మెదక్

మార్మోగిన శ్రీ చండీ నామం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్, ఫిబ్రవరి 14: మెదక్ శ్రీ సత్యసాయి భజన మందిరం ప్రాంగణంలో జరుగుతున్న శ్రీ సహస్ర చండీ యాగంలో భాగంగా మంగళవారం శ్రీ దత్త జపం జరిగింది. వంద కోట్ల శ్రీ దత్తజపంలో భాగంగా సహస్ర చండీయాగంలో రెండు గంటల పాటు శ్రీ దత్తజపంను నిర్వహించారు. తిరుమలలో వంద కోట్ల శ్రీ వైష్ణవేనమః జపాన్ని శ్రీ మాధవానంద సరస్వతి స్వామిజీ ఆధ్వర్యంలో నిర్వహించారని వేద పండితులు తెలిపారు. మరో వంద కోట్ల శివజపం స్వామిజీ ఆధ్వర్యంలో జరిగింది. ఇవన్నీ పూర్తి చేసుకున్న తరువాత కాశీలో ఈ జపములన్నీ సమర్పణ జరుగుతుందని వేద పండితులు తెలిపారు. దత్తజపంలో మాజీ మంత్రి, డిసిసి అధ్యక్షురాలు సునితాలక్ష్మారెడ్డి పాల్గొన్నారు. చండీ యాగం 3వ రోజు కూడా శాస్త్రోక్తంగా మాధవానంద సరస్వతి స్వామిజీ పర్యవేణలో కొనసాగింది. ఉదయం 160 మంది ఋత్వికులు ఆవాహిత దేవాతాపూజ, చండీ పారాయణం, హవనము, మహా లింగార్చన, పార్దివ లింగార్చన, ప్రదోషపూజ, మంగళ హారతి, రాజోపరాచపూజలు నిర్వహించి, తీర్దప్రసాద వితరణ గావించారు. యాగంలో పీఠాధిపతులు మధుసూధనానంద సరస్వతి స్వామి, మెదక్ మున్సిపల్ చైర్మన్ మల్లిఖార్జున్‌గౌడ్ గాయత్రి పంతులు పాల్గొన్నారు. మాజీ మంత్రి సునితాలక్ష్మారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు తొడుపునూరి చంద్రపాల్, కౌన్సిలర్ మధుసూదన్‌రావు, సురేందర్‌గౌడ్, కొల్చారం మాజీ జడ్పిటిసి శ్రీనివాస్‌రెడ్డి, మామిళ్ల ఆంజనేయులు, గూడూరి ఆంజనేయులుగౌడ్, తొడుపునూరి రాము, కొండ శ్రీనివాస్‌గుప్త, వర్గల్ సిద్దాంత చంద్రశేఖర్‌శర్మ, చెప్యాల హరినాథ్‌శర్మ, మెదక్ బ్రాహ్మణ సంఘ నేతలు శ్రీవాండ్ల చంద్రశేఖర్, ప్రభాకర్, కృష్ణాగౌడ్, రామేశ్వరప్రసాద్, నర్సింగరావు, డి.ప్రసాద్, ఉపేందర్, లక్ష్మణ్‌రావు, శ్రీవాండ్ల సంతోష్, సనందన్ దత్తాత్రేయ కులకర్ణి, భాష్యం మధుసూదనాచార్యులు, శ్రీవాండ్ల కృష్ణమూర్తి, వైద్య శ్రీనివాస్‌శర్మ, శ్రీవాండ్ల సాయిబాబా, సోమశేఖర్‌శర్మ, దేశాయిపేట రాజయ్యపంతులు, బూర్గుపల్లి ప్రసాద్, వైద్య శ్రీనివాస్‌శర్మ, సత్యసాయి సేవా సంస్థ పతాదికారులు, సేవాదళ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు మాజీ మంత్రి సునితారెడ్డి మాధవానంద సరస్వతి స్వామిజీని దర్శించుకొని ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా సునితారెడ్డి మాట్లాడుతూ నూతన మెదక్ జిల్లాలో మెదక్ పట్టణ బ్రాహ్మణులు స్వయంగా చండీయాగం నిర్వహించడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. స్వామివారి ఆశీర్వాదంతో గణపతి చండీయాగం ద్వారా జిల్లా అభివృద్ది చెందడమే కాకుండా ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవిస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం స్థానిక బ్రాహ్మణులు ఏర్పాటు చేసిన భోజన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. మధ్యాహ్న సమయంలో స్వామివారిని దర్శించుకోడానికి మహిళలు బారులుతీరారు. ఇతరులను ఆశించకుండా స్థానిక బ్రాహ్మణులు మహాచండీ యాగమును రూ.30 లక్షల వ్యయంతో ఈ యాగం చేపట్టినట్లు శ్రీవాండ్ల కృష్ణమూర్తి వెల్లడించారు.

