మెదక్

పాపం పండుటాకులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగదేవ్‌పూర్,్ఫబ్రవరి 7: వృద్దాప్యంలో ఇద్దరిని చుట్టుముట్టిన ఆనారోగ్యం.. కన్నకొడుకులు దూరంగా కాపురం.. తమ బాగోగులు చూసే వారు దూరం కావటంతో బతుకు బారమై వృద్ధ దంపతులు బలవన్మరణాల పాలైన హృదయవిదారక సంఘటన సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండల పరిధిలోని దౌలాపూర్‌లో మంగళవారం వెలుగులోకి వచ్చింది. భర్త ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడగా, భార్య సమీపంలోని బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈసంఘటనకు సంబంధించి గ్రామస్థులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన మంత్రి సాయిలు (65) అతని భార్య మంత్రి సరోజన (60)లు గ్రామంలోనే కూలి పనులు చేస్త్తూ జీవనం సాగిస్తున్నారు. వారికి ఇద్దరు కుమారులు. ఒకరు హైద్రబాద్‌లో, మరోకరు జగదేవ్‌పూర్‌లో ఉంటున్నారు. అయితే గత కొంతకాలం నుంచి ఇధ్దరూ ఆనారోగ్యానికి గురైనారు. దీంతో పాటు ఆర్థిక ఇబ్బందులు అధికం కావటంతో వైద్యం కోసం చేతిలో చిల్లిగవ్వ లేక పోవటంతో పాటు ఆరోగ్యం సహకరించకపోవటంతో మానసిక వేదనకు గురయ్యారు. కడదాక కలిసి జీవించిన వారు కలిసే చనిపోవాలనుకున్నట్లుగా నిర్ణయించుకున్నట్లు వారి మృతి చెందిన తీరు కన్పిస్త్తోంది. సోమవారం మధ్యాహ్నం ముందుగా సాయిలు ఇంట్లో ఉరివేసుకోగా, అతని మృతిని జీర్ణించుకోని సరోజన గ్రామ సమీపంలోని మంచి నీళ్ల బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. కాగా సోమవారం సాయత్రం వారి పెద్ద కుమారుడు గ్రామానికి వచ్చి ఇంట్లో చూసే సరికి తలుపులు పెట్టి ఉండగా, ఇంట్లోకి వెళ్ల్లి చూసే సరికి వంటింట్లో తన తండ్రి ఉరికి శవమై వేలాడుతూ కనిపించాడు. తల్లి ఇంట్లో లేక పోవటంతో ఆమె ఆచూకీ కోసం రాత్రంతా గ్రామంలో వెతికారు. ఐనా ఎక్కడా ఆమె జాడ తెలియకపోవటంతో మంగళవారం సమీపంలోని బావిలో చూడగా శవమై కన్పించింది. ఈ సంఘటనపై మృతుని కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించగా ఎస్సై వీరన్న సంఘటన స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదుచేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. గ్రామంలో విషాదం ఆలుముకుంది.