మెదక్

అభివృద్ధిని అడ్డుకుంటున్న ప్రతిపక్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, ఫిబ్రవరి 21: బంగారు తెలంగాణ సాదన కోసం సిఎం కెసిఆర్ చర్యలు తీసుకుంటుండగా, అభివృద్దిని జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు ప్రజలను రెచ్చగొట్టడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు రాష్ట్ర నీటి పారుదల శాఖా మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. మంగళవారం మండల పరిదిలోని దర్మారెడ్డిపల్లిలో శ్రీ ఎల్లమ్మ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడారు. రైతులు, కార్మికులు, నిరుద్యోగుల సమస్యల పరిష్కారంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం యుద్దప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీలో భాగంగా కాళీ పోస్టుల భర్తీపై దృష్టి సారించి నోటిఫికేషన్‌లు జారీ చేస్తుండగా, నిరుద్యోగులను పలువురు నేతలు రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకున్నట్లు ఆరోపించారు. అలాగే పంట రుణమాఫీని వర్తింపజేయడంతోపాటు ఇన్‌పుట్ సబ్సీడీని రైతుల ఖాతాలలో జమ చేస్తుండగా, ప్రాజెక్టులు పూర్తయితే తమ ఉనికిని కోల్పోతామనే భయంతో ప్రతిపక్ష పార్టీల నేతలు కోర్టులను ఆశ్రయించి అడ్డుకుంటున్నట్లు స్పష్టం చేశారు. బంగారు తెలంగాణ సాదనలో భాగంగా అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందుకెళ్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పిటిసి సభ్యులు వెంకటేశంగౌడ్, మున్సిపల్ చైర్మెన్ గాడిపల్లి భాస్కర్, మండల టిఆర్‌ఎస్ అధ్యక్షులు మద్దూరి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన సర్కార్
నిరుద్యోగుల ర్యాలీని అడ్డుకోవడం సిగ్గుచేటు * ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలి
పంట రుణమాఫీని ఏకకాలంలో మంజూరు చేయాలి : టిడిపి రాష్ట్ర నేత వంటేరు ప్రతాప్‌రెడ్డి
గజ్వేల్, ఫిబ్రవరి 21: ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన టిఆర్‌ఎస్ సర్కార్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షుడు వంటేరు ప్రతాప్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం గజ్వేల్ మండల పరిధిలోని దర్మారెడ్డిపల్లిలో నూతనంగా వెలసిన శ్రీ ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తానని హామీ ఇచ్చిన సిఎం కెసిఆర్ చివరకు ర్యాలీనే అడ్డుకుంటుండడం సిగ్గుచేటని నిలదీశారు. అయితే ర్యాలీ నిర్వాహకులపై ఇప్పటికే కేసులు నమోదైన దృష్ట్యా హైదరాబాద్‌లో గొడవలు జరుగుతాయని కోర్టుకు తెలపడం దురదృష్టకరమని, శాంతియుత పద్ధతుల్లో నిరసన ర్యాలీ చేపడతామని జెఏసి చైర్మన్ కోదండరాం పేర్కొంటున్నప్పటికీ ఆయనపై టిఆర్‌ఎస్ శ్రేణులు విమర్శలు చేస్తుండడం ఎంతమాత్రం తగదని నిలదీశారు. ఉద్యమ సమయంలో ప్రొఫెసర్ కోదండరాంను వాడుకొని గద్దెనెక్కిన సిఎం కెసిఆర్ ప్రస్తుతం కోదండరాంను లక్ష్యంగా చేసుకుని పార్టీ శ్రేణులను రెచ్చగొడుతూ కాంగ్రెస్, టిడిపి ఏజెంట్‌గా మాట్లాడుతున్నట్లు అభాండాలు వేయడం టిఆర్‌ఎస్‌కే చెల్లిందని ఆరోపించారు. అయితే ఎన్నికల సందర్భంగా రైతులు, నిరుద్యోగులు, కార్మికులు, మహిళలకు ప్రత్యేక పథకాలు అమలు చేసి బంగారు తెలంగాణ సాధిస్తామని చెప్పిన కెసిఆర్ రైతులకు పంట రుణమాఫీ వర్తింపజేయడంలేదని, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడంలేదని, మహిళలకు డ్వాక్రా రుణాలు మంజూరు చేయడంలేదని, కార్మికులను రెగ్యులరైజ్ చేయడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఎన్నికల హామీలు, ప్రజా సమస్యలను పట్టించుకోని పక్షంలో కెసిఆర్ ప్రజాగ్రహానికి గురికాక తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పిటిసి వెంకటేశంగౌడ్, ఎల్లయ్య, నేతలు శ్రీనివాస్, భూమయ్యయాదవ్, హన్మంతరెడ్డి, రఘుపతిరెడ్డి, రాజేశ్, విరాహత్‌అలి, శ్రీనివాస్‌గుప్త పాల్గొన్నారు.