చెరువుల నిర్వహణ అపూర్వం
కాకతీయుల చెరువులకు జలకళ తెచ్చిన కెసిఆర్
మిషన్ కాకతీయ దేశానికి స్ఫూర్తిదాయకం మహారాష్ట్ర ఇంజనీర్ల కితాబు

సంగారెడ్డి, ఫిబ్రవరి 14: కాకతీయ రెడ్డిరాజుల వారసత్వ సంపదగా నిర్మించిన చెరువులు, కుంటలు, ఇతర జలాశయాలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ వనె్నలద్దారని, రాష్ట్రంలో ఎక్కడ చూసినా జలకళ సంతరించుకోవడం వ్యవసాయ రంగానికి శుభ పరిణామమని మహారాష్ట్ర సాగునీటి పారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ ఎస్‌డి.గిరి కితాబిచ్చారు. మంగళవారం సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట మండలం గంగకత్వ కెనాల్, సంగారెడ్డి మండలంలోని మదిర చిమ్నాపూర్ చెరువు, అందోల్ మండలంలోని అన్నాసాగర్ చెరువు, పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన చెరువులను మహారాష్ట్ర ఇంజనీర్ల బృందం పరిశీలించింది. మిషన్ కాకతీయ కార్యక్రమం ద్వారా మరమ్మతు, అభివృద్ధి పనులను ఏ విధంగా నిర్వహించారో ఎస్‌ఈ పద్మారావు, ఈఈ రాములుగౌడ్‌లను అడిగి తెలుసుకున్నారు. రెండేళ్లుగా వర్షాబావ పరిస్థితులు నెలకొని అన్ని చెరువులూ ఎండిపోవడంతో మరమ్మతులు చేపట్టడం సులభతరమైందని అధికారులు వివరించారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర చీఫ్ ఇంజనీర్ గిరి మాట్లాడుతూ శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అంతగా అభివృద్ధి లేని కాలంలోనే చక్కటి ప్రణాళికలతో కాకతీయ రాజులు గొలుసు కట్టు చెరువులను తవ్వించడం అబ్బుర పరుస్తుందన్నారు. ఒక చెరువు నిండిన అనంతరం మరో చెరువులోకి వరద నీరు వెళ్లేలా కాలువలను తవ్వించడం బాగుందన్నారు. ఉప్పొంగి ప్రవహించే వాగునీటిని సైతం నిలిపేందుకు నైజాం రాజుల కాలంలో సదాశివపేట మండలం గంగకత్వ నిర్మాణ శైలీ తమను ఆకట్టుకుందని వారు సంతృప్తిని వ్యక్తం చేసారు. గంగకత్వ కెనాల్ ద్వారా సుమారు 15 నుంచి 20 చెరువులకు నీటిని అందించడమనే ఆలోచనతీరు అద్వితీయమన్నారు. చెరువులు, కుంటల మరమ్మతుల ద్వారా తెలంగాణ వ్యవసాయ రంగానికి ఉజ్వల భవిషత్తు లభించడం ఖాయమన్నారు. మిషన్ కాకతీయ కార్యక్రమం యావత్ దేశానికే స్ఫూరిదాయకంగా నిలుస్తుందన్నారు. ఇలాంటి కార్యక్రమాన్ని తమ రాష్ట్రంలో కూడా చేపట్టేలా అన్ని రకాల నివేదికలను ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. ఛాయా చిత్రాల ద్వారా తమ రాష్ట్రంలోని సాగునీటి పారుదల శాఖ అధికారులకు అవగాహన కల్పిస్తామన్నారు. నిధుల కేటాయింపులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవ అసాధారణమైందన్నారు. రానున్నది వేసవి కాలమే అయినా ఆయా గ్రామాల్లోని పంట పొలాలన్నీ పచ్చగా కనిపిస్తుండటం వెనక ప్రభుత్వ పనితీరుకు దర్పణం పడుతుందని అభినందించారు. మూడవ విడత మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని ఏ విధంగా నిర్వహించబోతున్నారో ఎస్‌ఈ పద్మారావు, ఈఈ రాములుగౌడ్ మహారాష్ట్ర ఇంజనీర్ల బృందానికి వివరించి మన్ననలు పొందారు. తెలంగాణ రాష్ట్రంలోనే మిషన్ కాకతీయ కార్యక్రమం సంగారెడ్డి జిల్లాలో సఫలీకృతం కావడంతో మహారాష్ట్ర అధికారుల బృందాన్ని ఈ ప్రాంతంలో పర్యటింపజేయడం విశేషం. ఉదయం 11 గంటలకు సదాశివపేట నుంచి ప్రారంభమైన బృందం పర్యటన సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. జిల్లా పర్యటన ముగించుకున్న మహారాష్ట్ర అధికారుల బృందం రాజధాని హైదరాబాద్‌కు చేరుకుంది. ఈ కార్యక్రమంలో ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.

