహరాబాద్- కొత్తపల్లి రైలుమార్గానికి పెద్దఎత్తున నిధులు మంజూరవుతాయని గత ఏడాది ఎదురు చూసారు. అయతే కేవలం రూ.30 కోట్లు మాత్రమే కేటాయించారు. మనోహరాబాద్- నాచారం, కొమురవెళ్లి- సిద్దిపేట- వేములవాడ పుణ్యక్షేత్రాలను కలుపుతూ కొత్తపల్లి వరకు సర్వే నిర్వహించారు. ఈ మార్గానికి యూపిఏ ప్రభుత్వం అరకొర నిధులు మంజూరు చేసినా పూర్తిస్థాయిలో విడుదల చేయకపోవడంతో ఈ మార్గం ప్రారంభానికి నోచుకోలేదు. మంజూరు చేసిన నిధులు సైతం ఇతర మార్గాలకు మళ్లించారు. దీంతో ఈ రైల్వేలైన్‌కు నిధులు కేటాయించాలని అప్పుడు టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు రాజీవ్ రహదారిపై ఆందోళన చేపట్టారు. దీంతో మనోహరాబాద్- కొత్తపల్లి-సిద్దిపేట రైల్వేలైన్ కోసం రైల్వేలైన్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా భూసేకరణ చేయాలని, ప్రాజెక్టు వ్యయంలో 1/3వ వంతు 3వ వంతు రాష్ట్ర ప్రభుత్వం భరించాలని, నష్టాలు వచ్చినా మొదటి 5ఏళ్ల్లు భరించాలని రైల్వేబోర్డు షరతులు విధించింది. అప్పటి సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి భూ సేకరణకు, 1/3 వంతు వాటా భరించేందుకు అంగీకరించినా, 5ఏళ్లు నష్టం భరించేందుకు సుముఖం వ్యక్తం చేయలేదు. దీంతో రైల్వేలైన్ పెండింగ్‌లో ఉండిపోయింది. టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తెలంగాణలోని రైల్వే మార్గాలకు నిధులు కేటాయించడంలో అన్యాయం జరిగిందని రైల్వేబోర్డు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ క్రమంలో సిఎం కెసిఆర్ మనోహరాబాద్- సిద్దిపేట - కొత్తపల్లి మార్గానికి భూసేకరణ, 1/3 వంతు నిధులు మంజూరు, 5ఏళ్ల నష్టం భరిస్తామని లేఖ రాశారు. దీంతో ఈ రైల్వేమార్గంపై కదలిక ప్రారంభమైంది. ఈ మార్గ నిర్మాణానికి రూ.925కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశారు. ప్రస్తుతం రూ.1100 కోట్లకు చేరుకుంది. భూసేకరణకు సైతం అదనంగా వంద కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. రైల్వేబోర్డు విధించిన షరతులకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిన నేపథ్యంలో రైల్వేలైన్ నిర్మాణానికి అనుమతినిస్త్తూ రైల్వైబోర్డు కార్యనిర్వాహక సంచాలకుడు అంజూం పర్వేజ్ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశారు. రైల్వేలైన్‌కు బోర్డు ఆమోదం లభించింది. సిద్దిపేట డివిజన్‌లోని రైలుమార్గం వెళ్లే ప్రాంతాల్లో భూసేకరణ సర్వే చేపట్టారు. మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి వరకు మొత్తం 1204 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. సిద్దిపేట జిల్లా పరిధిలో 88 కి.మీ భూమి సేకరించాల్సి ఉండగా ఇప్పటికే 28 కి.మీ దూరం భూసేకరణ చేపట్టారు. అలాగే కొండపాక మండలంలో 30 కి.మీ, మిట్టపల్లిలో 20కి.మీ వరకు మార్కింగ్ చేశారు. మరో 16 కి.మీ దూరం మార్కింగ్ ఇవ్వాల్సి ఉంది. మనోహరాబాద్- సిద్దిపేట రైల్వేలైన్ మంజూరైనప్పటి నుంచి ప్రస్తుతం విడుదల చేసిన రూ.350 కోట్లు అధికం కావటంతో రైల్వే పనులు వేగవంతమయ్యే అవకాశాలున్నాయి.