ఎన్ని అడ్డంకులు సృష్టించినా
ర్యాలీలో పాల్గొంటాం
* అరెస్టులు, లాఠీచార్జీలకు భయపడం..
* టిఎజెసి జిల్లా కన్వీనర్ బీరయ్యయాదవ్
సంగారెడ్డి టౌన్, ఫిబ్రవరి 21: ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. ర్యాలీలు నిర్వహిస్తామని, అరెస్టులు, లాఠీచార్జీలకు భయపడేది లేదని టిజెఎసి జిల్లా కన్వీనర్ బీరయ్యయాదవ్ పేర్కొన్నారు. నిరుద్యోగులకు న్యాయం చేయాలని, ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 22న ఇందిరాపార్క్ వద్ద టిఎజెసి తలపెట్టిన ర్యాలీ, ధర్నాలో యువతి, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మంగళవారం సంగారెడ్డి ఐబి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్టవ్య్రాప్తంగా ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలన్నారు. ఉద్యోగాలు, నీరు, నిధుల కోసమే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందన్న విషయాన్ని మరువద్దన్నారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే పద్ధతులను మానుకోవాలని, లేని పక్షంలో ఓటు ఆయుధంతో ప్రజలు ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. టిజెఎసి తలపెట్టిన ఈ ర్యాలీపై మంత్రులు, ఎమ్మెల్యేలు విమర్శలకు దిగడం సరికాదని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో టిజెఎసి నాయకులు మల్లయ్య, నాగరాజ్ దుర్గయ్య, కుమ్మరి సాయిలు, అనంతయ్య, శ్రీ్ధర్, వెంకటేశ్వర్లు, తుల్జారెడ్డి, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

గొల్లకుర్మల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి
సిద్దిపేట, ఫిబ్రవరి 21 : గొల్ల కుర్మలు అర్థికంగా పురోగతి సాధించేలా ప్రభుత్వం కృషిచేస్తుందని జిల్లా కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి అన్నారు. మంగళవారం సిద్దిపేట ఎంపిడిఓ కార్యాలయంలో ఎన్‌సిడిసి లబ్దిదారులకు గొర్రెల, యజమాన్యా వసతులపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈశిక్షణ కార్యక్రమంలో నియోజక వర్గంలోని 12 గ్రామాలకు చెందిన 99 కుటుంబాల ఎన్‌సిడిసి లబ్ధిదారులకు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరైన కలెక్టర్ మాట్లాడుతూ గొల్లకుర్మల కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు ప్రభుత్వ యంత్రాంగం ఎంతగానో కృషిచేస్తుందన్నారు. జిల్లాలో గొర్ల పెంపకం పెద్దఎత్తున జరుగుతుందని ఇందుకోసం గొల్ల కుర్మలకు ప్రభుత్వం పక్షాన కావాల్సిన తోడ్పాటు అందిస్తున్నట్లు వివరించారు. ఎన్‌సిడిసి పథకం ద్వారా లబ్ధిపొందిన వారు అవగాహన కలిగివుండాలని, దిశా, నిర్దేశం చేశారు. లబ్ధిదారులకు కావాల్సిన సహాయ, సహాకారాలు అందించేలా అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