ఏడుపాయల జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు
పాపన్నపేట, ఫిబ్రవరి 14: శ్రీ ఏడుపాయల వనదుర్గ్భావానిమాత జాతర అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని శాసనసభ ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు. జాతరను జయప్రదం చేయడానికి మెదక్ జిల్లాలోని వివిధ శాఖల అధికారులు కృషి చేయాలని ఆమె ఆదేశించారు. శివరాత్రి సందర్భంగా జరిగే మహా జాతర ఉత్సవాలకు తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుండే కాక మహారాష్ట్ర, కర్ణాటక, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి లక్షలాదిగా భక్తులు తరలిరానున్న దృష్ట్యా అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసేందుకు జిల్లా జాయింట్ కలెక్టర్ సురేష్‌బాబు, జిల్లా ఎఎస్‌పి రాంచంద్రారెడ్డి, జిల్లాలోని వివిధ శాఖల శాఖాధిపతులతో కలిసి ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి మంగళవారం ఏడుపాయల్లోని హరితహోటల్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. భక్తులకు సఖల సౌకర్యాలను కల్పించేందుకు అధికారులు ప్రత్యేకంగా కృషి చేయాలని ఆమె కోరారు. ఈ సంవత్సరం జాతరలో అభివృద్ధి పనులకు రూ.1.05 కోట్లు మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఏడుపాయలపై ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక శ్రద్ధవహించి నిధులు మంజూరు చేసినందుకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. మెదక్ జిల్లా నూతనంగా ఏర్పడిన అనంతరం ఈ జాతర ఉత్సవాలు నిర్వహించుకోవడం మొదటిసారి అవుతున్నందున ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. జాతరలో వివిధ శాఖల అధికారులు పోటిపడి వారికి అప్పగించిన పనులను త్వరితగతిన పూర్తి చేసి జాతరలో విశిష్ట సేవలందిస్తే ఆయా శాఖల వారిని గుర్తించి అవార్డులు, రివార్డులు అందజేస్తామని ఆమె పేర్కొన్నారు. ఘణపురం డ్యామ్ నుండి చెక్‌డ్యామ్ మీదుగా ఏడుపాయల వనదుర్గామాత ఆలయం ముందునుండి నీరు ప్రవహించేందుకు ఈ నెల 22లోగా విడుదల చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆమె ఆదేశించారు. మడుగులలో ఉన్న డెడ్ స్టోరేజి వాటర్ అంతా వెళ్లిపోయి ప్రెష్ వాటర్ ప్రవహించేలా నీటిని విడుదల చేయాలని ఇరిగేషన్ అధికారులను కోరారు. అలాగే అమ్మవారి ఆలయం వైపు వెళ్లె బ్రిడ్జి నిర్మాణం, సాంస్కృతిక వేధిక నిర్మాణం పనులను త్వరతిగతిన పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆమె ఆదేశించారు. కొల్చారం, రంగంపేట వైపు నుండి, ఘణపురం ఆనకట్ట మీదుగా ఏడుపాయలకు భక్తులు రానున్న దృష్ట్యా ఘణపురం ఆనకట్టపై ఇరువైపుల పటిష్టమైన భారీకేట్లను ఏర్పాటు చేయాలని ఆర్‌అండ్‌బి అధికారులను ఆదేశించారు. భక్తులు స్నానాలు ఆచరించేందుకు ఐదు షవర్‌బాత్‌లు 12 షవర్‌బాత్‌లను ఏర్పాటు చేయాలని, అలాగే స్నానఘాట్‌ల పక్కన 12 పాయింట్లలో మహిళలు బట్టలు మార్చుకోడానికి టెంట్ గుడారాలు ఏర్పాటు చేయాలని సూచించారు. 