మెదక్

పేదోడి కల సాకారం దిశగా పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామాయంపేట, ఫిబ్రవరి 23: సొంతింటి నిర్మాణంతో పేదోడి కళ సాకారం దిశగా తెలంగాణ ప్రభుత్వం పాలన సాగిస్తుందని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కోన్నారు. గురువారం రామాయంపేట, నిజాంపేట మండలాల్లో పలు అభివృద్ది పనులకు శంఖుస్థాపనలు చేసేందుకు వచ్చిన సందర్బంగా రామాయంపేటలో విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది పనులను ఇతర రాష్ట్రాలు కూడా ప్రశంసిస్తున్నాయని తెలిపారు. అదే ప్రతిపక్షాలు మాత్రం తమ ఉనికిని కాపాడుకునేందుకు అబివృద్దిని అడ్డుకుంటున్నాయని అన్నారు. ప్రాజెక్ట్‌లు కట్టి రైతులకు నీరందించే ప్రయత్నం చేస్తుంటే ప్రతిపక్ష పార్టీలు ప్రాజెక్ట్‌ల నిర్మాణం చేపట్టవద్దంటూ ఆందోళన చేయడం సరికాదన్నారు. ప్రాజెక్ట్‌లు ఏమైనా ఆకాశంలో కడుతామా అని ప్రశ్నించారు. మిషన్ కాకతీయతో చెరువుల అభివృద్ది, మిషన్ భగీరతతో ఇంటింటికి తాగునీరు ఇస్తామని తెలిపారు. ప్రజలు, రైతుల కోసం తమ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. గత ప్రభుత్వాలు ఇళ్లు నిర్మించకున్నా బిల్లులు చెల్లించారని ఆరోపించారు. తమ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 14వందల డబుల్‌బెడ్‌రూం ఇళ్లు నిర్మించేందుకు శ్రీకారం చుట్టడం జరిగిందని వివరించారు. రామాయంపేట పట్టణానికి 3వందల ఇళ్లు మంజూరైనట్లు తెలిపారు. 13కోట్లతో రహదారుల విస్తరణ, 2.65లక్షల వ్యయంతో మినిస్టేడియం, ఎమ్మెల్యే నిదులతో 2.55లక్షలతో అన్ని గ్రామాల్లో 10లక్షలతో కమ్యూనిటి భవనాలు నిర్మాణం చేపడుతున్నామని వివరించారు. వ్యవసాయానికి నిరంతరంగా 9గంటలు విద్యుత్ అందిస్తున్నామన్నారు. వచ్చే ఏప్రెల్ నుండి పిఎఫ్ ఉన్న బీడి కార్మికులందరికి పించను ఇవ్వడానికి ముఖ్యమంత్రి అంగీకరించాడన్నారు. పట్టణ స్వర్ణకార భవనానికి నిదులు సరిపోలేదని ఆమె దృష్టికి సంఘ అద్యక్షుడు దామోదర్ తీసుకురాగ మరో ఐదులక్షలు మంజూరు ఇస్తామని హామి ఇచ్చారు. ఈకార్యక్రమంలో ఎంపిపి పుట్టి విజయలక్ష్మీయాదగిరి, జెడ్పీటిసి బిజ్జవిజయలక్ష్మీ, వైస్ ఎంపిపి జితెందర్‌గౌడ్, ఆత్మకమిటి చైర్మెన్ రమేష్‌రెడ్డి, నాయకులు పుట్టి యాదగిరి, అందెకొండల్‌రెడ్డి, బాదెచంద్రం, రాజుయాదవ్, కొండల్‌రెడ్డి, ఐలయ్య, పోచమ్మల శ్రీనివాస్, ఆకుల మహేశ్, బాలు, నాగేశ్వర్‌రెడ్డి, నవాత్‌కిరణ్, బాస్కర్‌రావు, సుదాకర్‌రెడ్డి, కిష్టారెడ్డి, వెంకటస్వామి, గడ్డిశ్యాంసుందర్, బన్సీలాల్, అక్కల సిద్దరాములు, ఏసుపాల్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.

