మెదక్

సిఎం నియోజకవర్గానికి సిరుల పంట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, ఫిబ్రవరి 17: రాష్ట్రంలోనే గజ్వేల్ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు సిఎం కెసిఆర్ రూ. 4వేల కోట్లతో వివిద అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు రాష్ట్ర నీటి పారుదల శాఖా మంత్రి తన్నీరు హరీష్‌రావు పేర్కొన్నారు. శుక్రవారం గజ్వేల్‌లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు సన్నబియ్యంతో భోజన పథకం ఆరంభించడంతో పాటు జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటుచేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని సందర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. మిషన్ భగీరథ పథకంతో నియోజకవర్గంలో మొట్టమొదటగా స్వచ్ఛమైన తాగునీరు అందించగా మిషన్ కాకతీయ, రహదారుల అభివృద్ధి, ఎడ్యుకేషన్‌హబ్, ఆడిటోరియం నిర్మాణం, సమీకృత ప్రభుత్వ భవనాల ఏర్పాటు, 100 పడకల ఆసుపత్రితో గజ్వేల్ 50యేండ్ల ముందుకు దూసుకెళ్ళినట్లు స్పష్టం చేశారు. అలాగే మల్లన్నసాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టుల నిర్మాణంతో బీడు భూములు సస్యశ్యామలం కానుండగా, విద్యాపరంగా ఇప్పటికే రూ. 150కోట్ల వ్యయంతో 5 ఎస్సీ రెసిడెన్సియల్ పాఠశాలల మంజూరు, మైనార్టీ గురుకుల పాఠశాలల ఏర్పాటు, త్వరలోనే బిసి గురుకుల పాఠశాలలు కేటాయించనున్నట్లు తెలిపారు. ఎస్సీ, బిసి, మైనార్టీలకు చెందిన ప్రతి విద్యార్థిపై ప్రభుత్వం రూ. 80వేలు కేటాయిస్తుండగా, సకల, అధునాతన సౌకర్యాలతో కార్పొరేట్ తరహా విద్యనందించేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. గజ్వేల్ నడిబొడ్డులో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వెజిటబుల్, నాన్‌వెజిటబుల్ మార్కెట్ల ఏర్పాటుకు నిధులు మంజూరు కాగా, భవిష్యత్తులో వలసలకు అవకాశమే ఉండదని అన్నారు. అంతేకాకుండా పేదల ఆర్థికాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని డబల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం, షాదీముబారక్, కల్యాణలక్ష్మిలతో రూ. 51వెయ్యి ఆర్థిక సహాయం, అర్హులైనవారందరికీ పెన్షన్‌లు, మూడెకరాల భూ పంపిణీ వంటి కార్యక్రమాలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా గజ్వేల్‌లో కార్పొరేట్ స్థాయిలో ఉచిత మెగా వైద్యశిబిరం ఏర్పాటుచేసిన రష్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నవీన్‌రెడ్డి స్పూర్తితో మిగతా ఉన్నతస్థాయి ఆసుపత్రులు ఇక్కడి పేదలకు మెరుగైన వైద్య సేవలందించాలని ఆకాంక్షించారు. డబ్బు సంపాదన లక్ష్యం కాకుండా సామాజిక సేవా దృక్పదంతో ముందుకెళ్తున్న రష్ ఆసుపత్రి యాజమాన్యాన్ని అభినందించారు. ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి, డిసిసిబి చైర్మెన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మెన్ గాడిపల్లి భాస్కర్, వైస్ చైర్మెన్ అరుణబూపాల్‌రెడ్డి, ఏసిపి గిరిదర్ తదితరులు పాల్గొన్నారు.