276 మరుగుదొడ్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్‌డబ్ల్యూయస్ ఎఇ దినేష్ తెలిపారు. సుమారు 200 నల్లాలు ఏర్పాటు చేసినట్లు, మొబైల్ ట్యాంక్‌ల ద్వారా కూడా తాగునీరు సరఫరా చేస్తామన్నారు. ఏడుపాయల్లో ప్రత్యేకంగా రెండు లక్షల వ్యయంతో తాగునీటి సౌకర్యం కల్పించేందుకు ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేయాలని ఉపసభాపతి ఆర్‌డబ్ల్యూయస్ అధికారులను ఆదేశించారు. భక్తులకు తాగునీటికి సరఫరా చేయనున్న నాగ్సాన్‌పల్లి కట్టపై ఉన్న బోర్లకు 24 గంటలు విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ శాఖ అధికారులను ఆమె సూచించారు. జాతరలో పారిశుద్ధ్యానికి అత్యంత ప్రాధాన్యతనివ్వాలని, స్వచ్చ ఏడుపాయల పేరుతో పరిశుభ్రత పాటించాలని ఆమె సూచించారు. డిపిఓ హనూక్ మాట్లాడుతూ ఏడుపాయల్లో పారిశుద్ధ్యాన్ని అమలుపర్చడానికి పంచాయతీ సిబ్బందితో జాతరలో నాలుగు టీమ్‌లను ఏర్పాటు చేసి షిఫ్ట్‌లవారీగా సిబ్బంది విధి నిర్వాహణ చేసి జాతరలో పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. జాతరలో నిరంతరం వైద్య సేవలు అందించాలని ఉపసభాపతి వైద్య శాఖ అధికారులకు సూచించారు. డియంఅండ్‌హెచ్‌ఓ అమర్‌సింగ్‌నాయక్, డాక్టర్ నవీన్‌లు మాట్లాడుతూ జాతరలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నామని, 150 మంది వైద్య సిబ్బందితో ఏడు పాయింట్లలో ప్రథమ చికిత్స కేంద్రాలతో పెద్దయేత్తున వైద్య సేవలు అందించనున్నట్లు వివరించారు. జాతరకు ప్రత్యేకంగా 200 బస్సులను నడుపుతున్న డిపో మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు. అధనంగా మరో 50 బస్సులను కూడా నడుపుతామని ఆయన తెలిపారు. ఘణపురం బస్టాండ్, ఏడుపాయల బస్టాండ్‌ల వద్ద ప్రత్యేకంగా రెండు పెద్ద టెంట్‌లను ఏర్పాటు చేయాలని ఈఓకు ఉపసభాపతి సూచించారు. ట్రాన్స్‌పోర్టు అధికారులు క్రేన్‌ను సిద్ధంగా ఉంచుకోవాలని కోరారు. రెండు అగ్నిమాపక సర్వీస్‌లు అందుబాటులో ఉండాలని, అలాగే మూడు 108 సర్వీస్‌లను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలనపి జేసి సూచించారు. స్నాన ఘట్టాల వద్ద భక్తులకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా 75 మంది గజ ఈతగాళ్లను ఏర్పాటు చేసినట్లు మత్య్సశాఖ ఎడి తెలిపారు. సంప్రదాయాలకు భంగం కలగకుండా వ్యవహరించాలని ఎక్సైజ్ పోలీస్ అధికారులకు ఉపసభాపతి సూచించారు. మద్యపాన నిషేదాన్ని ఏడుపాయల్లో అమలుపరుస్తామని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. జాతరలో నిరంతరం విద్యుత్ సరఫరా జరిగేలా విద్యుత్ అధికారులు చర్యలు తీసుకోవాలని ఉపసభాపతి సూచించారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా సుమారు వెయ్యి మంది పోలీసులతో భారీ పటిష్టమైన బందోబస్తు నిర్వహిస్తున్నట్లు అడిషనల్ ఎస్‌పి రాంచంద్రారెడ్డి, మెదక్ రూరల్ సిఐ రామకృష్ణలు తెలిపారు. సిసి కెమెరాలను విధిగా ఏర్పాటు చేయాలని, అలాగే జాతరలో విధి నిర్వాహణ చేసే అధికారులు 23న ఈఓకు రిపోర్టు చేయాలని ఆమె సూచించారు. ఈ సమావేశంలో జేసి సురేష్‌బాబు, మెదక్ ఆర్డీఓ నగేష్, ఎఎస్‌పి రాంచంద్రారెడ్డి, దేవాదాయ శాఖ సహాయ కమీషనర్ కృష్ణప్రసాద్, ఆలయ ఈఓ వెంకటకిషన్‌రావు, పంచాయితీరాజ్ ఇఇ వెంకటేశ్వర్లు, ఆర్‌డబ్ల్యూయస్, ఇరిగేషన్, ఆర్‌అండ్‌బి, డిఆర్‌డిఎ, విద్యుత్, ఎక్సైజ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