సిపిఎస్ విధానం రద్దుచేసే వరకు ఊరుకోం
2న పార్లమెంట్‌ను ముట్టడిస్తాం
టిఎన్‌జిఓ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి
గజ్వేల్, ఫిబ్రవరి 23: ఉద్యోగ, ఉపాద్యాయులను ఆందోళనకు గురిచేసే సిపిఎస్ నూతన పెన్షన్ విధానంను ఎంత మాత్రం సహించేదిలేదని, పాత పెన్షన్ విధానం పునరుద్దరించే వరకు ఆందోళనలు తీవ్రతరం చేస్తామని తెలంగాణ ఎన్‌జిఓ సంఘం ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఉద్యోగ, ఉపాద్యాయులతో కలిసి పెద్ద ఎత్తున గజ్వేల్‌లో ర్యాలీ నిర్వహించడంతో పాటు చలోడిల్లీ పోస్టరు ఆవిష్కరించిన అనంతరం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నూతన పెన్షన్ విధానం అమలుతో లక్షలాది మంది ఉద్యోగులు తీవ్ర ఆవేదనకు గురవుతుండగా, ప్రభుత్వం మెడలు వంచైనా తమ లక్ష్యాన్ని నెరవేర్చుకుంటామని స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే మార్చి 2న చలోడిల్లీ నిర్వహించి లక్షలాది మంది ఉద్యోగ, ఉపాద్యాయులతో పార్లమెంటును ముట్టడిస్తామని హెచ్చరించారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల ఆదాయపన్ను పరిమితి రూ. 5లక్షలకు పెంచాలని, ప్రభుత్వ ఉద్యోగుల జీతబత్యాలను కేంద్రమే సమకూర్చాలని, కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఉద్యోగ, ఉపాద్యాయులు సంఘటితంగా ఉంటూ సమస్యల పరిష్కారంలో కలసిరావాలని, అందుకు భిన్నంగా వ్యవహరిస్తే నష్టపోయే ప్రమాదమున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో గజ్వేల్ శాఖ అధ్యక్షులు లింగం, జిల్లా కార్యదర్శి శ్యాంరావు, జిల్లా మాజీ అధ్యక్షులు రాజేశం, టిఎన్‌జిఓ సంఘం నేతలు మురళి, శ్రీదర్, శివ ప్రసాద్, శ్రీనివాస్, రమేశ్, విమల, లక్ష్మి, రజిత, శాంతి, తిరుపతిరెడ్డి, స్వామి, సందీప్ రెడ్డి, సతీశ్ తదితరులు పాల్గొన్నారు.

కెసిఆర్ అబద్ధాలకోరు
మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ
పటన్‌చెరు,్ఫబ్రవరి 23: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పచ్చి అబద్ధాల కోరని మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ విమర్శించారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమనడం ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు. పటన్‌చెరు పట్టణ శివారులోని గాయత్రి ఫంక్షన్‌హాలులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై జన అవేదన సమ్మేళనం పేరిట జరిగిన సభకు ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సంధర్బముగా మాట్లాడుతూ వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ సాగునీటి ప్రాజెక్టులు అత్యధికంగా నిర్మించింది కాంగ్రెస్ పార్టీ అని ఆయన స్పష్టం చేసారు. సింగూరు, మంజీరా, నాగార్జునసాగర్ తదితర ప్రాజెక్టులు కాంగ్రెస్ హయాంలోనే నిర్మించారనే విషయాన్ని కెసిఆర్ గుర్తిస్తే మంచిదన్నారు. మాయమాటలతో, గారడి చేష్టలతో తెలంగాణ ప్రజలను మరోసారి మోసగించడానికి సిద్ధమైన కెసిఆర్ ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ నాయకులపై అవాకులు, చెవాకులు పేలుతున్నారని దుయ్యబట్టారు. ప్రాజెక్టుల నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదని, ప్రాజెక్టుల పునరాకృతికి మాత్రమే వ్యతిరేకమన్నారు. నిలువనీడ లేని నిరుపేదలకు డబుల్ బెడ్‌రూంల ఇండ్లు నిర్మించి ఇస్తామని ప్రగల్భాలు పలికిన కెసిఆర్ అధికారం చేపట్టిన గత మూడు సంవత్సరాలలో ఎన్ని ఇండ్లు నిర్మించి ఇచ్చారో బహిర్గతం చేయాలని డిమాండు చేసారు. అమలుకు వీలు కాని హామీలను గుప్పించి అధికారం చేపట్టిన టిఆర్‌ఎస్ కేవలం ప్రకటనలతోనే కాలం వెళ్లదీస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్లు రద్దు చేసిన తరువాత నాలుగు రోజుల పాటు నోరు తెరవని కెసిఆర్ డిల్లీ పర్యటన అనంతరము ప్రధాని నరేంద్రమోడిని పొగడడంలో ఆంతర్యం ఏమిటని మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రశ్నించారు. మాజీ రాజ్యసభ సభ్యుడు హనుమంతరావు మాట్లాడుతూ పోలీసులు, మీడియా సహాయ సహకారాలతోనే టిఆర్‌ఎస్ ప్రభుత్వం మనుగడ సాగిస్తోందన్నారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పేరిట అధికార పార్టీ నాయకులు జరుపుతున్న భూసేకరణ పూర్తిగా చట్ట విరుద్ధమన్నారు. అది భూసేకరణ ఎంతమాత్రము కాదని అధికార పార్టీ భూ కొనుగోల్లుగా ఆయన అభివర్ణించారు. మాజీ ప్రభుత్వ విప్ తూర్పు జయప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ అధికారాన్ని అడ్డం పెట్టుకుని టిఆర్‌ఎస్ పార్టీ సాగిస్తున్న అరాచకాలకు త్వరలోనే అడ్డుకట్ట పడుతుందన్నారు. ప్రజలే వారికి తగిన రీతిలో గుణపాఠం చెపుతారన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది కేవలం కాంగ్రెస్ అధినాయకురాలు సోనియాగాంధి మూలంగానే అనే విషయం ఈ ప్రాంత ప్రజలకు తెలుసునన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు వాకిట సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కళ్లబొల్లి కబుర్లతో కాలం వెళ్ల దీస్తున్న టిఆర్‌ఎస్ అమాయకులైన తెలంగాణ ప్రజలను అనేక రకాలుగా మోసం చేస్తోందన్నారు.

