మెదక్

ముగిసిన ఏడుపాయల జాతర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాపన్నపేట, ఫిబ్రవరి 27: ఏడుపాయలలో నిర్వహించిన మహా శివరాత్రి జాతర ఉత్సవాలు ఘనంగా ముగిశాయ. సోమవారం పెద్దసంఖ్యలో భక్తులు వనదుర్గామాత అమ్మవారిని దర్శించుకున్నారు. కాగా జాతరలో భక్తులు సమర్పించిన హుండీ కానుకల లెక్కింపు సోమవారం జరిగింది. హుండీ ఆదాయం రూ.16 లక్షల 94 వేల 516 రుపాయలని లెక్కతేల్చారు. ఏడుపాయల్లోని గోకుల్ షెడ్‌లో మెదక్ ఆర్డీఓ మెంచు నగేష్, ఏడుపాయల జాతర చీఫ్ ఫెస్టివల్ అధికారి సుధాకర్ రెడ్డి, దేవాదాయ శాఖ ఇన్స్‌పెక్టర్ శివరాజ్, ఆలయ ఈఓ వెంకటకిషన్‌రావు ఆధ్వర్యంలో అమ్మవారి హుండీని లెక్కించారు. హుండీ లెక్కింపు కార్యక్రమంలో మెదక్ పట్టణానికి చెందిన సత్యసాయి సేవా సమితి సభ్యులు పాపన్నపేట మండల రెవెన్యూ ఇన్స్‌పెక్టర్ జనార్దన్, ఆలయ ఈఓ వెంకటకిషన్‌రావు, పాపన్నపేట ఎస్సై సందీప్‌రెడ్డి, ఆలయ సిబ్బంది చల్లా గోపాల్, జెన్న రవికుమార్, సారా శ్రీనివాస్, సిద్దిపేట శ్రీనివాస్, సూర్య శ్రీనివాస్, మధుసూదన్‌రెడ్డి, లక్ష్మీనారాయణ, ప్రతాప్‌రెడ్డి, శ్రీనివాస్‌శర్మ, ఆలయ పూజారులు నర్సింహ్మాచారి, ఆర్.శంకర్‌శర్మ తదితర సిబ్బంది పాల్గొన్నారు.

మోసగించడంలో ఇద్దరూ ఇద్దరే

మోదీ, కెసిఆర్‌పై మాజీ మంత్రులు గీతారెడ్డి, సునీతాలక్ష్మారెడ్డి ధ్వజం హామీల అమలు ముందా...మొక్కులు ముందా అని నిలదీత ధరలు నియంత్రించడంలో విఫలమయ్యారని విమర్శ
రిజర్వేషన్ల పేరుతో మభ్యపెట్టొద్దని హితవు ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టాలని కార్యకర్తలకు పిలుపు

సంగారెడ్డి టౌన్, ఫిబ్రవరి 27: ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీనీ నెరవేర్చకుండా కేంద్రంలో ప్రధాని మోదీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రజలను మోసగిస్తున్నారని మాజీ మంత్రి, జహీరాబాద్ ఎమ్మెల్యే గీతారెడ్డి, మాజీ మంత్రి, ఉమ్మడి జిల్లాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సునీతాలక్ష్మారెడ్డి, మాజీ ప్రభుత్వ విప్ జగ్గారెడ్డిలు ధ్వజమెత్తారు. సోమవారం సంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జన ఆవేదన సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా గీతారెడ్డి మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక విధానాల అమలులో కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసిఆర్ ఇద్దరు ఇద్దరేనని ఎద్ద్దేవా చేశారు. నల్లధనాన్ని తీసుకొచ్చి నిరుపేదల బ్యాంకు ఖాతాల్లో రూ.15లక్షల చొప్పున జమ చేస్తానని ఆశచూపి గద్దేనెక్కారని విమర్శించారు. 100 రోజుల్లో నిత్యావసరాల ధరలను నియంత్రిస్తానన్న మోదీ మాట ఏమైందని, ప్రపంచ దేశాల్లో ఇందన ధరలు తగ్గిన మన దేశంలో ఎందుకు తగ్గడం లేదని ప్రశ్నించారు. ఏకపక్ష నిర్ణయంతో నోట్లను రద్దు చేసి ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేసారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ సాధ్యంకాని రిజర్వేషన్లను ప్రకటిస్తూ ప్రజలను మోసం చేసే ప్రయత్నాలు మానుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు ముందా... దేవుళ్ల మొక్కులు ముందా అని ప్రశ్నించారు. సునీతాలక్ష్మారెడ్డి మాట్లాడుతూ బిజెపి అధికారంలోకి వచ్చి మూడేళ్లు, టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తవుతున్నా ఇచ్చిన ఏ ఒక్క హామీనీ అమలు చేయలేకపోయారన్నారు. ప్రతి యేడాది 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న కేంద్రం ఒక్క ఉద్యోగం కల్పించకపోవడంతో పాటు నిత్యావసర సరుకుల ధరలను విపరీతంగా పెంచిందని విమర్శించారు. మహిళలను కించపర్చే విధంగా టిఆర్‌ఎస్ ప్రభుత్వం, మంత్రులు వ్యవహరించడం సరికాదన్నారు. తెరాస మంత్రివర్గంలో ఒక్క మహిళకు కూడా చోటు కల్పించకపోవడం దారుణమన్నారు. 2019లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రజా సమస్యలపై కార్యకర్తలు ప్రజల మధ్యే ఉంటూ కంకణబద్ధులై శ్రమించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఏ పథకాలు అమలు చేసిన ముందుగా గజ్వేల్, సిద్దిపేటకే ప్రాధాన్యమిస్తున్నారన్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రవేశపెట్టిన బంగారుతల్లి పథకాన్ని మాయం చేశారని, ఎస్సీ,ఎస్టీ చట్టాన్ని మింగేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగారెడ్డి మెడికల్ కళాశాలను సిద్దిపేటకు తరలించుకోవడం దుర్మార్గమన్నారు. వచ్చే యేడాది జూన్‌మాసం లోపు సంగారెడ్డికి మెడికల్ కళాశాలను తీసుకరాకుంటే సిఎం, మంత్రులను నిలదీస్తామన్నారు. మెడికల్ కళాశాల అంశాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, త్వరలో ఉద్యమ కార్యచరణ ప్రకటిస్తామన్నారు. అనంతరం కార్యకర్తలతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో మాజీ పిసిసి అధ్యక్షుడు పొన్నం లక్ష్మయ్య, మాజీ ఎంపి సురేష్‌షెట్కార్, జడ్పీటిసిల ఫ్లోర్ లీడర్ ప్రభాకర్‌రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పొన్న శంకర్‌రెడ్డి, నాయకులు తోపాజీ అనంతకిషన్, సాబేర్‌తో పాటు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.