సంగారెడ్డి నియోజకవర్గంలో
రూ.3.52 కోట్లతో
సిసి రోడ్లు
ఎమ్మెల్యే చింతా ప్రభాకర్

సంగారెడ్డి, ఫిబ్రవరి 14: గ్రామీణ రోడ్లను మెరుగుపర్చాలనే లక్ష్యంతో ఎన్‌ఆర్‌ఈజిఎస్ సహకారంతో నియోజకవర్గంలో రూ.3.52 కోట్లతో సిసి రోడ్లను నిర్మింపజేస్తున్నట్లు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పేర్కొన్నారు. మార్చి 31వ తేదీతో ఈ రోడ్ల నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు గ్రామాల వారిగా నిధులను కేటాయించినట్లు వివరించారు. జనాభా ప్రాతిపదికన పెద్ద గ్రామాలకు 5 లక్షలు, చిన్న గ్రామాలకు 3 లక్షల చొప్పున కేటాయించినట్లు తెలిపారు. తండాలు, మదిర గ్రామాలకు కూడా ప్రాధాన్యతను కల్పించి సిసి రోడ్ల నిర్మాణం చేయిస్తున్నట్లు తెలిపారు. ఎన్‌ఆర్‌ఈజిఎస్ 80 శాతం నిధులను సమకూర్చితే 20 శాతం నిధులను ఎమ్మెల్యేల కోటా ద్వారా అందజేసినట్లు తెలిపారు. మార్చి బడ్జెట్ అనంతరం మరిన్ని నిధులు కేటాయింపజేసి రోడ్ల నిర్మాణం చేయించడానికి తనవంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ పనులు కేవలం గ్రామాల్లోనే కొనసాగుతాయని, పట్టణాలకు వర్తించదని అన్నారు. గత పాలకుల పుణ్యమాని గ్రామాల్లో కనీసం సిసి రోడ్లు, మురికి కాలువలకు కూడా నోచుకోలేక అధ్వాన్నంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేసారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కెసిఆర్ మొట్టమొదటగా రోడ్ల నిర్మాణం, మరమ్మతులకు అధిక ప్రాధాన్యతను ఇచ్చారని స్పష్టం చేసారు. మండల కేంద్రాలకు వెళ్లే రహదారులన్ని డబుల్ రోడ్లుగా ఉండాలని ఆదేశించి అందుకు అవసరమైన నిధులను కేటాయించారన్నారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో రోడ్లు కనీస మరమ్మతులకు నోచులేదని, రవాణ వ్యవస్థ చిన్నాభిన్నంగా మారిందని అన్నారు. ప్రస్తుతం ప్రధాన రోడ్లతో పాటుగా గ్రామీణ అంతర్గత రోడ్లకు కూడా టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తుందన్నారు. ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు పనులను ప్రారంభించి నిధులను సద్వినియోగపర్చుకోవాలని కోరారు. కాగా ఇతర నియోజకవర్గాలకు కూడా ఈ పథకం ద్వారా మంజూరైన నిధులతో సిసి రోడ్ల నిర్మాణాల పనులను ఎమ్మెల్యేలు ప్రారంభింపజేస్తున్నారు. రాయికోడ్ మండలంలో మంగళవారం అందోల్ ఎమ్మెల్యే బాబుమోహన్ ఈ నిధులతో చేపట్టనున్న పనులకు శంఖుస్థాపనలు చేసారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని గ్రామాల్లో సిసి రోడ్ల పనులు శరవేగంగా కొనసాగనున్నాయని చెప్పవచ్చు.