ఓం నమః శివాయ
శివరాత్రి వేడుకలకు శివాలయాలు సిద్ధం * కేతకి, ఏడుపాయలకు పోటెత్తనున్న భక్తజనం
* ప్రత్యేక బస్సులను నడుపుతున్న ఆర్టీసీ

సంగారెడ్డి, ఫిబ్రవరి 23: మహాశివరాత్రి పర్వదిన వేడుకలను భక్తిశ్రద్దలతో నిర్వహించుకోవడానికి శివ భక్తులు సర్వం సిద్దం చేసుకున్నారు. ప్రధానంగా పట్టణాలు, పల్లెసీమల్లోని శివాలయాలన్ని వేడుకలకు ముస్తాబయ్యాయి. సంగారెడ్డి జిల్లా పరిధిలోని ఝరాసంగం కేతకి సంగమేశ్వర ఆలయంలో ఉత్సవాలు ప్రారంభం కానుండగా తెలంగాణాకే తలమానికంగా నిలుస్తూ లక్షలాది మంది భక్తులకు కొంగు బంగారంలా విలసిల్లుతున్న ఏడుపాయల వనదుర్గామాత ఉత్సవాలు శివరాత్రి రోజున ప్రారంభం కానున్నాయి. దక్షిణ కాశీగా ఖ్యాతిగాంచిన కేతకి సంగమేశ్వర స్వామి జాతర ఉత్సవాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్నాటక, మహారాష్టల్ర నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామి వారిని సేవించనున్నారు. ఆలయ అధికారులు ఏర్పాట్లను చేసి ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. మూడు రోజుల పాటు కొనసాగే ఏడుపాయల జాతరకు హైదరాబాద్‌తో పాటు ఉమ్మడి మెదక్ జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ఆర్టీసి అధికారులు ప్రత్యేకంగా బస్సులను నడిపిస్తున్నారు. భక్తజనం పోటెత్తే అవకాశం ఉండటం, ఘన్‌పూర్ ప్రాజెక్టులో సంవృద్దిగా నీరు ఉండటంతో ఆలయ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. భక్తులు పుణ్య స్నానాలు ఆచరించే ప్రాంతాల్లో గజ ఈతగాళ్లను సిద్దంగా ఉంచడమే కాకుండా పలు సూచనలు చేస్తున్నారు. ఎండ తీవ్రత పెరుగుతుండటంతో సాధ్యమైన మేరకు భక్తులకు నీడకల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఈ రెండు ప్రధాన ఆలయాలే కాకుండా సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, సదాశివపేట, పటన్‌చెరు, జహీరాబాద్, తూప్రాన్, రామాయంపేట, దుబ్బాక, చేగుంట, నారాయణఖేడ్, జోగిపేట, నర్సాపూర్ తదితర పట్టణాలు, మండల కేంద్రాల్లోని ప్రధాన శివాలయాల్లో మహాశివరాత్రి వేడుకలు నేత్రపర్వంగా కొనసాగనున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరాహారంతో శివ ధ్యానం చేసి సాయంత్రం ఉపవాస దీక్షలను విరమించనున్నారు. సాయంకాలం శివాలయానికి వెళ్లి ఉపవాస దీక్షలను విరమించనున్న నేపథ్యంలో ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఉపవాస దీక్షలు విరమించే భక్తులు సాధ్యమైనంత మేరకు రాత్రి సమయంలో నిద్రపోకుండా జాగారం చేయడం పరిపాటి. ఈ నేపథ్యంలో శివాలయాల్లో ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. కొన్ని మందిరాల్లో ప్రత్యేకంగా టివిలను ఏర్పాటు చేసి భక్తి సినిమాల ప్రదర్శన, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలను భక్తులకు తిలకింపజేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. పటన్‌చెరు