మెదక్

పేదల ఆరోగ్య రక్షణ లక్ష్యం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, ఫిబ్రవరి 17: సామాజిక సేవే లక్ష్యంగా ముందుకెళ్తున్న పోలీసులు పేదల ఆరోగ్య పరిరక్షణను కూడా ద్యేయంగా పెట్టుకున్నట్లు పోలీస్ కమిషనర్ శివకుమార్ పేర్కొన్నారు. శుక్రవారం గజ్వేల్‌లో పోలీసులు, రష్ ఆసుపత్రి యాజమాన్యం, ఇండియన్ మెడికల్ అసోసియేషన్‌ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా ఉచిత వైద్య, రక్తదాన, అన్నదాన శిభిరాలను ప్రారంభించి ఆయన మాట్లాడారు. అదునాతన పరిజ్ఞానంతో పేదలకు వైద్య సేవలు అందించేందుకు ముందుకు వచ్చిన రష్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నవీన్‌రెడ్డిని ప్రశంసించడంతోపాటు గజ్వేల్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు ఉచితంగా చికిత్సలకు చేయూతనివ్వడానికి రావడం మంచి సాంప్రదాయానికి తెరలేపినట్లు స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతమైన గజ్వేల్‌లో కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలందించి ఉచితంగా ఆపరేషన్‌లు, మందులు అందించడానికి రాగా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ముఖ్యంగా జిల్లాలో కమ్యూనిటీ పోలీసింగ్ వ్యవస్తను పటిష్టం చేస్తూ ప్రజల ముందుకు తెస్తుండగా, శాంతి భద్రతల పరిరక్షణతోనే అభివృద్ధి సాధ్యమని ఏకైక లక్ష్యంతో పోలీసులు ముందుకెళ్తున్నట్లు తెలిపారు. అయితే నేరరహిత గ్రామాలను గుర్తించి సమిష్టి కృషి, ఐక్యతతో అన్ని వర్గాలను సమన్వయం చేస్తూ ప్రజలు ప్రశాంత వాతావరణాన్ని గడిపేందుకు దృష్టి సారించినట్లు వివరించారు. దైనందిన కార్యక్రమాలతోపాటు సామాజిక స్పృహతో ముందుకెళ్తున్న పోలీసుశాఖను ప్రశంసించక తప్పదని ఆర్యవైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ పేర్కొన్నారు. గజ్వేల్ వాసవీమిత్ర ఆద్వర్యంలో మంచి సేవా కార్యక్రమాలు చేపడుతుండడం ప్రశంసనీయమని, డబ్బు సంపాదనే లక్ష్యం కాకుండా తోటి వారిని ఆదుకోవడంలో ఎంతో తృప్తి ఉంటుందని తెలిపారు. మున్సిపల్ చైర్మెన్ గాడిపల్లి భాస్కర్ మాట్లాడుతూ పేదల ఆహార భద్రతను దృష్టిలో పెట్టుకొని గజ్వేల్, ప్రజ్ఞాపూర్‌లలో రూ. 5కే బోజన పథకం అమలుకు చర్యలు తీసుకుంటుండగా, త్వరలోనే కార్పోరేట్ స్థాయిలో వైద్య సేవలందించడానికి గజ్వేల్‌లో 100 పడకల ఆసుపత్రి సిద్ధమవుతున్నట్లు స్పష్టం చేశారు. కార్యక్రమంలో ట్రైనీ ఐపిఎస్ అధికారి రక్షిత, ఎసిపి గిరిధర్, మున్సిపల్ వైస్ చైర్మెన్ అరుణబూపాల్‌రెడ్డి, కమిషనర్ శంకర్, రష్ మార్కెటింగ్ మేనేజర్ ఉమా మహేశ్వర్‌రెడ్డి, ఐఎంఎ వైద్యులు డాక్టర్ నరేశ్‌బాబు, డాక్టర్ మల్లయ్య, డాక్టర్ పెంటాచారి, డాక్టర్ లింగం, సిఐ సతీశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతుండగా
విద్యుదాఘాతం
* యువకుడు మృతి
కౌడిపల్లి, ఫిబ్రవరి 17. సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతుండగా యువకుడు మృతి చెందిన సంఘటన మండల ఫరిదిలోని మనంతాయపల్లి తండాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కౌడిపల్లి మండలం భుజిరంపేట పంచాయతీ పరిధిలోని మనంతాయపల్లి తండాకు చెందిన పాతులోత్ పాండ్య (38) గురువారం రాత్రి తన ఇంట్లో సెల్‌ఫోన్‌కు చార్జింగ్ పెడుతుండగా కరెంట్ సరఫరా జరిగి కింద పడిపోయాడు. కుటుంబ సభ్యులు 108 వాహనంకు ఫోన్ చేశారు.
వాహనం వచ్చి 108 సిబ్బంది చూసే సరికి పాండ్య అప్పడికే మృతిచెందాడు. మృతుడి భార్య బుజ్జి శుక్రవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో పిర్యాదు చేసింది. ఎఎస్‌ఐ కలీమొద్దిన్ ఘటనా స్థలానికి చేరుకొని పాండ్య మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతునికి భార్య బుజ్జి, మిట్ట్య (19), మహేష్ (11) సంవత్సరాల కుమారులు ఉన్నారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కలీమొద్దిన్ తెలిపారు. పాండ్య మృతితో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.