సంక్షేమ పథకాల్లో తెలంగాణ ఆదర్శం
* ట్రైనీ ఐఎఎస్ అధికారుల
సమావేశంలో కలెక్టర్ భారతి
మెదక్, ఫిబ్రవరి 14: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు దేశంలోనే అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని జిల్లా కలెక్టర్ భారతి హొళ్లికేరి వెల్లడించారు. మంగళవారం 2016 బ్యాచ్‌కు చెందిన 18 మంది ట్రైనీ ఐఎఎస్ అధికారుల బృందం మెదక్ జిల్లాలో రెండు రోజుల పాటు శీతాకాల స్టడీటూర్‌లో భాగంగా జిల్లా కలెక్టర్ భారతి హొళ్లికేరిని కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలోని మిని సమావేశ మందిరంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పనులపై కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. మెదక్ జిల్లా కరువు ప్రాంతం అయినప్పటికీ ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల మిషన్ కాకతీయ పథకం ద్వారా అభివృద్ది పరిచిన అన్ని చెరువులు, కుంటలు జలకళ సంతరించుకున్నాయన్నారు. ప్రతి సారి రైతాంగం కేవలం ఖరీప్ సాగుతో సరిపెట్టుకోగా ఈ సారి రెండు పంటలు సాగు చేసేందుకు నీరు సంవృద్దిగా ఉన్నట్లు వారికి వివరించారు. పట్టణాలకు వలసపోయిన వారు మిషన్ కాకతీయ కార్యక్రమం వలన తిరిగి గ్రామాలకు చేరుకొని పంట పొలాలను సాగు చేసుకుంటూ ఆనందంగా జీవిస్తున్నారని ట్రేని ఐఎయస్ అధికారులకు భారతి హొళ్లికేరి వివరించారు. అదే విధంగా కరువు నివారణకు చేపట్టిన ఉపాధిహామి పథకంలో భాగంగా కూలీల సంఖ్య తగ్గి వ్యవసాయ పనుల్లో రైతు కూలీలు పెద్దయేత్తున నిమగ్నమయ్యారని తెలిపారు. గత 28 సంవత్సరాలుగా నిండని చెరువులు, కుంటలు భారీ వర్షాల కారణంగా సంమృద్ధిగా నిండాయన్నారు. మిషన్ కాకతీయ వలన అభివృద్ధి చేసిన చెరువుల్లో పుష్కలంగా నీరు నిలువ ఉండటంతో చుట్టు ప్రక్కల భూగర్భ జలాలు పెరిగి ఎండిపోయిన బోర్లుసైతం పనిచేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. రాష్ట్రంలో మూడవ విడత నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు కోరిందని, అందుకు అనుగుణంగా ప్రతిపాధనలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మిషన్ కాకతీయ క్రింద 46 వేల 500 చెరువుల పునరుద్దరణకు ప్రభుత్వం తగు చర్యలు చేపట్టిందన్నారు. ఈ సమావేశంలో డిఆర్‌డిఓ సీతారామరావు, నర్సాపూర్ ఆర్డీఓ వెంకటేశ్వర్లు, జిల్లా ఇరిగేషన్ అధికారి ఏసయ్య, ఎఇ శ్రీహరిగౌడ్, నర్సాపూర్ తహశీల్దార్ అమినోద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎంపిపి ఆత్మహత్యాయత్నం
చేర్యాల, ఫిబ్రవరి 14: చేర్యాల మాజీ ఎంపిపి తోకల ఉమారాణి మంగళవారం పురుగుల మందు సేవించి ఆత్మహత్యా యత్నానికి పాల్పడటంతో ఆమెను వెంటనే చేర్యాల ఓ ప్రయివేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స నిర్వహించారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి తమకు డబ్బులు ఇవ్వవలసి ఉందని ఆ విషయంలో డబ్బులు ఇవ్వమని కోరగా నిరాకరించడంతో ఆయన వైఖరికి మనస్తాపానికి గురై ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారని తెలిపారు. ఇప్పుడు ఆమె పరిస్థితి నిలకడగా ఉంది.