మండలం బీరంగూడలోని మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు వేల సంఖ్యలో పోటెత్తనున్నారు. సిద్దిపేట పట్టణానికి ప్రధాన ఆకర్షణగా నిలిచే కోటిలింగాల మందిరానికి కూడా వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చి శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. కోహీర్ మండలం బడంపేటలోని రాచన్న స్వామి ఆలయంలో కూడా ప్రత్యేకంగా ఉత్సవాలను నిర్వహించనున్నరు. జిన్నారం మండలం బొంతపల్లి వీరభద్ర స్వామి ఆలయానికి కూడా భక్తులు ఎక్కువ సంఖ్యలో తరలివచ్చి శివరాత్రి సందర్భంగా చేపట్టే ఉపవాస దీక్షలను విరమించనున్నారు. పెద్దశంకరంపేట మండలం కొప్పోల్ సంగమేశ్వర స్వామి జాతర ఉత్సవాలకు పరిసర ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామి వారి సేవలో నిమగ్నం కానున్నారు. దేవాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో ఆయా మందిరాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఏడుపాయల, కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయాల జాతరను దృష్టిలో పెట్టుకుని పోలీసులు ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేసారు. ఏడుపాయల్లో ప్రధాన కూడళ్ల వద్ద సిసి కెమెరాలను అమర్చి నిఘాను పటిష్టపరిచారు. అసాంఘిక శక్తులపై ఎప్పటికప్పుడు ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేసి జాతర ఉత్సవాలు ప్రశాంతంగా ముగించేందుకు మెదక్ కలెక్టర్, ఎస్పీలు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. కేతకి సంగమేశ్వర స్వామి ఉత్సవాలపై సంగారెడ్డి ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి పర్యవేక్షణలో జహీరాబాద్ డిఎస్పీ నల్లమల రవి బందోబస్తును సమీక్షిస్తున్నారు. నగరానికి అత్యంత చేరువలో ఉన్న వర్గల్ సరస్వతి దేవి ఆలయానికి కూడా భక్తులు తరలివచ్చి మాతా కటాక్షం కోసం ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. సిద్దిపేట జిల్లాలో అంతర్భాగమైన కొమురవెల్లి మల్లన్న స్వామి ఆలయానికి భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. ఊరు, వాడ, పల్లె, పట్టణం అనే తేడా లేకుండా అన్ని గ్రామాల్లో శివనామ స్మరణతో మారుమ్రోగనున్నాయని చెప్పవచ్చు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో రెండవదిగా వెలసిన శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనానికి శివ దీక్షలు స్వీకరించిన స్వాములంతా పెద్ద ఎత్తున తరలివెళుతున్నారు. స్వామి వారికి ఇరుముడిని సమర్పించి శివరాత్రి పర్వదినం రోజు అర్ధరాత్రి దీక్షలను విరమించనున్నారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి కూడా ఈ ప్రాంతం నుంచి భక్తులు ఎక్కువ సంఖ్యలో తరలివెళుతున్నారు. ఈ నేపథ్యంలో సిద్దిపేట నుంచి ప్రత్యేకంగా బస్సులు నిడిపించనున్నారు.

