మెదక్

క్యాష్ లెస్ ఎటిఎంలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట అర్బన్,మార్చి 5: జిల్లా కేంద్రమైన సిద్దిపేటలో బ్యాంకుల ఆధికారుల నిర్లక్ష్యం వినియోగదారులపాలిట శాపంగా మారింది. కేంద్ర ప్రభుత్వం 1000,500 రూపాయల పెద్ద నోట్లను రద్దు చేయడంతో మొదలైన కష్టాలు వినియోగదారులను వీడటం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. పెద్ద నోట్ల కష్టాలు గట్టెక్కాయి అనుకున్న వినియోగదారులకు వివిధ బ్యాంక్‌ల అధికారుల నిర్లక్ష్యం ములంగా సిద్దిపేట పట్టణంలో సమారు 45కు పైగా వివిధ బ్యాంక్‌ల ఏటిఎంలు ఉన్నప్పటీకిని అవి ఎప్పుడు పని చేయక పోవడంతో వినియోగాదారులు పడరాని పాట్లు పడుతున్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రం కావడంతో వినియోగాదారుల తాకిడి మరింత పెరిగింది . మార్చి నెల మొదటి వారంలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు వేతనాలు తీసుకునేందుకు ఏటిఎంలకు వెళ్లితే అన్ని ఎటిఎంలు ఖాళీగా ఉండి దర్శనం ఇస్తున్నాయి. కొన్ని బ్యాంక్‌ల ఎటిఎంలైతే మూసివేసి దర్శనం ఇస్తున్నాయి. ప్రభుత్వ దత్తత బ్యాంక్ ఎస్‌బిహెచ్ మాత్రం ఆర్భాటంగా ఈ=కనెక్టు పేరిట గద్ద బొమ్మ ఏర్పాటు చేసిన గది ఎప్పుడూ ఖాళీగానే కనిపిస్తుంది. అందులో క్యాష్ డిపాజిట్, ట్రాన్స్‌ఫర్, విత్‌డ్రాలు తదితర సౌకర్యాలు ప్రజలకు అందుబాటులో ఉంటాయని చెప్పినా అక్కడ ప్రజలకు పూర్తి స్థాయిలో సేవలు అందడంలేదనే విమర్శలు వ్యక్తం ఆవుతున్నాయి. ఈ కనెక్టులో పూర్తి స్థాయిలో అందేలా చర్యలు తీసుకోవడంలో అధికారులు ఘోరంగా విఫలమైనారనే ఆరోపణలు వస్తున్నాయి. పెట్రోల్ బంక్‌లు, బస్టాండ్‌లు, ప్రధాన రహదారులపైన ఏర్పాటుచేసిన ఎటిఎంలు ఏనీటైం నో మనీ అన్న చందంగా మారయనే విమర్శలు వస్తున్నాయి. నెల మొదటి వారం కావడంతో వివిధ అవసరాల కోసం ఎటిఎంలలో డబ్బుల కోసం ప్రజలు చక్కర్లు కొట్టడం పరిపాటిగా మారింది. ఆదివారం, రెండవ శనివారం, ఇతర పండుగలు వస్తే చాలు ఎటిఎంలలో డబ్బులు పెట్టడంలో అధికారులు పట్టనట్లు వ్యవరించడంవల్లనే ఈ పరిస్థితి దాపురించిదనే ఆరోపణలు వ్యక్తం ఆవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు వినియోగదారులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు,వినియోగాదారులు కోరుతున్నారు.