మెదక్

సకాలంలో పథకాలు పూర్తిచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, ఏప్రిల్ 7: జిల్లాలో అభివృద్ధి పథకాలకు ప్రాదాన్యతనిచ్చి సకాలంలో పూర్తి చేయాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి తన్నీర్ హరీష్‌రావు అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్‌లో నారాయణఖేడ్ నియోజకవర్గ శాసన సభ్యులు భూపాల్‌రెడ్డి, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు బిబి పాటిల్, కలెక్టర్ రోనాల్డ్ రోస్‌తో కలిసి నారాయణఖేడ్ నియోజకవర్గ అభివృద్ధి పనుల ప్రగతిపై వివిధ ఇంజనీరింగ్ శాఖల అధికారులతో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రధాన మంత్రి గ్రామ స్వరాజ్‌గార్ యోజన కింద కేంద్ర నిధులు మంజూరు కానున్నాయని, గ్రామ పంచాయతీలతో పాటు నియోజవర్గంలోని 500పైగా జనాభా ఉన్న తాండాలకు రోడ్ల సౌకర్యం కల్పించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని పంచాయతీ రాజ్ ఎస్‌ఈని ఆదేశించారు. రోడ్ల విస్తర్ణ పనులు అవసరమున్న ప్రతి గ్రామంలో విస్తృతంగా పర్యటించి ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు. ఇప్పటికే మంజూరై అసంపూర్తిగా ఉన్న గ్రామ పంచాయతీ, అంగన్‌వాడి భవనాలు, కమ్యూనిటి హాల్స్‌ను ప్రధాన్యాతనిచ్చి పూర్తి చేయాలని సూచించారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామ పంచాయతీలకు పక్కా ప్రభుత్వ భవనాలు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. నారాయఖేడ్ పట్టణంలో మూడు వైపుల నాలుగు లైన్లతో రోడ్ల అభివృద్ధి పనులకు చర్యలు తీసుకోవాలని రోడ్ల భవనాల శాఖ ఇంజనీర్లకు సూచించారు. మూడు లైన్ల రోడ్లను నాలుగు లైన్ల మార్గాలుగా అభివృద్ధి చేయాలన్నారు. రోడ్ల వెడల్లు విషయంలో కంగ్టి మండల స్థానిక ప్రజలతో చర్చించి ఒప్పించాలని, ఇండ్లు కల్పోయిన వారికి రెండు పడకల ఇండ్లు, స్థలం మంజూరు చేయాలని, లేనిచో ఉన్న రోడ్డుకు డివైడర్లు, బట్టర్‌ఫై లైట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎస్సీ,ఎస్టీ,బిసి, మైనార్టీల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. నియోజకవర్గంలో 10పాఠశాలలను 10వ తరగతి వరకు, 20 ప్రాథమిక పాఠశాలలను ప్రాథమికోన్నత పాఠశాలలుగా అప్‌గ్రేడ్ చేసేందుకు వెంటనే ప్రతిపాదించాలని మంత్రి ఆదేశించారు. నారాయణఖేడ్ ఐటిఐ మంజూరీకి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, ఎస్సీ,ఎస్టీ ఆశ్రమ పాఠశాలలను అప్‌గ్రేడ్ చేసేందుకు ప్రతిపాదించాలని, జిల్లాలో జూనియర్ కళాశాలలు, మంజూరైన భవన నిర్మాణాలకు వెంటనే స్థలాలను సేకరించాలన్నారు. రాయికోడ్, మనూర్‌లో వచ్చే విద్యాసంవత్సరం నుండి ఇంటర్ తరగతులు ప్రారంభం కావాలని అధికారులను ఆదేశించారు. సమీక్షలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, ఇన్‌చార్జ్ జె.సి. వర్షిణి, వివిధ ఇంజనీరింగ్ శాఖల అధికారులు, అభివృద్ధి సంస్థల అధికారులు పాల్గొన్నారు.