మెదక్

ఆరోగ్యవంతమైన యువతతోనే బంగారు తెలంగాణ సాద్ధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్, ఫిబ్రవరి 10: ప్రతి ఒక్కరు పారిశుద్యంపై వ్యక్తిగత అవగాహన పెంపొందించుకొని ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని జిల్లా కలెక్టర్ భారతి హొళ్లికేరి పిలుపునిచ్చారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురష్కరించుకొని శుక్రవారం పట్టణంలోని తెలంగాణ రాష్ట్ర బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలోని విద్యార్థులకు కలెక్టర్ భారతి హొళ్లికేరి నులిపురుగుల నివారణకై అల్‌బెండజోల్ మాత్రలను పంపిణీ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉన్న పిల్లలే చదువులో రాణించగలరన్నారు. ఆర్దికంగా, సామాజికంగా, విద్యాపరంగా ఎదుగుదలకు ఆరోగ్యమే ప్రధానమని కలెక్టర్ తెలిపారు. భోజన సమయంలో చేతులు కడుక్కోవడం వలన అపరిశుభ్రత వ్యాపించడం ద్వారా 40 శాతం రోగాలు వస్తున్నాయన్నారు. ముఖ్యంగా విద్యార్థులు భోజన సమయంలో పరిశుభ్రత విస్మరించరాదని కలెక్టర్ తెలిపారు. దేశ వ్యాప్తంగా ఎన్నో సంవత్సరాలుగా కార్యక్రమాలు, ప్రభుత్వపరంగా చేపడుతున్నప్పటికీ అవగాహణ రాహిత్యంతో పారిశుద్యానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యమ స్పూర్తితో ప్రతి ఒక్కరు వ్యక్తిగత అవగాహణను పెంపొందించుకొని వ్యాధులకు దూరంగా ఉండాలని కలెక్టర్ విద్యార్థులకు సూచించారు. కొత్త రాష్ట్రం, కొత్త జిల్లాలో ఆరోగ్యవంతమైన యువత ద్వారానే బంగారు తెలంగాణ సాధ్యమని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. ప్రతి ఇంట్లో సెల్‌ఫొన్, టివి సౌకర్యం అందుబాటులో ఉంచుకొని మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రాధాన్యతనివ్వకపోవడం పట్ల ఆమె విచారం వ్యక్తం చేశారు. ఇందుకుగాను జిల్లా వ్యాప్తంగా వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించి బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా చేపట్టాలని సంకల్పించినట్లు కలెక్టర్ తెలిపారు. 12 వేల ప్రోత్సహాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరు పారిశుద్యానికి ప్రాధాన్యత ఇచ్చి మరుగుదొడ్లు నిర్మించుకోవాలన్నారు. అభివృద్ధిలో అందరు భాగస్వాములు కావాలని ప్రజలకు కలెక్టర్ సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి అమర్‌సింగ్‌నాయక్ మాట్లాడుతూ ఒక్క రోజే మెదక్ జిల్లాలో రెండు లక్షల 14 వేల మంది పిల్లలకు నులిపురుగుల నివారణకై అల్‌బెండోజైల్ మాత్రలు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ స్టీఫెన్ పాల్, అధ్యాపకులు, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు
భూసేకరణ సత్వర పూర్తి

మెదక్, ఫిబ్రవరి 10: కాళేశ్వరం ప్రాజెక్ట్ భూసేకరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భారతి హొళ్లికేరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ డివిజన్ అధికారులు, ప్రాజెక్ట్ ఇంజనీర్ అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 17,18,19న ప్రాజెక్ట్ ఫ్యాకేజి పనులకు సంబంధించి భూసేకరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జెసి సురేష్‌బాబు, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇఇ కనకేశ్, మెదక్, నర్సాపూర్, తూప్రాన్ ఆర్డీఓలు నగేష్, వెంకటేశ్వర్లు, మధు, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఎడి గంగయ్య తదితరులు పాల్గొన్నారు.

సిద్దిపేట అభివృద్ధి భేష్

* బోధన్ మున్సిపల్ కౌన్సిల్ బృందం
సిద్దిపేట అర్బన్, ఫిబ్రవరి 10: సిద్దిపేట రాష్ట్రానికే ఆదర్శంగా అన్ని రంగాల్లో దూసుకపోతుందని, ఉద్యమ పురిటిగడ్డ సిద్దిపేటను ఆదర్శంగా తీసుకొని బోధన్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధికి కృషి చేస్తామని బోధన్ మున్సిపల్ పాలకవర్గం, అధికారులు పర్యటించారు. సిద్దిపేటలో అమలు చేస్తున్న కార్యక్రమాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పట్టణంలోని కోమటిచెరువు మినీట్యాంక్‌బండ్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌యార్డు, రైతుబజార్, ట్రాఫిక్ నియంత్రణ పై పరిశీలించారు. అభివృద్ధి చేసిన తీరుపట్ల హర్షం వ్యక్తం చేశారు. అనంతరం స్మృతివనాన్ని పరిశీలిస్తే పార్కును సందర్శించిన అనుభూతి కలుగుతుందని, ప్రశాంత వాతావరణం, పచ్చనిచెట్లు, ఆహ్లాదకరంగా ఉందన్నారు. అనంతరం డంప్‌యార్డును పరిశీలించి సేంద్రీయ ఎరువును పరిశీలించారు. చైర్మన్ ఎల్లం మాట్లాడుతూ సిద్దిపేటలో జరిగిన అభివృద్ధిని ఆదర్శంగా తీసుకొని బోధన్‌లో కూడా అమలు చేసి ఆదర్శంగా నిలిచేలా కృషి చేస్తామన్నారు. కమిషనర్ రమణాచారి, బోధన్ కమిషనర్ స్వామినాయక్, పాలకవర్గం పాల్గొన్నారు.