మెదక్

భూ కుంభకోణాలపై బహిరంగ విచారణకు సిద్ధం కావాలి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సాపూర్,్ఫబ్రవరి 27: నర్సాపూర్ మండలంలో జరుగిన భూ కుంభకోణాలపై బహిరంగ విచారణకై పదవులకు రాజీనామా చేసి రావాలని కాంగ్రెస్ నాయకులు సవాల్ విసిరారు. సోమవారంనాడు నర్సాపూర్‌లోని గాంధీ విగ్రహాం సాక్షిగా తాము టిఆర్‌ఎస్ నాయకులు చేసిన సవాల్‌ను స్వీకరించి వచ్చినప్పటికి వారు గైర్హాజరయ్యారని ఆరోపించారు. ఈసందర్భంగా కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి ఆంజనేయులుగౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు మల్లేశ్, నాయకులు సత్యంగౌడ్, నయిం, రాజేష్, ఆంజనేయులుగౌడ్, రవి, మహమ్మద్, ముంతాజ్, ఆంజనేయులుగౌడ్ మాట్లాడుతూ టిఆర్‌ఎస్ నాయకులకు దమ్ము, దైర్యం ఉంటే అభివృద్ధిపై గాని భూ కుంభకోణాలపై గాని రికార్డులతో సహా నిరూపించడానికి తాము సిద్ధంగా ఉన్నమని కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు. టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు మురళీయాదవ్ తన పదవికి రాజీనామా చేసి భూ కుంభకోణాలపై విచారణకు సిద్ధపడాలని లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. భీనామీల పేరిట దర్మారం భూములను కజ్జా చేసిన వైనాన్ని వెలుగులోకి తీసుకువస్తామని అన్నారు. ఐబి భూమి కబ్జా, చైతన్యభారతీ భూమి వ్యవహారంతో పాటు పలు గ్రామాల్లో పోరంబోకు భూములను విక్రయించిన వైనాన్ని పూర్తి స్థాయిలో రికార్డులు తీసుకొని అవసరమైతే సిఎం కెసిఆర్‌కు పూర్తి ఆధారాలతో నివేధిక అందిస్తామని అన్నారు. పార్టీని అడ్డంపెట్టుకొని సాగిస్తున్న భూ భాగోతాన్ని వెలుగులోకి తీసుకువచ్చి ఆందోళనకు సిద్ధం అవుతామని అన్నారు. అభివృద్ధిపై ఈనెల 27న చర్చకు సిద్దమని ప్రకటించిన టిఆర్‌ఎస్ నేతలు ఎక్కడ అని నిలదీశారు. తాము చెప్పిన మాటలకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.
చర్చలంటూ నేతల హడావుడి
నర్సాపూర్ అభివృద్ధిపై కాంగ్రెస్ వర్సెస్ అధికార పార్టీ టిఆర్‌ఎస్ నేతల మధ్య వాడివేడిగా సాగిన మాటల యుద్ధం చర్చల ద్వారా బహిర్గతం కానుందని అనుకున్నప్పటికీ నాటకీయ పరిణామాల నడుమ టిఆర్‌ఎస్ పార్టీ నేతలు మాత్రం అసలు సమయానికి గైర్హాజర్ అయ్యారు. గత కొంతకాలంగా కాంగ్రెస్, టిఆర్‌ఎస్ నాయకుల మధ్య తీవ్రమైన వాగ్యుద్ధ్యం సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి జిల్లా పార్టీ అధికార ప్రతినిధి ఆంజనేయులుగౌడ్, నయిం తదితరులు పెద్ధ ఎత్తున భూ కబ్జాలపై జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, తహశీల్దార్‌లకు వినతిపత్రాలు అందించారు. దాంతో మండలంలో భూ కబ్జాల వ్యవహారంపై పెద్ద దుమారం రేగుతోంది. ఏ మలుపు తిప్పనుందో వేచిచూడాల్సిందే..