మెదక్

టిఆర్‌ఎస్‌కు గుణపాఠం చెప్పాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, ఫిబ్రవరి 24 : సిద్దిపేట జిల్లాలో జరిగే స్థానిక సంస్థల ఉప ఎన్నికలను బిజెపి పార్టీ కైవసం చేసుకుంటుందని బిజెపి జిల్లా అధ్యక్షుడు నాయిని నరోత్తంరెడ్డి అన్నారు. శుక్రవారం బిజెపి కార్యాలయంలో టిడిపి నేత, పిఎసిఎస్ డైరెక్టర్ గోపినాథ్‌రెడ్డి నరోత్తంరెడ్డి సమక్షంలో బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వనించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్దిపేట మండలం పుల్లూరు ఎంపిటిసి, గజ్వేల్ మున్సిపల్ కౌన్సిలర్, సర్పంచ్, వార్డు సభ్యుల ఉప ఎన్నికల్లో బిజెపి పార్టీ హావా కొనసాగుతుందన్నారు. గత ఎన్నికల్లో టిఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నేరవేర్చలేదని ప్రజలు గమనించాలన్నారు. డబ్బా ఇళ్లు వద్దని, డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మిస్తానని పేదలకు స్పష్టమైన హామీనిచ్చి ఎందుకు విస్మరించారన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లనిర్మాణంపై గ్రామాలకు వచ్చె టిఆర్‌ఎస్ నేతలను నిలదీయాలని పిలుపునిచ్చారు. సిఎం కెసిఆర్ వాస్తు దోషం పేరుతో 30 కోట్లతో ఇంటిని నిర్మించారన్నారు. ఎన్ని గ్రామాల్లో డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించారో స్పష్టం చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం పేదలకు 98.500 ఇళ్లు నిర్మించాలని 1200 కోట్లు మంజూరు చేస్తే ఏ గ్రామంలో నిర్మించలేదన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలు జరగుతున్నాయని చెపుతున్న మంత్రి హరీష్‌రావు ఏ గ్రామంలో డబుల్ బెడ్‌రూం ఇళ్ల కోసం లబ్ధిదారులను ఎంపిక చేశారో స్పష్టం చేయాలన్నారు. ఎన్నికల ముందు లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన టిఆర్‌ఎన్ నేతలు నిరుద్యోగ సమస్యను గాలికి వదిలివేశారన్నారు. ఉద్యోగాలను భర్తీ చేయకుండ తన ఇంటిలో ఉద్యోగాలను భర్తీ చేసుకున్నారని విమర్శించారు. నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం జెఎసి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ ప్రకటిస్తే ప్రభుత్వం పోలీసులచే దౌర్జన్యంగా అడ్డుకుందన్నారు. పోలీసులు అర్థరాత్రి ఇంటి తలపులు బద్దలు కొట్టి కోదండరామ్‌ను అరెస్టు చేయటం అమానుషమన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వం ఇలాగే ప్రవర్తిస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా అని ప్రశ్నించారు. నిరుద్యోగుల ఉసురు పోసుకోవటం ప్రభుత్వానికి తగదన్నారు. సిద్దిపేట జిల్లాలో అభివృద్ధి కంటే వేగంగా అవినీతి పెచ్చులురుతుందని ఆరోపించారు. టిఆర్‌ఎస్ నేతలు అధికారుల అండతో పెద్దఎత్తున అవినీతికి తెరలేపారన్నారు. ప్రజా కంటక పాలన సాగిస్తున్న టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలన్నారు. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో బిజెపి పార్టీకి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లాలో బిజెపి పార్టీని బలీయమైన శక్తిగా తీర్చిదిద్దుతామన్నారు. ఈసమావేశంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మోహన్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు పత్రి శ్రీనివాస్, రమేశ్, తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.