మెదక్

కేతకిలో మార్మోగిన పంచాక్షరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఝరాసంగం, ఫిబ్రవరి 24: మహా శివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని శ్రీ కేతకి సంగమేశ్వర ఆలయం శివనామస్మరణతో మార్మోగింది. శుక్రవారం వివిధ ప్రాంతాల నుండి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. జాయింట్ కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ఉదయం మొదటి అభిషేకం చేసి ఉత్సవాన్ని ప్రారంభించారు. వేలాది సంఖ్యలో భక్తులు పాదయాత్రగా తరలివచ్చి సంగమేశ్వరుడిని దర్శించుకున్నారు. ప్రత్యేక దర్శనం, దైవ దర్శనంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఆర్టీసి బస్సులను నడిపారు.
ప్రత్యేక పూజలు
మహా శివరాత్రి సందర్భంగా డిప్యూటి స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు బిబి పాటిల్, ఎమ్మెల్సీ ఫరీదోద్దీన్‌లు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటి స్పీకర్ స్వామివారికి, అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించారు. కార్యక్రమంలో జహీరాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ లావణ్య చందు, విజయ్‌కుమార్, జహీరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ డి.లక్ష్మారెడ్డి, ఆలయ ఈఓ మోహన్‌రెడ్డి, డిఎస్పీ నల్లమల రవి, సిఐ రఘు తదితరులు పాల్గొన్నారు.