మెదక్

కన్నుల పండువగా సంగమేశుడి కల్యాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఝరాసంగం, ఫిబ్రవరి 26: మహాశివ రాత్రి బ్రహోత్సవాల్లో భాగంగా శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి కల్యాణోత్సవాన్ని ఆదివారం కన్నుల పండువగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోర్చణల మధ్య స్వామి వారి కల్యాణం కమనీయంగా జరిగింది. కర్నాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి మహోత్సవంలో పాల్గొన్నారు. అమావాస్య కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జహీరాబాద్ డిఎస్పీ నల్లమల రవి, సిఐ రఘులు పకడ్బందీ బందోబస్తు నిర్వహించి అక్రమ మార్గాన దర్శనానికి వెళ్లకుండ చూసారు. ఆలయ ఎఓ మోహన్‌రెడ్డి పర్యవేక్షణలో దంపతుల మద్య కళ్యాణాన్ని కమనీయంగా నిర్వహించారు. కళ్యాణోత్సవ అనంతరం పార్వతి పరమేశ్వరుల ఉత్సవ విగ్రహాలను పల్లకిలో ఊరేగించారు. వివిధ ప్రాంతాల నుండి తరలి వచ్చిన భక్తులు స్వామి వారి రథాన్ని లాగారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రుద్రప్పపాటిల్, జెడ్పీటిసి సునీత హన్మంత్‌రావుపాటిల్, మాజీ చైర్మన్ షెట్కార్ మాణయ్య తదితరులు పాల్గొన్నారు.

పరీక్షల్లో విద్యార్థులు సమయపాలన పాటించాలి
* ప్రిన్సిపాల్ అసోసియన్ రాష్ట్ర అధ్యక్షుడు కెప్టెన్ అంజాగౌడ్
మెదక్, ఫిబ్రవరి 26: ఇంటర్మీడియట్ పరీక్షలలో సమయపాలన పాటించాలని ప్రిన్సిపాల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కెప్టెన్ అంజాగౌడ్ తెలిపారు. ఆదివారం మెదక్ బాలికల జూనియర్ కళాశాల ఆవరణలో జరిగిన సిఎస్‌డిఓ సమావేశంలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రసంగించారు. పరీక్షలు జరిగేప్పుడు ఎలాంటి ఒడిదుడుకులకు లోనుకాకూడదని ఆయన తెలిపారు. జిల్లాలు మారాయి, పర్యవేక్షకులు మారారు, అంతేగానీ మనకు మెదక్ జిల్లా పాతదేని ఆయన తెలిపారు. సిఎస్‌డిఓలకు ఎలాంటి మార్పు లేదన్నారు. 8వ రోజున జరగాల్సిన పరీక్ష 19వ తారీఖున మార్చడం జరిగిందన్నారు. జిల్లాలో మొత్తం కళాశాలలు 50 ఉన్నట్లు ఆయన తెలిపారు. పరీక్ష కేంద్రాలు 29 ఉన్నాయని, అందులో ప్రభుత్వ కళాశాలలు 13, ఎయిడెడ్ కళాశాల 1, సాంఘిక సంక్షేమ కళాశాలలు రెండు, ప్రైవేటు కళాశాలలు 13, ఇందులో ఒకేషనల్ విద్యార్థులు ఆరు కేంద్రాల్లో పరీక్షలు రాస్తారని ఆయన తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్ష జరుగుతుందని అంజాగౌడ్ తెలిపారు. మొదటి సంవత్సరం విద్యార్థులు 8940 మంది ఉన్నారని రెండవ సంవత్సరం విద్యార్థులు 9005 మంది, ప్రైవేటు విద్యార్థులు 2318, మొత్తం 20263 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. ఈ పరీక్షలకు చీఫ్ సూపరిండెంట్‌లు 29 మంది, డిపార్ట్‌మెంటల్ అధికారులు 29, సిటింగ్ స్వ్కాడ్, ఫ్లైయింగ్ స్వ్కాడ్‌లను నియమించి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. విద్యార్థులు తప్పనిసరిగా 8:15 నిమిషాలకు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, 9 గంటల తరువాత ఎవ్వరిని కూడా అనుమతించడం జరగదన్నారు. ఈ కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ డాక్టర్ నర్సింలు, జిల్లా జోనల్ కమిటి సూర్య ప్రభాకర్, కె.శశిధర్, రాష్ట్ర జూనియర్ లెక్చరర్ కృష్ణకుమార్, వెంకటేశంలు పాల్గొన్నారు.