ఆలయంలో చోరీ
సిద్దిపేట, ఫిబ్రవరి 14: స్థానిక పారిపల్లివీధిలోని హనుమాన్ గుడిలో గుర్తు తెలియని దుండగులు గల్లాను పగులగొట్టి 20వేల నగదు చోరీ చేసిన సంఘటన మంగళవారం వెలుగుచూసింది. రోజులాగే సోమవారం అర్చకులు పూజలు నిర్వహించాక తాళంవేసి వెళ్లారు. మంగళవారం ఉదయం వచ్చి చూడగా గల్లాపెట్టే తాళం పగులగొట్టి ఉన్నట్లు తెలిపారు. సుమారు 20వేల వరకు చోరీ జరిగిందని, టూటౌన్ పోలీసులకు సమాచారం అందించగా సిఐ, సిబ్బంది వచ్చి పరిశీలించారు.
ప్రజాపోరు సభకు ఆటంకాలు సృష్టించడం శోచనీయం

ఎన్ని కుట్రలు పన్నినా సభను విజయవంతం చేస్తాం * టిఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలే టిడిపి ప్రధాన అస్త్రాలు
ఎన్నికల హామీల అమలుకు సిఎం వెంట పడతాం * టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు
గజ్వేల్, ఫిబ్రవరి 14: గజ్వేల్‌లో జరుగుతున్న ప్రజాపోరు సభకు టిఆర్‌ఎస్ ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజాబలంతో విజయవంతం చేస్తామని టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు, మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు, రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షులు వంటేరు ప్రతాప్‌రెడ్డిలు పేర్కొన్నారు. ప్రజాపోరు బహిరంగ సభ ఏర్పాట్లను మంగళవారం సాయంత్రం పరిశీలించిన అనంతరం వారు మాట్లాడారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలే తమ ప్రచార అస్త్రాలు కాగా, ఎన్నికల సందర్బంగా సిఎం కెసిఆర్ ఇచ్చిన ప్రతి హామీ అమలుకు వెంట పడతామని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఆర్బాటంగా ప్రకటించిన దళితులకు మూడెకరాల భూ పంపిణి, పంట రుణమాఫీ, కెజి టు పిజి ఉచితవిద్య, డబల్ బెడ్‌రూం ఇళ్ల్ల నిర్మాణం ఏమైందని వారు నిలదీశారు. అయితే ప్రతి ఏటా లక్ష ఇళ్ల నిర్మాణం చేపడతామని, ఐదేండ్లలో 5లక్షల మంది పేదలకు గూడు కల్పిస్తామని చెప్పిన సిఎం కెసిఆర్ ఎర్రవల్లి, నర్సన్నపేటలలో మాత్రం 500 ఇళ్లస్ల కట్టించి చేతులు దులుపుకున్నట్లు ఎద్దేవా చేశారు. అలాగే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సందర్బంగా ఇదే హామీ ఇచ్చిన సర్కార్ ఇప్పటికి ఇండ్ల నిర్మాణం ఆరంభించకపోవడం సిగ్గుచేటని, అంతేగాకుండా ప్రాజెక్టు ల రీడిజైన్ పేరిట ప్రజాదనం దోచుకునేందుకు సన్నద్ధమవుతున్నట్లు విమర్శించారు. పంట రుణమాఫీని వర్తింపజేయకపోతుండడంతో పాటు కేంద్రం మంజూరు చేసిన రాయితీ డబ్బును పక్కదారి పట్టించిన ఘనత సిఎం కెసిఆర్‌కు దక్కుతుందని, విద్యార్థులకు ఫీజు రీయంబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్స్ మంజూరు చేయాలని, భూములు కోల్పోతున్న రైతులకు న్యాయమైన పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్న ప్రతిపక్షాలను అభివృద్ధి నిరోధకులుగా పేర్కొంటున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే మల్లన్నసాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టు, రంగనాయకసాగర్‌ల పేరుతో రైతులను ఆవేదనకు గురిచేస్తుండగా, ఇప్పటివరకు ఏ ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేకపోయినట్లు స్పష్టం చేశారు. కాగా చేవెళ్ళ- ప్రాణహిత ప్రాజెక్టుకు కేంద్రం నిధులు కేటాయించడానికి సిద్ధంగా ఉండగా, కాలేశ్వరం ప్రాజెక్టు పేరు మార్పుతో మరో దగాకు తెర లేపుతున్నట్లు చెప్పారు. రెండున్నర ఏళ్ల వ్యవధిలో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనకబడి పోగా, ప్రజలను చైతన్యం చేస్తూ టిఆర్‌ఎస్‌ను వెంబడించనుండగా, గజ్వేల్ నుండే టిఆర్‌ఎస్ పతనానికి నాంది పలకనున్నట్లు వివరించారు. నేతలు ఉప్పల మెట్టయ్య, బొల్లారం ఎల్లయ్య, ఆర్కె శ్రీనివాస్, విరాసత్‌అలి, షరిఫొద్దీన్, పరుచూరి రాజేశ్, మల్యాల భద్రయ్య, కైలాస మహిపాల్, శ్రీనివాస్, రామకృష్ణారెడ్డి, హన్మంతరెడ్డి, రఘుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నేరరహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలి: సిపి

