మెదక్

ఎఇఓలు విధులను బాధ్యతగా నిర్వహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, ఫిబ్రవరి 17 : వ్యవసాయ శాఖ ముఖ్యమైన సేవ శాఖ అని.. రైతాంగం మన ద్వారా ఏన్నో ప్రయోజనాలు ఆశీస్తారని వ్యవసాయ విస్తరణ అధికారులు బాధ్యతగా..సంతృప్తిగా తమ విధులను నిర్వర్తించాలి కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి సూచించారు. సిద్దిపేట ఎంపిడిఓ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం నూతన వ్యవసాయ విస్తరణ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరై మాట్లాడారు. వ్యవసాయ రంగంలో తన సర్వీసులో చాలా ఏళ్ల నుంచి ఉద్యోగాలు ఖాళీగా ఉండేవని, కాని తెలంగాణ సర్కార్ ప్రప్రథమంగా వ్యవసాయ రంగంలో ఖాళీలను పూర్తి చేశారన్నారు. ఎఇఓలుగా విధుల్లో చేరిన వారంతా వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వారే కాబట్టి అదృష్ట వంతలని అభినందించారు. వ్యవసాయ శాఖ సేవా రంగమని, వ్యవసాయ శాఖద్వారా రైతులను ఏన్నో ప్రయోజనాలను ఆశీస్తున్నవారనికి వారు అనుకున్న విధంగా బాధ్యతలు సక్రమంగా నేరవేర్చాలన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించే విషయంలో ఇష్టంతో పనిచేయాలన్నారు. ముఖ్యంగా రైతు ముంగిట్లో శాస్త్ర, సాంకేతిక, పరిజ్ఞానాన్ని తీసుకెళ్లాలని, ఇందుకోసం నిబద్దతతో పనిచేసి సిద్దిపేట జిల్లాకు మంచి పేరు తేవాలన్నారు. చాల ఏండ్లుగా అనుభవం ఉన్న అధికారులున్నారన్నారు. కూరగాయాల సాగులో ఇప్పటికే మనం ఆదర్శ ప్రాయంగా మొదటి స్థానంలో ఉన్నామన్నారు. కొత్తగా చేరిన వ్యవసాయ విస్తరణ శాఖ ఉద్యోగులుగా ఆత్మవిశ్వాసంతో మరింత ఉన్నత స్థానం చేరేలా పనిచేయాలని సూచించారు. మీకు వచ్చిన సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ ఉద్యోగం చాల గౌరవ ప్రదమైందని, జాబ్ చేయటాన్ని సంతృప్తిగా భావిస్తు పనిచేయాలన్నారు. ఈకార్యక్రమంలో నూతనంగా ఉద్యోగాల్లో చేరిన 95 మంది వ్యవసాయ విస్తరణాధికారులు, ఉద్యాన వన శాఖ డిడి రామలక్ష్మి, వ్యవసాయ శాఖ జెడి వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయ శాఖాధికారి శ్రవణ్, శాస్తవ్రేత్తలు ఉమారెడ్డి, శ్రీనివాస్, రిటైర్డు వ్యవసాయాధికారి రాంచందర్‌రావు, వివిధ మండలాలకు చెందిన వ్యవసాయాధికారులు పాల్గొన్నారు.

ప్రజా సంక్షేమమే ధ్యేయం

పెద్దశంకరంపేట, ఫిబ్రవరి 17: ప్రజా సంక్షేమం కోసం తెరాస ప్రభుత్వం పాటుపడుతుందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పెద్దశంకరంపేటలో 10 లక్షల రుపాయలతో నిర్మించే మత్య్సకార భవనానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెరాస ప్రభుత్వ హాయంలోనే అభివృద్ది జరుగుతుందని, ప్రతి గ్రామంలో ప్రభుత్వం చేపట్టే అభివృద్ది పనులే ఇందుకు నిదర్శనమన్నారు. ప్రభుత్వం అన్ని వర్గాల వారి అభివృద్ది కోసం కృషి సల్పుతుందన్నారు. ప్రతి గ్రామంలో ఏదో ఒక అభివృద్ది పని ప్రారంభించి దశల వారిగా గ్రామం మొత్తాన్ని అభివృద్ది పరుస్తున్నామన్నారు. మత్య్సకారుల భవనానికి 10 లక్షల రుపాయలు మంజూరయ్యాయని, ఈ భవన నిర్మాణానికి త్వరలో పూర్తి చేయాలన్నారు. అనంతరం పేట గ్రామపంచాయితీ వద్ద పలువురికి సిఎం రిలీప్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. పేట సర్పంచ్ జంగం శ్రీనివాస్, ఎంపిటిసి సభ్యులు వేణుగోపాల్‌గౌడ్, సుభాష్‌గౌడ్, సుశీల, మురళీపంతులు పున్నయ్య తదితరులు పాల్గొన్నారు.