కష్టపడి పనిచేస్తే సమాజంలో మంచి గౌరవం
* వృత్తి డిమాండ్ కోర్సులను అభ్యసిస్తే ఉద్యోగ అవకాశాలు * గురుకుల టీచర్ల పోస్టులకు ఉచిత కోచింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తా
* అభ్యర్థులు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి : మంత్రి హరీష్‌రావు
సిద్దిపేట, ఫిబ్రవరి 21 : కష్టపడి పనిచేసేవారికి సమాజంలో మంచి గౌరవం ఉంటుందని, ఏ పని చేయాటానికైనా చిన్నతనం (నామోషి)గా భావించవద్దని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. అమెరిగా, సౌదీ, దుబాయి ఇతర దేశాలకు జీవనోపాధికి వెళ్లిన వారు రోజు వారిగా చాల చిన్నపనులు చేస్తారన్నాన్నారు. మంగళవారం సిద్దిపేట కొండ భూదేవి గార్డెన్‌లో జరిగిన మెగా జాబ్ మేళాను ప్రారంభించిన ఆనంతరం మాట్లాడారు. విద్యావంతులు సైతం ఒక పనిని చేస్తునే తమ స్థాయికి తగిన పనికి ఎదుగుతరన్నారు. వృత్తి పరంగా డిమాండ్ ఉన్న కోర్సులను అభ్యసిస్తే ఉపాధి, ఉద్యోగ అవకాశాలు దక్కుతాయన్నారు. సిద్దిపేటలో గతంలో నిర్వహించిన జాబ్ మేళాలో ఉద్యోగాలకు 80 శాతం ఎంపికైతే వారిలో 20 శాతం విధుల్లో చేరుతున్నారన్నారు. ఈవిషయంపై అభ్యర్థుల్లో ఫోన్ ద్వారా మాట్లాడితే తమ కుటుంబ సభ్యులకు దూరంగా ఉండలేమని, తమ స్థాయికి ఉద్యోగం కాదని చేరటానికి నిరాకరిస్తున్నట్లు తెలిసిందన్నారు. ఒక ఉద్యోగంలో చేరిన తర్వాత తమ స్థాయికి తగిన ఉద్యోగాన్ని సంపాధించటం సులభమవుతుందన్నారు. ఆత్మవిశ్వాసం, పట్టుదలతో కృషిచేస్తే ఏ కార్యక్రమమైన సంపూర్ణంగా విజయవంతమవుతుందన్నారు. సిద్దిపేట బహిరంగ మలరహిత జిల్లా మార్చేందుకు కృషిచేస్తే సాధ్యం కాదని అన్నారు, కాని పట్టుదలతో కృషిచేసి రాష్ట్రంలో సిద్దిపేట తోలి నియోజక వర్గంగా తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు. తడిచెత్త, పొత్త సేకరణలో సిద్దిపేట ఆదర్శంగా ఉందని, క్లీన్, గ్రీన్ సిటీగా త్వరలో తీర్చిదిద్దుతానన్నారు. సిద్దిపేటలో కానిస్టేబుల్, గ్రూపు- 2 అభ్యర్థులకు నాణ్యమైణ శిక్షణ ఇచ్చారని, వీరీలో 66 మంది కానిస్టేబుళ్లుగా ఎంపికైనట్లు పేర్కొన్నారు. 10వేల గురుకుల పాఠశాలల ల ఉపాధ్యాయుల పోస్టుల కోసం నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు. సిద్దిపేటలో నాణ్యమైణ ఉచిత కోచించ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. వేగవంతమైన అభివృద్ధి జరగుతుందని, అభ్యర్థులు అవకాశాన్ని అందిపుచ్చుకోవాలన్నారు. సిద్దిపేటలో మెగా జాబ్ మెళాలో 51 కంపెనీలు 4391 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారన్నారు. జాబ్ మెళాను సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి 3నెలలకో మారు జాబ్ మేళాను ఏర్పాటు చేసి, ఈప్రాంతంలో నిరుద్యోగ సమస్యను నివారించేందుకు కృషిచేస్తానన్నారు.
జాబ్ మేళాలో స్టాళ్లను పరిశీలించిన
మంత్రి హరీష్‌రావు
సిద్దిపేట మెగా జాబ్ మేళాలో వివిధ కంపెనీలు ఏర్పాటు చేసిన 51 స్టాళ్లను రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు పరిశీలించారు.

మహాశివరాత్రికి పకడ్బందీ ఏర్పాట్లు
* భక్తులు ప్రశాంతంగా దర్శించుకునేలా చర్యలు చేపట్టాలి * కనీస సౌకర్యాలు కల్పించాలి
* ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్ మాణిక్యరాజ్ సమీక్ష * ఆలయంలో ప్రత్యేక పూజలు
ఝరాసంగం, ఫిబ్రవరి 21: మహాశివరాత్రి సందర్భంగా శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయంలో అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని, భక్తులు ప్రశాంతంగా దర్శనం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ మాణిక్యరాజ్ కణ్ణన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం ఝరాసంగం కేతకి సంగమేశ్వర ఆలయంలో కలెక్టర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహాశివరాత్రి ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శివరాత్రికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చ అవకాశం ఉన్నందున వారికి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని సదుపాయాలు కల్పించాలన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా పోలీస్ శాఖ తగిన బందోబస్తు ఏర్పాటు చేయాలని, భక్తులు ప్రశాంతంగా దర్శించుకునేందుకు వీలుగా క్యూ పద్దతిని పాటించేలా చూడాలన్నారు. ఆర్‌అండ్‌బి, పోలీస్, దేవాదాయ శాఖ సమన్వయంతో భక్తుల సౌకర్యార్థం క్యూ, పార్కింగ్‌కు బారికేడ్లను ఏర్పాటు చేయాలని, తాగునీరు, మొబైల్ టాయిలెట్స్ అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఆలయ పరిసర ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు మూడు విడతలలో పారిశుద్ధ్య సిబ్బందిని ఏర్పాటు చేయాలని పంచాయతీ శాఖ అధికారులను ఆదేశించారు. దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఏదైన ఆరోగ్య సమస్య తలెత్తితే అందుబాటులో మెడికల్ క్యాంపులు, అంబులెన్స్‌లు ఉంచాలన్నారు. శివరాత్రి రద్దీలో పిల్లలు ఎవరైన తప్పిపోయినట్లయితే వారిని తల్లిదండ్రుల వద్దకు చేర్చేలా పబ్లిక్ అడ్రస్ సిస్టంను ఏర్పాటు చేసి అనౌన్స్‌మెంట్ చేయాలన్నారు. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని, మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ స్టాల్స్ ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. శివరాత్రి ఉత్సవాలను సజావుగా నిర్వహించేందుకు దేవాదాయ శాఖ అధికారులు ఇతర శాఖల అధికారులతో సమన్వయ పర్చుకొని అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అంతకు ముందు దేవాదాయ ఆవఖ అధికారులు పూర్ణకుంభంతో కలెక్టర్‌కు స్వాగతం పలికారు. ఈ సమీక్షలో జెసి వెంకటేశ్వర్లు, ఆర్డీఓ శ్రీనివాస్‌రెడ్డి, ఈఓ మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.