సిద్దిపేట, ఫిబ్రవరి 14: సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో నేరాలు నిర్మూలించి నేరరహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు చిత్తశుద్దితో కృషి చేయాలని సిపి శివకుమార్ అన్నారు. మంగళవారం పెండింగ్ కేసులపై ఏసిపి, సిఐలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలీస్‌స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేసిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా కేసు నమోదు చేయాలన్నారు. బాధితులకు స్టేషన్‌లో న్యాయం జరుగుతుందని భరోసా కల్పించాలన్నారు. ఫిర్యాదుదారుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. ఆస్థిసంబంధ కేసుల్లో అన్ని విధాలా నేరస్తుల ఆచూకీగురించి పరిశీలించి కేసును త్వరగా శోధించాలని అధికారులను ఆదేశించారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పోకిరీల భరతంపట్టి శిక్షించాలన్నారు. పెండింగ్ కేసులను పరిశోధన చేసి నేరస్తులకు శిక్షపడేలా చూడాలన్నారు. గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతున్న ఇసుక, బొగ్గు, కట్టె రవాణాల పై నిఘా వ్యవస్థ పటిష్ట పర్చి అక్రమాలు అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో బెల్టుషాపులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రాత్రిళ్లు గస్తీ ముమ్మరం చేసి చోరీలు జరుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కమిషనరేట్‌లోని లాడ్జింగ్‌లు తనిఖీలు చేయాలని, జనసమూహం, వ్యాపార రద్దీల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు.

శివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై ఎమ్మెల్యే సమీక్ష
పటన్‌చెరు, ఫిబ్రవరి 14: అమీన్‌పూర్ గ్రామ పంచాయతి భీరంగూడ భ్రమరాంభిక మల్లిఖార్జున దేవాలయంలో శివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించాలని ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి సూచించారు. ఎలాంటి అసౌకర్యం కలుగకుండ అత్యధిక సంఖ్యలో హాజరవుతున్న భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆలయ కమిటీ అధికారులను ఆదేశించారు. గత సంవత్సరము జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గత శివరాత్రి ఉత్సవాలలో భక్తులు త్రాగునీటి కోసం నానా ఇక్కట్లు పడినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. ఆర్‌డబ్ల్యుఎస్ అధికారుల సహాయ సహకారాలతో లక్షలాదిగా తరలి వచ్చే భక్తులకు అసౌకర్యం కలుగకుండ జాగ్రత్త వహించాలని ఎమ్మెల్యే దేవాయల ఇఓ ఉదయభాస్కర్‌కు సూచించారు. ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ ఆలయానికి సంబంధించిన నిధుల వివరాలను వివరించకుండా ఇఓ ఉదయభాస్కర్ విరాళాల గురించి మాట్లాడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దాతలు ముందుకు వచ్చి విరాళాలు ఇచ్చినట్లయితే గౌరవంగా వాటిని స్వీకరించాలని, ముందుగా ఆలయానికి సంబంధించిన నిధులతో భక్తులకు అవసరమైన పనులు ప్రారంభించాలన్నారు.