మెదక్

ఇంటర్, టెన్త్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, ఫిబ్రవరి 20: ఇంటర్మీడియేట్, పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా, సజావుగా జరిగేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో ఇంటర్మీడియేట్, పదవ తరగతి పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై సంబంధిత శాఖ అధికారులతో సమీక్షించారు. మార్చి 1నుండి 19వరకు ఇంటర్మీడియేట్, మార్చి 14నుండి 30వరకు పదవ తరగతి పరీక్షలు నిర్వహించనున్నందున విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని, పరీక్ష నిర్వహణకు పోస్టల్ శాఖ తమకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని, పరీక్ష కేంద్రాల్లో నిరంతరాయంగా విద్యుత్ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, ఫర్నిచర్, వెంటిలేషన్ తదితర సౌకర్యాలు ఉండేలా చూసుకోవాలన్నారు. పరీక్ష సమయానికి కేంద్రాలకు చేరుకునే విధంగా గ్రామీణ ప్రాంతాల నుండి ప్రత్యేక బస్సులను నడపాలని ఆర్టీసి అధికారులకు సూచించారు. ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ అధికారి కిషన్ మాట్లాడుతూ జిల్లాలో 45 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఉదయం 9గంటల నుండి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్షను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జిల్లా విద్యాధికారి చంద్రకళ మాట్లాడుతూ జిల్లాలో 108 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఉదయం 9.30నుండి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని వివరించారు. సమీక్షలో పోలీస్, విద్యుత్, ఆర్టీసి, పోస్టల్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.