విద్యాసంస్థల బంద్ విజయవంతం
గజ్వేల్, ఫిబ్రవరి 23: రాజకీయ జెఏసి చైర్మెన్ ఆచార్య కోదండరాం అరెస్టు కు నిరసనగా ఓయూ జెఏసి ఇచ్చిన పిలుపుమేరకు గురువారం గజ్వేల్‌లో బంద్ విజయవంతమైంది. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు మూసివేయడం తో పాటు పట్టణంలో ర్యాలీ నిర్వహించి ఆర్డీఓ కార్యాలయంలోవినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా టిఎన్‌ఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షులు బూమయ్యయాదవ్, యూత్ కాంగ్రెస్ గజ్వేల్ నియోజకవర్గ అధ్యక్షులు బానుప్రకాశ్‌రావు మాట్లాడుతూ ఉద్యమంలో కోదండరాంను ఆకాశానికి ఎత్తుకున్న సిఎం కెసిఆర్ ప్రస్థుతం ఇచ్చిన హామీల అమలుకు వత్తడి తెస్తున్న జెఏసి చైర్మెన్ కోదండరాంపై కుట్రలు పన్నుతుండడం సిగ్గుచేటని నిలదీశారు. అయితే ఇంటి తలుపులు ద్వంసం చేసి ఆయనను అరెస్టు చేయడం ద్వారా రాష్ట్రం లో పోలీసుపాలన, నియంతృత్వ పోకడలకు నిదర్శనంగా నిలుస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా రాష్ట్రంలో సిఎం కెసిఆర్ కుటుంబ సభ్యులకు మినహా మంత్రులు, ఎమ్మెల్యేలకు స్వేచ్చలేదని, సీనియర్ మంత్రులకు సైతం అపాయింట్‌మెంట్ ఇవ్వని సంఘటనలు ఎన్నో జరిగినట్లు చెప్పారు. కాగా ఎన్నికల సందర్బంగా ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేవరకు ప్రజలతో కలిసి పోరాటం చేస్తామని, అరచేతిలో వైకుంఠం చూపడం మాని ప్రజాగ్రహానికి గురికాక ముందే సిఎం కెసిఆర్ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని, దళితులకు మూడెకరాల భూపంపిణి చేపట్టాలని, రాష్ట్రంలో డబల్‌బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం జరగాలని, రైతులకు ఏకకాలంలో పంట రుణమాఫీ వర్తింప జేయాలని డిమాండ్ చేశారు.
ఉరితాళ్లతో విద్యార్థి సంఘాల నిరసన
సిద్దిపేట టౌన్: రాష్ట్రంలో పరిపాలన నిరుద్యోగుల పాలిట శాపంగా మారిందని, ఉద్యోగాలడిగితే ఉరేస్తానన్న చందంగా పాలన సాగుతుందని ఏఐఎస్‌ఎఫ్, ఏఐవైఎఫ్ నేతలు అన్నారు. నిరుద్యోగ యువత ర్యాలీని అడ్డుకొని అరెస్టు చేయడాన్ని నిరసిస్తు గురువారం సిద్దిపేట అంబేద్కర్ చౌరస్తాలో మెడకు ఉరితాళ్లతో నిరసన తెలిపారు. నాయకులు కుమార్, శంకర్ మాట్లాడుతూ కెసిఆర్ పాలన నిరుద్యోగుల పాలిట శాపంగా మారిందన్నారు. నియామకాలు జరపాలని శాంతియుతంగా నిరసన తెలిపినవారిని అక్రమంగా అరెస్టు చేసిన పోలీసుల దమనకాండను వ్యతిరేకిస్తున్నామన్నారు. దమనకాండతో అణచివేస్తున్న విద్యార్థులు, యువత, ప్రజానీకం ఏకమై ప్రభుత్వానికి సమాధి కట్టే రోజులు దగ్గరున్నాయని హెచ్చరించారు.

వైద్యులు, సిబ్బంది పద్ధతి మార్చుకోవాలి
ఆసుపత్రి తనిఖీలో మంత్రి హరీష్‌రావు
సిద్దిపేట, ఫిబ్రవరి 23: సిద్దిపేట ప్రభుత్వాసుపత్రిని గురువారం ఉదయం మంత్రి హరీష్‌రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో రోగులతో మాట్లాడి వైద్యసేవలు అడిగి తెలుసుకున్నారు. రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహిస్తున్న డాక్టర్లు, సిబ్బంది పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి ఆస్పత్రిలోని మందులు బయటనుంచి కొనుగోలు చేసినట్లు ఉండడం వల్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. మందులు ఎందుకు కొనడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో నమ్మకంతో దవాఖానకు వచ్చే పేదల పట్ల వైద్యులు నిర్లక్ష్యం పట్ల అసహనం వ్యక్తం చేశారు. వైద్యుల నిర్లక్ష్యం వల్ల బాబు చనిపోయాడని కొండపాకకు చెందిన జోజిరెడ్డి మంత్రికి ఫిర్యాదు చేశారు.
డాక్టర్‌తో కాకుండా ఒకరిగా పోయి రోగులతో మాట్లాడితే వాస్తవాలు తెలుస్తాయని చెప్పడంతో లేబర్ రూంలోకి పోయి రోగులతో మాట్లాడి వైద్యసేవల పై చర్చించారు. సేవల నిర్లక్ష్యం పట్ల అసహనం వ్యక్తం చేశారు. 4రోజులుగా వార్డులో నీటి సరఫరా జరగడం లేదని తెలిసి మంత్రి ఆశ్చర్యపోయారు. వాటర్ సిబ్బంది పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్టాక్ రిజిష్టర్ మెయంటెయన్ చేయకపోవడంపై ఫార్మసిస్టును తొలగించాలని ఆదేశించారు.