మెదక్

ప్రామాణికత లేని పరిశోధనలు నిష్ప్రయోజనకరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, ఫిబ్రవరి 18 : ప్రామాణిక పరిశోధనల ద్వారా నూతన ఆవిష్కరణలకు ఆస్కారం ఏర్పడుతుందని, తద్వారా సాహిత్యం సుంపన్నం మవుతుందని తెలంగాణ విశ్వ విద్యాలయం అసిస్టెంట్ ఫ్రొఫెసర్ డాక్టర్ గుమ్మన్నగారి బాల శ్రీనివాస మూర్తి అన్నారు. శనివారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల పిజి తెలుగుశాఖ నిర్వహించిన కార్యక్రమంలో తెలుగులో పరిశోధన పత్ర రచన అనే అంశంపై ఆయన విస్తృత ఉపన్యాసం చేశారు. ఈసందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి పరిశోథనలపై దృష్టి సారించాలన్నారు. సురవరం ప్రతాప్‌రెడ్డి రచించిన ఆంధ్రుల సాంఘిక చరిత్ర, సినారే వెలువరించిన సాహిత్యంలో సంప్రదాయాలు, ప్రయోగాలు వంటి పరిశోధనాత్మక రచనలు ఈనాటికీ ఆధార గ్రంథాలుగా రాణిస్తున్నాయన్నారు. నిజాయితీ, సత్యసంధత, క్లుప్తత, గుప్తత పరిశోధనకు వనె్న తెస్తాయని సోదారహరణంగా వివరించారు. ఇతరుల సూచనలపై ఆధారపడకుండా వ్యక్తిగతంగా ఆసక్తి గల ఆంశాలను పరిశోధనలకు స్వీకరించాలని హితవు పలికారు. పిహెచ్‌డి పట్టాల కోసం సమర్పిస్తున్న సిద్ధాంత వ్యాసాల సంఖ్య రాశిలో మిన్నగా ఉంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపాదిస్తున్న ప్రతి అంశానికి సరైన ప్రమాణాలు చూపినప్పుడే పరిశోధన పత్రం ప్రామాణిక రచనగా రాణిస్తుందన్నారు. బిఎస్ శాస్ర్తీ శాసనాల పరిశోధన కోసం ఏడువేల గ్రామాల్లో పర్యటించి విషయాన్ని సేకరించారన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థి సర్వాంగీణ వికాసమే ధ్యేయంగా వైవిద్యభరితమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కళాశాల విద్యాశాఖ నిర్వహించిన జిజ్ఞాస కార్యక్రమంలో కళాశాలకు చెందిన మూడు విద్యార్థి బృందాలు రాష్ట్ర స్థాయి ప్రదర్శనలో పాల్గొన్నారని తెలిపారు. పిజి తెలుగుశాఖ అధ్యక్షుడు డాక్టర్ హరినాథ శర్మ సమావేశానికి అధ్యక్షత వహిస్తూ మాట్లాడుతూ పరిశోధనలు విద్యార్థుల మేదస్సుకు పదును పెడుతాయన్నారు. విస్తృతంగా పుస్తకాలు చదువటం అలవర్చుకోవాలన్నారు. జిజ్ఞాస కార్యక్రమంలోభాగంగా రాష్ట్ర స్థాయి ప్రదర్శనల్లో సిద్దిపేట జిల్లా శాసనాలు అనే అంశంపై అధ్యాయన నివేదిక సమర్పణలో ప్రతిభ చూపిన భరత్, స్రవంతి, రమాదేవి, కిషన్, రాథోడ్, శ్రీహర్షారెడ్డి అనే విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందచేశారు. అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ గోపాల సుదర్శనం, లెక్చరర్లు నిర్మల, వేణుగోపాల శర్మ, అంజిరెడ్డి, రమణ, రచన, సరస్వతి తదితరులు పాల్గొన్నారు.
శ్రీ సరస్వతీ క్షేత్రంలో నాగసాధువుల పూజలు
మెదక్ రూరల్, ఫిబ్రవరి 18: గరుఢ గంగగా ఉత్తరవాహనిగా ప్రవహిస్తున్న మంజీరా తీరంలో వెలసిన శ్రీ సరస్వతీ క్షేత్రంలో కాశీ నుంచి విచ్చేసిన దిగంబర, నాగసాధువులు శనివారం పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంజీర నదిని సందర్శించి జనమేజయుడు నిర్వహించిన యజ్ఞం విభూతి నేటికి బయల్పడుతుందని నిర్వాహకులు దోర్బల రాజవౌళి శర్మ వారికి చూపించారు. త్వరలో ఇక్కడ ప్రతిష్ఠించేందుకు తీసుకువచ్చిన భారీ లింగం, నంది విగ్రహాలను దర్శించుకున్నారు. నాగుల పుట్ట సందర్శించి అక్కడ వౌన ముద్రలో కూర్చున్నారు. ఈ ప్రాంతం ఆధ్యాత్మికతను వెదజల్లుతుందని ఆకాంక్షించారు. వారికి రాజవౌళీశర్మ, మహేశ్ శర్మలు స్వాగతం పలికారు.