టోల్‌చార్జీలను తక్షణమే తగ్గించాలి
మాజీ ఎమ్మెల్యే కుర్రా సత్యనారాయణ
పటన్‌చెరు, ఫిబ్రవరి 21: పెంచిన టోల్ చార్జీలను తక్షణమే తగ్గించాలని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే కుర్రా సత్యనారాయణ డిమాండ్ చేసారు. ప్రయాణికుల ఇబ్బందులను ప్రభుత్వం గమనించాలన్నారు. బిజెపి ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక ఓఆర్‌ఆర్ టోల్‌ప్లాజా వద్ద ధర్నా నిర్వహించారు. టోల్‌ప్లాజా కారణంగా ఔటర్ రింగ్ రోడ్డు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. వారు ఉచితంగా ప్రయాణం సాగించడానికి పాసులు మంజూరు చేయాలన్నారు. టోల్‌ప్లాజాలో పనిచేయడానికి కేవలం స్థానికులకు మాత్రమే అవకాశం కల్పించాలని డిమాండ్ చేసారు. గ్రేటర్ హైద్రాబాద్ మహానగరానికి మణిహారంగా మారిన ఔటర్ రింగ్ రోడ్డు రహదాని నిర్మాణానికి అవసరమైన విలువైన భూములను దారాద్తతం చేసిన అన్నదాతలను ఆదుకోవాల్సిన కనీస భాద్యత ప్రభుత్వం ఉందని బిజెపి నాయకులు పలువురు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నరేందర్‌రెడ్డి, గాలివరాల వెంకటగిరి, ప్రధాన కార్యదర్శి ప్రతాప్‌రెడ్డి, నాయకులు ప్రభాకర్‌రెడ్డి, సాయిరెడ్డి, శ్రీనివాస్‌గుప్త, మహేందర్, చంద్రయ్య, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

సమీకృత వ్యవసాయంతోనే
అధిక లాభాలు
తూప్రాన్, ఫిబ్రవరి 21: రైతులు సమీకృత వ్యవసాయం ద్వారా అధిక లాబాలు వస్తాయని జిల్లా వ్యవసాయ కేంద్రం సహాయక సంచాలకులు బాబునాయక్ పేర్కొన్నారు. మండలంలోని మల్కాపూర్ తండాలో గిరిజన రైతులకు అవగాహన శిబిరంలో పాల్గొని ప్రసంగించారు. కొందరు రైతులు కలిసి గ్రూప్‌గా ఏర్పడి వ్యవసాయం చేయాలని అందుకు ప్రభుత్వం ట్రాక్టర్లు, పరికరాలు, విత్తనాలు సబ్సీడీపై అందజేజ్తుందని అన్నారు. కేవలం వ్యవసాయంపైనే ఆదారపడకుండా గేదెలు, ఆవులు, గొర్రెలు, కోళ్ళు, కూరగాయలు, పట్టుపరిశ్రమ, పట్టుపురుగుల పెంపకం మొదలగు వాటిని చూసుకోవాలని ప్రభుత్వం 50 శాతం సబ్సీడీపై అందజేస్తుందని చెప్పారు.
వ్యవసాయంలో నష్టం జరిగితే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఉపాది లబిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి ప్రతాప్, శాస్తవ్రేత ముకుందం, పశు వైద్యాధికారి సుద, సిబ్బంది సుదర్శన్, షేక్ అంబర్, కృష్ణమూర్తి, మజీర్, శ్రీదర్ తదితరులు పాల్గొన్నారు.