మెదక్

అక్షరాస్యతతోనే మహిళాభ్యుదయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, ఫిబ్రవరి 27: పొదుపు రంగంలో సమాజానికి దిక్సూచిగా నిలుస్తున్న డ్వాక్రా సంఘాల మహిళలంతా అదే తరహాలో అక్షరాస్యతను సాధించేందుకు కృషి చేయాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ మాణిక్యరాజ్ కణ్ణన్ ఉద్బోదించారు. వచ్చే నాలుగు మాసాల్లో స్వయం సహాయక సంఘాల మహిళలంతా అక్షరాస్యులు కావాలని ఆయన ఆకాంక్షించారు. సోమవారం డిఆర్‌డిఎ పాత కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా సమైఖ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సుమారు 1.80 లక్షల మంది స్వయం సహాయక సంఘాల సభ్యులు ఉన్నారని పేర్కొన్నారు. 60 వేల మంది మహిళలు మాత్రమే అక్షరాస్యులుగా ఉన్నారని, మిగిలిన వారిని కూడా అక్షరాస్యులు చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేసారు. నిరక్షరాస్యులైన మహిళా సభ్యులంతా చదవడం, వ్రాయడం వచ్చేలా శిక్షణ పొందాలని సూచించారు. సంఘంలో కనీస అక్షర పరిజ్ఞానం ఉన్న మహిళా సభ్యులు మిగిలిన వారికి అక్షరాలు నేర్పించాలని సంఘంలో ప్రతి ఒక్కరు చదవడం, వ్రాయడం వచ్చేలా చూడాల్సిన బాధ్యత సంఘం అధ్యక్షురాలిపై ఉంటుందన్నారు. వచ్చే నెల మొదటి వారం నుంచి మహిళా సంఘం సభ్యులకు ఆయా సంఘాల వారు రోజుకు ఐదు అక్షరాలు నేర్పించాలన్నారు. మహిళలంతా అక్షరాభ్యాసం పూర్తి అయిన అనంతరం సాక్షర భారత్ వారు పుస్తకం ఇచ్చి పరిశీలిస్తారని కలెక్టర్ తెలిపారు. రోజుకు ఐదు అక్షరాల చొప్పున రెండు వారాల్లో అక్షర మాలను పూర్తి చేయాలన్నారు. అక్షరాభ్యాసానికి అవసరమైన సామాగ్రిని సంబంధిత ఎపిఎంలు సమకూర్చుతారన్నారు. ఈ కార్యక్రమంలో జెసి వెంకటేశ్వర్లు, డిఆర్‌డిఓ అరుణ, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

శ్రీ మల్లికార్జున క్షేత్ర అభివృద్ధికి కృషి
మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి హామీ
గజ్వేల్, ఫిబ్రవరి 27: వర్గల్ మండల కేంద్రంలోని శ్రీ మల్లికార్జున క్షేత్ర అభివృద్ధికి కృషి చేస్తానని మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం జాతర ఉత్సవాల్లో భాగంగా ఆలయాన్ని దర్శించడంతోపాటు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడారు. పురాతన క్షేత్రాల అభివృద్ధికి సిఎం కెసిఆర్ దృష్టి సారిస్తూ నియోజకవర్గ పరిధిలోని 11 ఆలయాలకు రూ. 6కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. అయితే మల్లన్న క్షేత్ర అభివృద్ధికి సైతం నిధులు కేటాయించేలా చూడడంతోపాటు సిసి రోడ్లు, తాగునీటి వసతులను కల్పించనున్నట్లు పేర్కొన్నారు. కాగా మొదటగా ఆలయ నిర్వాహకులు ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి, టిఆర్‌ఎస్ అధ్యక్షుడు మురళీధర్ యాదవ్, డిసిసిబి చైర్మెన్ చిట్టి దేవేందర్‌రెడ్డిలను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మెన్ టేకులపల్లి రాంరెడ్డి, నేతలు బాల్‌రెడ్డి, కనకయ్య, బాలు యాదవ్, బిక్షపతి యాదవ్, స్వామి యాదవ్, శ్రీశైలం యాదవ్, యాదయ్య యాదవ్, ఐలం యాదవ్, పెద్ద గొల్ల సత్తయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.